TRS party

'అరాచకం సృష్టించేది టీఆర్ఎస్సే..'

Updated By ManamSat, 09/15/2018 - 19:32
 • ఎమ్మెల్యే బోండా ఉమ కౌంటర్ ఎటాక్.. 

MLA Bonda Uma Maheswara rao, TRS Leaders, Balka Suman, Palla Rajeswar reddy, TRS partyహైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు బాల్కా సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కౌంటర్ ఎటాక్ చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకం సృష్టించేది టీఆర్ఎస్సేనని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబ్లీ విషయంలో మహారాష్ట్రకు వంతపాడుతున్నట్టు టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ కామన్ క్యాపిటల్‌ అని బోండా ఉమ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌పై 2024 వరకు తమకు సర్వహక్కులు ఉంటాయని చెప్పారు. విభజన చట్టం ద్వారా తమకు ఇచ్చిన హక్కు ఇదేనని ఉమా తెలిపారు. అంతకుముందు చంద్రబాబుపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని సెక్షన్ 8ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఏపీ డీజీపీ ఆఫీసు టీడీపీ ఆఫీస్‌ (పొలిటికల్ డెన్)గా మార్చారని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో డబ్బుల సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. 'మహాకూటమి.. మహావైఫల్యం తప్పదు'

Updated By ManamWed, 09/12/2018 - 21:17
 • తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం.. 

 • విపక్షాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

Jupalli Krishnarao, Opposition parties, TRS party, KCR, Assembly elections, Massive allianceహైదరాబాద్: రానున్న ఎన్నికల్లో విపక్షాల మహాకూటమి మహా వైఫల్యం చెందబోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. రాష్ట్రం విశాల ప్రయోజనం కోసమే పొత్తులు కుదుర్చుకుంటున్నట్టు ప్రతిపక్షాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. ఈ సందర్భంగా జూపల్లి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచకపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఈ విశాల ప్రయోజనం ఎక్కడికి వెళ్ళింది ?  అని సూటిగా ప్రశ్న లేవనెత్తారు. కేవలం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను గద్దె దించడం అనే అవకాశవాదం కోసం ఈ మహా కూటమి ఏర్పడుతుందని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ భారీ సంఖ్యలో సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. సురేష్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ టికెట్ ఖరారైనా దాన్ని కాదనుకుని టీఆర్ఎస్‌లో చేరారని జూపల్లి ప్రశంసించారు. 

వనపర్తిలో కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి తాను ఘోరంగా ఓటమి పాలవుతున్నట్టు కార్యకర్తలతో అంటున్నారని, తనకు కాకుండా కాంగ్రెస్ టికెట్ వేరే వారికిచ్చినా బాగుండు అని చిన్నారెడ్డి అంటున్నారని మంత్రి జూపల్లి చెప్పారు. వనపర్తిలో ఈసారి నిరంజన్ రెడ్డి గెలవడం ఖాయమని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్‌ను మహా కూటమి, ఏ మాయల కూటమి ఏం చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని అడ్డుకుంటున్న చంద్రబాబు పార్టీని మహబూబ్ నగర్‌లో తరిమి కొడతారన్నారు. విజయవాడలో పాలమూరు రంగారెడ్డికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన బాబు పార్టీకి మహబూబ్ నగర్‌లో స్థానం లేదన్నారు. ఓట్లు అడిగేందుకు టీడీపీకి ఆ పార్టీతో కలుస్తున్న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎవరినో భయపెట్టి టీఆర్ఎస్ గెలవాలనుకోవట్లేదని, గతంలో ఉన్న ప్రభుత్వాలు భయ పెట్టినా ప్రజలు భయపడ లేదని, తెలంగాణ వాదానికే ఓటు వేశారని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. 'టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం..' 

Updated By ManamWed, 09/12/2018 - 18:08
 • తెలంగాణను అడ్డుకున్న శక్తులు ఒక్కటయ్యాయని విమర్శ

 • కొండగట్టు కారణంగా కేసీఆర్ రాలేకపోయారు... 

