donald trump

హిందువులను మరిచారు!

Updated By ManamWed, 11/14/2018 - 22:47
 • వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి సంబరాలు

 • ట్వీట్‌లో హిందువుల విస్మరణ

 • రెండుసార్లు అధ్యక్షుడి అదే తప్పు

 • మూడోసారి సరిచేసుకున్న ట్రంప్

 • నెటిజన్ల నుంచి విమర్శల వెల్లువ

trumpవాషింగ్టన్: అవెురికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో దీపావళి ఘనంగా చేసుకున్నారు. అయితే, దీపావళి శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్‌లో హిందువులను ప్రస్తావించడం మర్చిపోయారు. ఒకసారి కాదు.. రెండుసార్లు ఆయన తప్పులో కాలేశారు. దాంతో ఒక్కసారిగా నెటిజన్లు అందరూ మండిపడటంతో.. ఆ తర్వాత ఎట్టకేలకు మళ్లీ దాన్ని సరిచేసుకున్నారు. వైట్‌హౌస్‌లోని చారిత్రక రూజ్‌వెల్ట్ రూంలో దీపావళి సంబరాలను ట్రంప్ నిర్వహించారు. భారత సంతతికి చెందిన ప్రముఖ అవెురికన్లతో పాటు, భారత దౌత్యవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు పలువురు ఈ సంబరాలకు హాజరయ్యారు. తొలిసారి ట్వీట్ చేసినపుడు అత్యధిక సంఖ్యలో ఈ పండుగను జరుపుకొనే హిందువులను ఆయన మర్చిపోయారు. ‘‘దీపావళి పండుగ సంబరాలు చేసుకోడానికి మనమంతా కలిశాం. ఈ పండుగను అవెురికాలోను, ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులు, సిక్కులు, జైనులు జరుపుకొంటారు. కోట్లాడి మంది ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపాలు వెలిగించి కొత్త సంవత్సరం ఆరంభాన్ని సూచిస్తారు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. దాంతోపాటు వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమం యూట్యూబ్ లింకును కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇందులో హిందువులను ఆయన ప్రస్తావించలేదన్న విషయాన్ని నెటిజన్లు వెంటనే గుర్తించారు. ఇది హిందువులకు పెద్ద పండుగ అని సీఎన్‌ఎన్ కాంగ్రెషనల్ కరస్పాండెంట్ మను రాజు ట్వీట్ చేశారు. వెంటనే ట్రంప్ తన పాత ట్వీట్‌ను డిలిట్ చేసి, మరోటి పోస్ట్ చేశారు గానీ, అందులోనూ అదే తప్పు చేశారు. రెండోసారి కూడా హిందువుల పేరు మరిచారు. దీన్ని కూడా మను రాజు ఎత్తిచూపారు. ఈసారి పలువురు ట్రంప్ తీరును తప్పుబట్టారు. వెంటనే దాన్ని కూడా డిలీట్ చేసి, మూడోసారి ట్వీట్ చేశారు. ‘‘హిందువుల దీపాల పండుగ అయిన దీపావళి సంబరాలకు ఆతిథ్యం వహించడం నాకు చాలా గౌరవం. వైట్‌హౌస్‌లోని రూజ్‌వెల్ట్ రూంలో ఈ సంబరాలు చేశాం. చాలా, చాలా ప్రత్యేకమైన వ్యక్తులు’ అని మూడో ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చేసిన తప్పును చాలామంది నెటిజన్లు ట్విట్టర్‌లో ఎత్తి చూపినా, దానికి వైట్‌హౌస్ మాత్రం ఏమీ స్పందించలేదు. టైమ్ పత్రిక కూడా ఒక వ్యాసంలో ట్రంప్ తన దీపావళి ట్వీట్‌లలో హిందువులను మరిచారని విమర్శించింది. ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు చేసుకున్న నవంబరు 7వ తేదీన మాత్రం ట్రంప్ ఒక ట్వీట్ చేసి, అందులో సరిగానే రాశారు. ‘‘దీపాల పండుగగా పేరొందిన దీపావళి చాలా ఆనందకరమైన, ఆధ్యాత్మిక సమయం. దీన్ని చాలామంది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు చేసుకుంటారు’’ అని అప్పట్లో ఆయన ట్వీట్ చేశారు. గణతంత్ర వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

