andhra pradesh

చంద్రబాబును సమర్థించిన మమతా

Updated By ManamFri, 11/16/2018 - 14:30
Chandrababu Naidu has done the right thing says mamatha

కోల్‌కతా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమర్థించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఏపీ సర్కార్ ఎత్తివేసిన విషయం తెలిసిందే. దీనిపై మమతా శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డడారు. 

కాగా ఢిల్లీ తప్ప ఇతర రాష్ట్రాల్లో తన అధికారులను వినియోగించుకునేందుకు సీబీఐకి సమ్మతి అవసరం. అయితే గత కొంతకాలంగా సీబీఐ ప్రతిష్ట మసకబారుతూ వస్తుండటంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర రంగ ఉద్యోగులపై దాడి చేసే అవకాశం సీబీఐకి ఉండదు. ఇక ఈ నిర్ణయం కేంద్రానికి చెంపపెట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ సంచలన నిర్ణయం తరువాత సీబీఐ పాత్రను ఏసీబీ పోషించే అవకాశం ఉంది.
 



బీజేపీ నమ్మించి మోసం చేసింది

Updated By ManamThu, 11/15/2018 - 19:30
chandrababu naidu

విశాఖ: భారతీయ జనతా పార్టీపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురువారం విశాఖలో మాట్లాడుతూ...సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని, సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల తీవ్ర సమస్యలు వచ్చాయని, రూపాయి విలువ పడిపోయిందని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 

దేశాన్ని కాపాడుకోవాలనే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నామని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం.. విభజన హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెబుతోందని, ప్రజలంతా మెచ్చేలా అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.



జనవరి 1న ఏపీలో హైకోర్టు ప్రారంభం

Updated By ManamMon, 11/05/2018 - 14:15
  • హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు పలు సూచనలు

Separate High Courts for Andhra pradesh from January 1st

న్యూఢిల్లీ :  అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు విభజనపై ఉన్నత న్యాయస్థానం సోమవారం పలు సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. నిర్మాణం కొనసాగుతున్నందున అప్పటివరకూ అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.  అలాగే అప్పటివరకూ జడ్జీల నివాసం కూడా అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

కాగా డిసెంబరు 15వ తేదీకల్లా హైకోర్టు అవసరాల నిమిత్తం తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు జడ్జీలు కూడా సుముఖంగా ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.
 



ఏపీలో టీడీపీ పనైపోయింది...

Updated By ManamFri, 11/02/2018 - 14:59
somu veeraju

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబుపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు  తిరుగుబాటు చేయాలని అన్నారు. ఏపీలో రావాల్సిన ప్రభుత్వమే వస్తుందని, తాము మళ్లీ భాగస్వాములం అవుతామన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు రాజకీయ దళారి, పచ్చి రాజకీయ వ్యభిచారి అంటూ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. 



ఏపీ ప్రజలు చంద్రబాబును క్షమించరు..

Updated By ManamThu, 11/01/2018 - 18:06
ambati rambabu slams chandrababu

విజయవాడ : చంద్రబాబు నాయుడు దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిశామంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ నాటకాల్లో కూడా చంద్రబాబు ఫెయిల్ అవుతారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరని అంబటి అన్నారు.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. కట్టుబట్టలతో వచ్చామని చంద్రబాబు ఊదరగొట్టారు. నేడు అందుకు కారణమైన కాంగ్రెస్‌తో చంద్రబాబు కలుస్తున్నారు. కాంగ్రెస్‌ను ఏపీ నుంచి పారద్రోలుతామని ఎన్టీఆర్ టీడీపీనీ స్థాపించారు.

చంద్రబాబు జీవిత చరిత్ర అంతా వెన్నుపోటు రాజకీయాలే. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇందిరాగాంధీ పోటీ చేయమంటే పిల్లనిచ్చిన మామపైనే పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పంచన చేరి కుట్ర రాజకీయాలతో సీఎం అయ్యారు. ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు.

నరేంద్ర మోదీని అరెస్ట్ చేయాలని గతంలో చంద్రబాబు డిమాండ్ చేసి... ఆ తర్వాత అధికారం కోసం మోదీతో జతకట్టారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారు. పక్కరాష్ట్రంలో డబ్బులు పంచడానికి పోలీసులను వాడుకుంటున్నారు. మీకు మరో వ్యవస్థలను గురించే మాట్లాడే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్‌తో కలిసి మేము పోటీ చేశామా? కుట్ర రాజకీయాలు చేసిన వ్యక్తే చంద్రబాబు. ఇటలీ దెయ్యం సోనియాగాంధీని తరిమి కొట్టమంది చంద్రబాబు కాదా?. తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్ అని గతంలో ప్రచారం చేసి... ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో జత కడుతున్నావు. భావితరాల భవిష్యత్ అంటే నారా లోకేశ్ భవిష్యత్తా?. గత ఎన్నికల్లో మోదీ, పవన్‌తో కలిసి పోటీ చేశావు. 

అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా మహాకూటమి కట్టావు ఏమైందా మహాకూటమి. రాహుల్‌ని పప్పు అన్నది చంద్రబాబు కాదా?. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఆ హోదా కోసం ధర్మపోరాట దీక్షలని దొంగ దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయ వేత్త. బుద్ధి ఉన్న ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఓటు వేస్తారా?’ అని ప్రశ్నించారు.



ఏపీలో రాష్ట్రపతి పాలన...?

Updated By ManamMon, 10/29/2018 - 15:52
President rule in Andhra Pradesh?

అమరావతి : చంద్రబాబు, నరేంద్ర మోదీ నడుమ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఏపీ, ఢిల్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటి దోస్తులు నేడు దుష్మన్లు అయ్యారు. మోదీ పేరు ఎత్తితే బాబు కస్సుమంటున్నారు. అంతా ఆయనే చేశారంటున్నారు. ఇక ఏపీ విషయంపైనా కేంద్రం కూడా సీరియస్‌గా ఉన్నట్లు బహిరంగంగానే చర్చ సాగుతోంది.

అది నిజమనేలా తిత్లీ తుఫాను శ్రీకాకుళాన్ని కుదిపేసినా...వేలకోట్ల నష్టం వాటిల్లినా కనీసం హస్తిన పెద్దలు పట్టించుకున్న దాఖలాలు కానీ... పైసా విదిల్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరోవైపు ఐటీ దాడులు, విపక్షాల దూకుడుగా ఉండేలా మంతనాలు, ఇంకోవైపు గవర్నర్ నివేదికలు, ఎప్పుడేం జరగుతుందో తెలియని స్థితిలో ఆంధ్రా రాజకీయం ఉంది.

అస్థిరం నిజమేనా?
చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో చెప్పినట్లుగా ఏపీని అస్థిరం చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తుందా?. ఈ ప్రశ్నకు సమాధానం సులువుగా దొరకదు. కానీ ఆ దిశగా ఏమైనా జరుగుతున్నాయన్న అనుమానాలు మాత్రం టీడీపీ పెంచి పోషిస్తోంది. నిజానికి బీజేపీకి, మోదీకి ఏపీ అంటే పెద్ద లెక్కలోనిది కాదు. వారి తలనొప్పులు వారికి ఉన్నాయి. దేశంలో ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ వారు చేయాల్సింది చాలా ఉంది. మరి ఈ సమయంలో ఇలా చేస్తారా.. అన్నది ప్రశ్నార్థకమే.

President rule in Andhra Pradesh?

రాజకీయంగా ఆత్మహత్య
ఏపీ సర్కారుకు మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రభుత్వం మళ్లీ ప్రజల తీర్పు కోరాలి. ఎలా అనుకున్నా ఎన్నికల ముంగిట్లో పెట్టుకుని ఏ కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపచడం అన్నది జరగదు. పైగా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో కనుక ఈ సమయంలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ ప్రభావం డైరెక్ట్‌గా కేంద్రంపైనా పడుతుంది. అది నెగిటెవ్ రియాక్షన్‌కి దారి తీస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్షాలు ఏకమవుతాయి. ఇక ఏపిలో తీసుకుంటే అలా కనుక చేస్తే బాబు నెత్తిన పాలు పోసినవాడిగా మోదీ అవుతారు. బాబు ప్రభుత్వం కూలదోస్తే ఆ సానుభూతితో చంద్రబాబు హ్యాపీగా జనం మద్దతు పొంది గెలుస్తారు. ఇది కదా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రాజకీయం.

మరి ఎందుకు చిందులు...
ఇంతటి సున్నితమైన అంశాలు ఎన్నో రాష్ట్రపతి పాలన విధించాలంటే ఉన్నాయి. ఆ సంగతి బాబు కంటే ఎవరికీ ఎక్కువగా తెలియవు కూడా. మరి అన్ని తెలిసి ఆయన నా ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని గొంతు చించుకోవడం వెనుక కూడా రాజకీయమే ఉంది. ఆ విధంగా సవాల్ చేస్తున్నారు ఆయన. దమ్ముంటే కూలదోయండి అంటూ ముందుకు వస్తున్నారు. కానీ మోదీ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు కాబట్టి ఆ పని ఎప్పటికీ చేయరు. ఇదంతా బాబు అండ్ కో ఆడుతున్న డ్రామాగా బీజేపీ పెద్దలు అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు సాఫీగా పాలన చేసుకోవచ్చు. ఎలాంటి భయం లేదని కూడా బీజేపీ నేతలు భరోసా ఇస్తున్నారు.