TRS-KTR, option, people, KCR, TRS party, Uttam kumar reddy, Congress party, Chandrababu naidu హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు విపక్షాలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ, బషిర్‌బాగ్‌లు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందని, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టే అవకాశం లభించిందన్నారు. 60ఏళ్లుగా రాబందుల్లా ప్రజలను పీక్కుతున్న వాళ్లు కావాలా.. రైతుబంధుగా నిలిచిన టీఆర్ఎస్‌ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన పార్టీలు ఒకవైపు.. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మరోవైపు ఉందని తెలిపారు. అపవిత్ర, నీచమైన పొత్తుతో ప్రజలకు ఓ మంచి అవకాశం లభించిందని చెప్పారు. తాగునీరు ఇవ్వకుండా చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయాని, ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని ముంచిన ఇద్దరు ఒక్కటవుతున్నారని విమర్శలు గుప్పించారు. కొండగట్టు ఘటన కారణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేకపోయారని చెప్పారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం పూర్తి చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీకి అడుగుదూరంలో నిలిచామన్నారు. కార్పొరేటర్ ఝాన్సీ రాకతో సెంచరీ కొట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.ఇంటింటి ప్రచారానికి సమాయత్తం

Updated By ManamWed, 09/12/2018 - 01:23
 • అభివృద్ధి, సంక్షేమమే తెరాస ప్రధానాస్త్రాలు  

హైదరాబాద్: తెరాస  శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి. ప్రతి పక్షాలు క్షేత్ర స్థ్ధాయికి చేరక ముందే తొలిదశ ప్రచారం ముగించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రచార సామాగ్రిని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 426 ప్రచారాంశాల తో నియోజక వర్గాల వారిగా కరపత్రాలను ముద్రిస్తున్నారు.   ప్రచార రథాలు  త్వరలోనే అభ్యర్ధులకు అంద చేయబోతున్నాయి. దాదాపు 70 నుండి 80 మంది అభ్యర్ధులు ప్రత్యేకంగా ప్రచార రథాల ను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన కాంగ్రెస్ అభ్యర్థ్ధులు పోటీలో ఉన్న నియోజక వర్గాలపైన తెరాస నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ్ద కనబ రుస్తోంది.

imageగత ఎన్నికల్లో అతి స్వల్ప మెజా రిటీతో ప్రతిపక్షాలు గెలిచిన నియోజక వర్గాల పైన దృష్టి కేంద్రీకరించబోతుంది.పోటీలో ఉన్న వారందరిని గెలిపించుకోవాలనే ఆలోచనలో కేసీఆర్  ఉన్నందున 100 రోజుల్లో 50 ఎన్నికల బహిరంగ సభలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థ్ధులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మరి కొందరు వినాయక చవితి తర్వాత ప్రచారం ప్రారంభిం చాలనే ఆలోచనతో ఉన్నారు. అభ్యర్థ్ధులను ప్రకటించినప్పటికీ చివరి నిమిషం లో పేర్లు తారుమారవుతాయనే భయంతో ఉన్న కొందరు అభ్యర్థ్ధులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటి వరకు రంగంలోకి దిగండని కొందరికి మాత్రమే సంకేతాలు అందాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో అత్యధికులు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నల్లగొండ, ఖమ్మం, మహ బూబ్‌నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రచారం కొంత ఆలస్యంగా ప్రారం భించే అవకాశం ఉంది.

మంత్రులు ఈటెల రాజేందర్, టి. హరీష్‌రావులు ఇప్పటికే జిల్లా నేతలతో సమావేశమయ్యారు. వరంగల్ జిల్లా నేతలు కూడా సమావేశం ఏర్పాటు చేసి తాజా పరిస్థితులను బేరీజు వేసుకున్నారు. ఆదిలాబా ద్ జిల్లాలో కూడా పలువురు అభ్యర్ధులు సీనియర్లను కలుసుకోవడం, ప్రజల మద్దతు ఉన్న నాయకులను ప్రచారంలో దింపడం జరు గుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్ నుండేఅభ్యర్థ్ధులు, రెబల్స్‌తో తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా నియోజక వర్గాల వారిగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ తదుపరి సభల తేదీలు త్వరలోనే ఖరారు చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ప్రతిపక్షాలు అభ్యర్థ్ధులను ప్రకటించక ముందే తొలి దశ ప్రచారం ముగించాలనే ఆలోచనలో పలువురు అభ్యర్థ్ధులు ఉన్నారు. పెన్షన్లు, కల్యా ణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, కుల వృత్తులకు సాయం, వ్యవ సాయానికి ని రంతర విద్యుత్, పంచాయతీలుగా గిరి జన తండాలు, మైనార్టీ సంక్షేమం, మరమగ్గాల ఆధునీకరణతో పాటు దాదాపు 426 అంశాలను ప్రచారం కోస ం గుర్తించారు. నియోజక వర్గాల వారిగా వివిధ పథకాల అమలును ప్రచారంలో పెట్టడం ద్వా రా ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలన్నారు.ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు: దత్తాత్రేయ