Updated By ManamSun, 11/11/2018 - 08:08

South Africa Presidentన్యూఢిల్లీ: ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాను ఆహ్వానించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రధాని మోదీ ఓ ప్రకటన చేయొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ గణతంత్ర వేడుకలకు మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకున్నారు. కానీ ఇతర కారణాల వలన ఆయన హాజరు కావడం లేదంటూ వైట్‌హౌస్ తెలపడంతో ఇప్పుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిని పిలవాలనే ఆలోచనలో భారత ప్రభుత్వం ఉంది.అమెరికాలో పుట్టినా పౌరసత్వం నో: ట్రంప్

Updated By ManamWed, 10/31/2018 - 01:17

trump-with-childrensవాషింగ్టన్: విదేశీయులు, విదేశీ నిపుణులు లక్ష్యంగా పలువివాదాస్పద నిర్ణ యాలు తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే అవ కాశాలు ఉన్నాయి. అమెరికాలో పుట్టిన చిన్నారు లకు జన్మత వచ్చే పౌరసత్వం హక్కును తొల గించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.  అమెరి కాలోని నిబంధనల ప్రకారం.. ఎవరైనా అమెరి కాలో జన్మిస్తే వారికి రాజ్యాంగం ప్రకారం పౌర సత్వం లభించడం జన్మహక్కుగా లభిస్తుంది. అక్రమంగా అమెరికాలోకి చొరబడిన వారికి పిల్ల లు పుడితే వారికి దేశ పౌరసత్వం లేకుండా చే యాలని భావిస్తున్నానని, ఈ ప్రతిపాదనను వైట్‌హౌజ్ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని ట్రం ప్ వెల్లడించారు. మధ్యంతర ఎన్నికలు జరగను న్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకు నేందుకు ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు.నేను రావట్లేదు!

Updated By ManamMon, 10/29/2018 - 06:59
 • రిపబ్లిక్ వేడుకలకు ట్రంప్ డుమ్మా

 • భారతదేశం ఆహ్వానం తిరస్కరణ

 • రష్యన్ ఎస్-400 కొనుగోలే కారణం

 • ఇరాన్ చమురు కొనుగోలు కూడా

 • అదేరోజు వేరే కార్యక్రమాలున్నాయట!

 • పైకి అమెరికా చూపుతున్న సాకు ఇదీ

trumpవాషింగ్టన్: రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని భారత దేశం ఇచ్చిన ఆహ్వా నాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. తాను రావడం లేదని స్పష్టం చేశారు. రష్యానుంచి ఎస్-400 మిసైల్ వ్యవస్థను మన దేశం కొనుగోలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉంది. ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా హెచ్చరిక స్వరం వినిపించింది. దానికితోడు.. ఇప్పటికే ఆంక్షలు విధించిన ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను కూడా భారత్ కొనసాగిస్తోంది. మన ఇంధన అవసరాలకు చాలావరకు ఇరాన్ మీదే ఆధారపడిన నేపథ్యంలో అమెరికా ఆంక్షలను తోసి రాజని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి ప్రధాన కారణాల వల్లే ట్రంప్ భారతదేశానికి రావడం లేదని తెలుస్తోంది. కానీ, అధికారికంగా మాత్రం.. సరిగ్గా అదే రోజుకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని, అందువల్లే ట్రంప్ రాలేకపో తున్నారని ఆయన యంత్రాంగం పైకి ప్రకటించింది. సరిగ్గా రిపబ్లిక్ వేడుకల సమయానికే స్టేట్ ఆఫ్ ద యూనియన్ (సోటు) ప్రసంగం చేయాల్సి ఉందని, అందువల్ల రావడం లేదని చెబుతున్నారు. సాధారణంగా ఆ ప్రసంగాన్ని జనవరి 22 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు తప్ప కచ్చితంగా ఫలానా రోజునే ఇవ్వాలని ఏమీ లేదు. అయినా తమ ప్రయోజనాలను కాదని వేరే వారితో సంబంధాలు కొనసాగిస్తుండటంతో భారత్ విషయంలో అమెరికా కాస్త గుర్రుగా ఉంది. ఇప్పుడు ట్రంప్ రావడం లేదన్న విషయం ఖరారు కావడంతో రిపబ్లిక్ వేడుకలకు వేరే దేశాధినేతను ముఖ్యఅతిథిగా చూసుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ ఫోన్ కాల్స్ ట్యాప్!

