Crashes

కుప్పకూలిన హెలికాప్టర్..

Updated By ManamSat, 09/08/2018 - 17:04
  • నేపాల్‌లో ప్రమాదం.. దట్టమైన ఫారెస్ట్‌లో ఘటన

  • అదృశ్యమైన చాపర్‌లో ఏడుగురు ప్రయాణికులు..

  • పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం..

  • ఒక మహిళ‌ను రక్షించిన సహాయక సిబ్బంది  

  • ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో మిస్సింగ్ 

Missing chopper, crashes, Nepal, air traffic control towerఖాట్మాండు: అదృశ్యమైన అల్టిట్యూడ్ ఎయిర్‌లైన్‌ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ నేపాల్‌లోని ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో ధాడింగ్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఖాట్మాండులోని గోర్ఖా జిల్లా శామగాన్ మీదుగా వెళ్తున్న చాపర్.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ టవర్‌తో ఉదయం 8.05 గంటల ప్రాంతంలో సంబంధాలు తెగిపోయినట్టు ఖాట్మాండు పోస్టు నివేదించింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో జపాన్ పర్యాటకుడు సహా ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఆరుగురు నేపాలీయులుగా అల్టిట్యూడ్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిమ నురు షేర్పా పేర్కొన్నారు. పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, ఒక మహిళ ప్రయాణికురాలిని అధికారులు రక్షించారు. 

ధాడింగ్ జిల్లాలో ఖాట్మాండుకు 50 కిలోమీటర్ల దూరంలో చాపర్ కుప్పకూలినట్టు స్థానిక మీడియా నివేదించింది. అదృశ్యమైన హెలికాప్టర్ సత్యవతి అనే దట్టమైన అడవిలో కుప్పకూలినట్టు నేపాల్ పౌర విమానాయ అధికారులు ధృవీకరించారు. 5500 అడుగుల లోతున్న అల్టిట్యూడ్ అటవీ ప్రాంతంలో కుప్పకూలిన చాపర్ కోసం గాలించేందుకు సహాయక చర్యలు చేపట్టనప్పటికీ.. వాతావరణం అనుకూలించడం లేదని అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. హెలికాప్టర్ నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉదయం 8.18 గంటల ప్రాంతంలో చేరుకోవాల్సి ఉందని, అంతలోనే ఈ ప్రమాదం జరిగిందని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం జనరల్ మేనేజర్ రాజ్ కుమార్ ఛెత్రి తెలిపారు. చార్టర్డ్ ఫ్లైట్ కూలి ఐదుగురి మృతి

Updated By ManamThu, 06/28/2018 - 14:23
Chartered plane crashes

ముంబయి : చార్టర్డ్ విమానం కూలిన ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన ముంబయిలోని ఘాట్కోపర్‌లో గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌, ముగ్గురు ప్రయాణికులతో పాటు ఓ పాదచారి మృతి చెందినట్లు ముంబయి పోలీసులు ధ్రువీకరించారు. విటి-యుజిఎ, కింగ్ ఎయిర్ ఐసిసి 90 విమానం మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా జనావాసాల మధ్యే కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విమానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందినది.

మరోవైపు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పాటు మంటలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.శిక్షణ చాపర్ కూలి.. ఏడుగురి బుగ్గి

Updated By ManamFri, 10/06/2017 - 14:10
  • భారత-చైనా సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద ఘటన

తవాంగ్, అక్టోబరు 6: వారంతా భారత వైమానిక దళంలోని శిక్షణా అభ్యర్థులు! పొద్దుపొద్దున్నే శిక్షణ నిమిత్తం బయల్దేరారు! ఎయిర్ మెయింటెనెన్స్‌ శిక్షణలో భాగంగా భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 వీ5 చాపర్‌ ఎక్కారు. వాతావరణం అనుకూలించకపోవడమో.. లేదా సాంకేతిక కారణాలో తెలియదు గానీ, వారి చాపర్ గాల్లోకి లేచి కొద్ది దూరం వెళ్లగానే కుప్పకూలిపోయింది. పేలి మంటల్లో చిక్కుకుని ఏడుగురిని బుగ్గి చేసింది. ఈ విషాద ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత-చైనా సరిహద్దుల్లోగల తవాంగ్ వద్ద శుక్రవారం జరిగింది. ప్రమాద విషయాన్ని భారత వాయుసేన ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో దుర్ఘటన సంభవించినట్టు వైమానిక దళ అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సహాయ చర్యల నిమిత్తం బృందాలు రంగంలోకి దిగాయని, గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని వెల్లడించారు. 

Related News