Updated By ManamMon, 09/10/2018 - 18:57

TRS Party, Bandaru Dattatreya, Central govt schemes, BJP govt న్యూఢిల్లీ: తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేసే దిశగా సన్నద్దమవుతున్నట్టు సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌తో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఢిల్లీలోని గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.

గొర్రెలు, గేదెల పంపకం, చేపల వితరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వీటన్నింటిపైనా విచారణ చేపడతామన్నారు. తెలంగాణలో పలు సాగునీటి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లకుపైగా కేటాయించారని తెలిపారు. దీన్‌ దయాళ్‌ పథకం కింద 34 ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. విద్యుత్‌, ఎత్తిపోతల పథకాల్లో అధిక నిధులు కేంద్రానివేనని దత్తాత్రేయ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌దే గేలుపు

Updated By ManamSat, 09/08/2018 - 22:54
 • సనాతన ధర్మ పరిరక్షణకుకృషిచేస్తున్న పార్టీకే హిందూధర్మం మద్దతు

 • శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి... జాతీయ అధ్యక్షులు అఖిల భారత హిందూ మహాసభ

trsహైదరాబాద్: త్వరలో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పార్టీకి అఖిల భారత హిందూ మహాసభ మద్దతు ఉంటుందని పేర్కొంది. అదిశగా టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని శ్రీ రామానుజ వ్రతధర జీయరుస్వామి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో హిందూధర్మం విషయంలో వీరు నిబద్ధతతో పనిచేస్తున్నాని ఆయన పేర్కోన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవలంబిస్తున్న ధార్మిక కార్యక్రమాలు దేశంలో మిగతా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. వారు అద్వితీయంగా నిర్వహించిన అయుత చండీయాగం యావత్తు హైందవ సమాజం దృష్టిని ఆకర్షించిందన్నారు. రాజ్యాంగ హోదాలో ఉండి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు అత్యంత భక్తిశ్రద్ధలతో లోక కళ్యాణం ఉద్దేశంతో నిర్వహించిన ఈ మహాయాగం సనాతన దర్మ పరిరక్షణకు దోహదపడిన అపూర్వఘట్టమని ఆయన పేర్కోన్నారు. సుమారు వేయి కోట్లతో యాదాద్రి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా పునర్నిర్మిస్తుండటం, ఇంకా వందలాది కోట్లతో భద్రాచలం, వేములవాడ, బాసర తదితర క్షేత్రాలను అభివృద్ధిపరుస్తుండటం, ఇంకా పురాతన దేవాలయాల పునరుద్ధరణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుండటం,మూడు వేలకు పైగా ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకంతో భాగంగా ప్రతినెలా ఆరు వేల రూపాయలు ఇస్తుండటం తదితర ధార్మిక కార్యకలాపాలు భారతీయ సంస్కతి పరిరక్షణకు జవసత్వాలను కలిగించడమే కాక హిందూ సమాజానికి గొప్ప మేలు చేయటమేనని అఖిల భారత హిందూ మహాసభ భావిస్తున్నదని చెప్పారు. స్వామీజీలు, పీఠాధిపతులు, సంతులు, ఆధ్యాత్మికవేత్తలను అయుత చండీయాగం, పుష్కరాలు, ఇతర ధార్మికోత్సవాల్లో తగిన వధంగా గౌరవించటం, ధార్మిక విషయాలపై వారు తగిన సలహాలను తీసుకుంటుండటం గొప్పవిషయం. పలు హిందూ పండగలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ పక్షాన రాష్ట్ర పండగలుగా ప్రకటించి వైభవంగా నిర్వహిస్తుండటం ముఖ్యమంత్రి చంద్ర శేఖరరావు ధర్మ నిబద్ధతకు నిదర్శనమన్నారు. శనివారం హిందూ సమాజానికి పెద్దదిక్కుగా, గొప్ప దార్శనికుడిగా అందరి మన్ననలను అందుకుంటున్న వారికి అఖిల భారత హిందూ మహాసభ పక్షాన పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో వారు ఘన విజయం సాధించి తెలంగాణ రాష్ట్రం ఒక ధార్మిక రాష్ట్రంలో దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చేయూతనిచ్చి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికై ధర్మ రాజ్యం దిశగా తెలంగాణను ముందుకు తీసుకువెళ్లేలా యావత్తు హైందవ సమాజం కృషి చేయాలని అఖిల భారత హిందూ మహాసభ తరపునా పిలుపునిస్తున్నామని ...మంగళా శాసనములతో కేసీఆర్ సీఎం కావాలని ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో చెప్పారు.టీఆర్ఎస్‌కు ముఖ్య నేత గుడ్‌బై?