Updated By ManamThu, 10/25/2018 - 23:11
 • చేస్తున్న చైనా, రష్యా అధికారుల 

 • ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం

trumphవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్‌నకూ ఫోన్ ట్యాపింగ్ సమస్య తప్పట్లేదా? అంటే అవుననే అంటోంది ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు.. ట్రంప్ ఫోన్‌కాల్స్‌ను చైనా, రష్యా ట్యాపింగ్ చేస్తున్నాయి. ఆయన  ప్రతి మాటనూ ఆ రెండు దేశాలు వింటున్నాయని తమకు తెలిసిందని ఈ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. నేరుగా ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడకూడదని, ఇది భద్రతాపరమైన సమస్యలను కొనితెస్తుందని నిఘా వర్గాలు వెల్లడించినా ట్రంప్ పట్టించుకోవట్లేదట. దాంతో ఆయన సంభాషణలను రష్యా, చైనాలు యథేచ్ఛగా వినగలుగుతున్నాయని తెలిపింది. ట్రంప్ వాడే ఐఫోన్ వివరాలు అనేక మంది అధికారులకు, మాజీ అధికారులకు కూడా తెలుసునని కూడా వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా, చైనా గూఢచారులు పని సులువవుతోందని తెలిపింది.‘మీటూ’పై ట్రంప్ హేళన!

Updated By ManamThu, 10/11/2018 - 23:02

trumpవాషింగ్టన్: మహిళలు తాము ఎదు ర్కొన్న లైంగిక వేధిం పులను ‘మీ టూ’ ఉద్యమంలో వెల్ల డిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాన్ని హేళన చేస్తూ  వ్యాఖ్యలు చేశారు. ‘‘దగ్గరి వాళ్లు దూరం కావడం’’ అనే పదబంధాన్ని ఈ ఉద్యమ సందర్భంగా ఉపయోగిస్తున్నారని, ఆ పదం ఈ దీనికి సరిపోదని అన్నారు. ‘‘మీ టూ నిబంధనల ప్రకారం..ఆ పదబంధాన్ని ఉపయోగించే అవకాశం లేదు. నేను ఉపయోగించలేను. ఆ పదం బదులు.. ‘ఆ మహిళ దూరం కావడం’ అనే పదబంధాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని అన్నారు. పెన్సిల్వేనియాలో నిర్వహించిన మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాంక.. ఓ డైనమైట్!

Updated By ManamWed, 10/10/2018 - 22:48
 • నా కూతురు రాయబారి పదవికి సరిపోతారు

 • నిక్కీ స్థానంలో ఆమెను నియమించేవాడిని

 • కానీ.. బంధుప్రీతి అని విమర్శిస్తారేమో..!

 • మనసులో మాట వెల్లడించిన ట్రంప్

 • మీడియాతో సమావేశంలో అమెరికా అధ్యక్షుడు

trump-and-ivankaవాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ రాజీనామా చేయడంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసులో మాట బయటపెట్టారు. ‘‘నా కూతురు డైనమెట్ వంటిది.ఐరాసలో రాయబార పదవికి  సరిగ్గా సరిపోతారు. అన్ని అర్హతలూ ఉన్నాయి. నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకకి ఉందనుకుంటున్నా. ఇవాంక సామర్థ్యం గురించి ప్రజలకు తెలియజేయాలనుకున్నా. కానీ మీకు తెలుసు, నేను బంధుప్రీతితో చేస్తున్నానని అంతా ఆరోపిస్తారు’’ అని బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.  అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు. మంగళవారం నిక్కీ హేలీ ఐరాసలో రాయబారి పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక కారణాలేమిటో తెలియరాలేదు. కాగా, ఈ పదవికి అనేక మందిని పరిశీలిస్తున్నామని ట్రంప్ చివర్లో పేర్కొనడం గమనార్హం.నిక్కీ స్థానాన్ని నేను భర్తీ చేయలేను: ఇవాంకా

Updated By ManamWed, 10/10/2018 - 11:01

Ivanka Trump, Nikki Haleyవాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి పదవికి భారత సంతతి నిక్కీ హేలీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఊహాగానాలు లేకుండా అకస్మాతుగా ఆమె రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు నిక్కీ స్థానంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ని నియమిస్తారనే వార్తలు హల్‌చల్ చేశాయి.

దీంతో ఈ వార్తలపై స్పందించిన ఇవాంకా.. ‘ప్రస్తుతం నేను వైట్‌ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదు అంటూ పేర్కొన్నారు.