ప్రమాదంలో ప్రజాస్వామ్యం: చంద్రబాబు

Updated By ManamSat, 10/27/2018 - 16:19
Andhra Pradesh CM Chandrababu Naidu Press Meet At Delhi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. చెప్పిన హామీలేవీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువస్తానని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. ‘దేశంలో పెట్రో ధరలు ఊహించని విధంగా పెరిగాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ దేశం విడిచిపోయినా పట్టించుకోవడం లేదు.  దేశంలో రైతులంతా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.  దేశానికి ఏకపార్టీ ఆధిపత్యం మంచిది కాదు.

ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర
ఏపీలో రాజకీయ పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోంది.  రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. తెలంగాణలో టీడీపీని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతు తీసుకున్నారు. ఆ పార్టీతో బీజేపీకి చీకటి ఒప్పందం ఉంది. నేర చరిత ఉన్న పార్టీలకు మద్దతు ఇస్తున్నారు. అందుకే ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నా. విభజన హామీలను కేంద్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదు.  వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకున్నారు.  

తిత్లీ, హుద్ హుద్‌ తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం. రాష్ట్రాల మధ్య ప్రధాని సమస్యలు సృష్టిస్తున్నారు. రాజ్‌నాథ్ రాష్ర్టానికి వచ్చికూడా తిత్లీ తుఫాను సాయం గురించి ఒక్కమాట మాట్లాడలేదు. విభజన హామీలు అమలు చేయాలని 29 సార్లు ఢిల్లీకి వచ్చా. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టేశాం. ఎన్డీయేతో విబేధించి బయటకు వచ్చిన వెంటనే మమ్మల్ని వేధిస్తున్నారు. ఐటీ రైడ్స్ పేరుతో ఏపీపై దాడులు చేశారు. పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది.

జగన్‌పై దాడి ఘటనపై బీజేపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే మాకేమీ సంబంధం. తమిళనాడు తరహాలో ఏపీలో కూడా కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  సీబీఐ విషయంలోనూ కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేదు. కీలక పదవుల్లో గుజరాతీలను నియమించారు. ఇవి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లవా?’ అంటూ ప్రశ్నలు సంధించారు.



ఏపీలో 14 మంది ఐపీఎస్‌‌లు బదిలీ

Updated By ManamTue, 10/23/2018 - 15:08
14 IPS officers transferred in Andhra Pradesh

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 14మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

బదిలీ అయిన అధికారుల వివరాలు...

  • కడప ఎస్పీ బాబూజీ అట్టాడకు విశాఖ రూరల్ ఎస్పీగా బదిలీ

  • చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబుకు గుంటూరు రూరల్‌  ఎస్పీగా బదిలీ

  • విశాఖ రూరల్ అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగికి నెల్లూరు ఎస్పీగా బదిలీ

  • విశాఖ లా అండ్ ఆర్డర్‌ డీసీపీ ఫకీరప్పకు  కర్నూల్ ఎస్పీగా బదిలీ

  • తిరుపతి అర్బన్‌ ఎస్పీ అభిషేక్ మహంతికి కడపకు బదిలీ

  • పార్వతీపురం ఓఎస్డీ విక్రాంతి పాటిల్‌కు చిత్తూరుకు బదిలీ

  • చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీగా బాధ్యతలు

  • విశాఖ రూరల్‌ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మకు  విశాఖ సిట్‌కు బదిలీ

  • గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజయవాడ లా అండ్‌ ఆర్డర్‌ కు బదిలీ

  • నెల్లూరు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు బదిలీ

  • కడప అడిషనల్‌ ఎస్పీ అద్మాన్‌ నయీం అస్మీకు  విశాఖ‌ లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ

  • కర్నూల్ ఎస్పీ  గోపినాథ్‌ జెట్టికి టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్‌ బాధ్యతలు

  • నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్‌కు గుంతకల్‌ రైల్వే ఎస్పీగా బాధ్యతలు

  • వెయిటింగ్‌లో ఉన్న రవీంద్రనాధ్‌ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్‌ బాధ్యతలు



3 నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు

Updated By ManamTue, 10/23/2018 - 12:31
  • ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

  • మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే

High Court orders to AP panchayat elections with in 3 months

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు అయింది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మాజీ సర్పంచ్‌ల పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం, స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.90ని కొట్టేసింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగులను నియమిస్తుందంటూ మాజీ సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.



ఏపీలో రాత్రి 12గం.వరకూ హోటల్స్

Updated By ManamMon, 10/15/2018 - 20:14
Hotels to remain open till midnight in Andhra pradesh

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హోటల్స్, రెస్టారెంట్లు ఇక అర్థరాత్రి 12 గంటల వరకూ అందుబాటులో ఉండనున్నాయి. హోటల్స్, రెస్టారెంట్ల సమయాన్ని రాత్రి 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 25 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హోటల్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది





Related News