మరోవైపు 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే నిక్కీ హేలీ రాజీనామా చేసి ఉంటారని ప్రచారాలు జోరందుకున్నాయి. దీనిపై స్పందించిన నిక్కీ హేలీ.. ‘‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా’’ అంటూ పేర్కొన్నారు.అమెరికానే ‘అభివృద్ధి చెందుతున్న దేశం’

Updated By ManamSat, 09/08/2018 - 22:30
 • భారత్, చైనాలకు సబ్సిడీలను నిలిపేస్తాం

 • ఆ రెండు దేశాలు వేగంగా పురోగమిస్తున్నాయి

 • విరాళాల సేకరణ సభలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్

trumpషికాగో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. భారత్, చైనాలకు తమ దేశం అందిస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ‘అభివృద్ధి చెందుతున్న దేశమని’, కాబట్టి అది ఇతరుల కన్నా ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. ఉత్తర డకోటాలోని ఫార్గో నగరంలో  నిర్వహించిన పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్ని దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పరిగణిస్తున్నాం. కొన్ని దేశాలు ఇంకా ఎలాంటి పరిణతి సాధించలేదు. అలాంటి దేశాలకు మనం సబ్సిడీలు అందిస్తున్నాం. ఇదంతా గమ్మత్తయిన అంశం. ఈ జాబితాలో ఇండియా, చైనా కూడా ఉన్నాయి. కానీ అవి పురోభివృద్ధిలో ఉన్నాయి. ఆ దేశాలు తమంతతాముగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పిలుపుచుకుంటాయి. ఈ కేటగిరీలో అవి సబ్సిడీలు పొందుతున్నాయి. మన డబ్బును వాటికి చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా గమ్మత్తయిన వ్యవహారం. దీనిని  మేం ఆపేస్తాం. దీనిని ఆపేయాల్సిందే. వాస్తవానికి అమెరికానే అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ కేటగిరీలోనే అమెరికాను చేర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే.. మనం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇతరులకన్నా అత్యంత వేగంగా పురోభివృద్ధిలో పయణించాల్సి ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మరింత దారుణంగా తయారైందని, అందులోని వ్యక్తులు చైనాకు అనుకూలంగా ఉన్నారని అన్నారు. చైనా ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అనుమతి ఇస్తున్నారనే విషయాన్ని డబ్ల్యూటీవోలోని కొందరు వ్యక్తులకు తెలియనే తెలియదని అన్నారు. తాను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు  పెద్ద అభిమానినని, అయినా వాణిజ్యంలో పారదర్శకంగా వ్యవహరించాలని  ఆయనకు సూచించానని అన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లు దాటడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు. కొన్ని ధనిక దేశాలకు అమెరికా రక్షణగా ఉంటోందని, కాబట్టి ఆ దేశాలు అమెరికాకు ఎంతోకొంత మొత్తం చెల్లింపులు చేయాల్సిందేనని అన్నారు. ఈ అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. ట్రంప్‌పై కంపెనీల తిరుగుబాటు

Updated By ManamSat, 08/25/2018 - 06:31
 • మీ వలస విధానాలు మాకు చేటు

 • అమెరికా పోటీతత్వానికి హానికరం

 • అధ్యక్షుడికి 59 దిగ్గజ సీఈవోల లేఖ

trumpన్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలసవాద వ్యతిరేక విధానాలపై ఆ దేశ దిగ్గజ కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి. విదేశీ నిపుణులకు హెచ్1బీ వీసా మంజూరు విషయంలో అనుసరిస్తున్న విధానాలతోపాటు పాలనా పరమైన విధానాల్లో స్థిరత్వం లేకపోవడంపై ఆందోళన చెందుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే తమ కంపెనీలు మనుగడ సాధించలేవని, చివరకు కంపెనీల పోటీతత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 59 దిగ్గజ కంపెనీలకు చెందిన సీఈవోలు శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్‌నకు ఓ లేఖ రాశారు. వీటిలో ఆపిల్, పెప్సికో, మాస్టర్‌కార్డ్, సిస్కో సిస్టమ్స్. జేపీ మోర్గాన్స్, వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకువస్తున్న మార్పులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని అందులో వారు పేర్కొన్నారు.  అస్థిరమైన వలస విధాన నిర్ణయాలు, ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లను తగ్గించడం వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులతో అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయే తప్ప, పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని తెలిపారు.

Related News