Updated By ManamSat, 09/08/2018 - 20:31

Former MP, Ramesh Rathode, TRS Party, Kanapur TRS candidate ఆదిలాబాద్: టీఆర్‌ఎస్‌లో టికెట్ల దక్కని నేతల్లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. కేసీఆర్ పక్కన పెట్టిన అసంతృప్తి నేతలు మెల్లగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా రేఖనాయక్‌ను ప్రకటించడంపై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. తనను ఇతర పార్టీలు ఆహ్వానిస్తున్నాయని, త్వరలోనే ఏ పార్టీలో చేరే విషయమై నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

తన అనుచరుల సూచన మేరకు ఖానాపూర్ నుంచే పోటీ చేస్తానని రాథోడ్ స్పష్టం చేశారు. ‘‘టీఆర్‌ఎస్‌కు నా బలం ఏంటో చూపిస్తా. టికెట్ హామీతోనే నేను టీఆర్ఎస్‌లో చేరాను. నాకు అన్యాయం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గం రేఖానాయక్ జాగీరు కాదు. కమీషన్ల కోసం ప్రజాప్రయోజనాలను రేఖానాయక్ తాకట్టు పెట్టారు’’ అని రాథోడ్‌ విమర్శించారు. తొలి జాబితాలో నలుగురు మహిళలకు చోటు

Updated By ManamThu, 09/06/2018 - 23:06

imageహైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అభ్యర్థుల తొలి జాబితాలో నలుగురు సిట్టింగ్ మహిళలకు చోటు దక్కింది. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం టీఆర్‌ఎస్ భవన్‌లో తొలి విడతగా 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వారిలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి గొంగిడి సుజాత, అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నుంచి రేఖానాయక్, అసిఫాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మి, మెదక్ నుంచి ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నారు.

డీకే అరుణ తమ్ముడు రామ్మోహన్ రెడ్డికి టికెట్
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ లోకి ఫిరాయించిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి టిక్కెట్ దక్కింది. గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణకు రామ్మోహన్ రెడ్డి స్వయానా తమ్ముడు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఫిరాయించారు.

రిజర్వుడు స్థానాల్లో ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరణ
టీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించిన 105 మంది జాబితాలో  రిజర్వుడు స్థానాలకు సంబంధించి ఇద్దరు  తాజా మాజీ ఎమ్మెల్యేలకు  టికెట్లు దక్కలేదు.  ఆంధోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ , మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే  నల్లా ఓదేలుకు టికెట్ నిరాకరించారు. బాబూ మోహ న్ స్థానంలో సీనియర్ జర్నలిస్టు సి క్రాంతి కిరణ్‌ను అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.ముందస్తు ఎన్నికల్లో మైనారిటీల ఓట్లే కీలకం  

Updated By ManamThu, 09/06/2018 - 23:00

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో మైనారిటీల ఓట్లు కీలక భూమిక పోషించబోతున్నాయి. మైనారిటీలను కాంగ్రెస్ ఆకట్టుకుంటుందనే భయంతోనే అధికార తెరాస ముందస్తు ఎన్నికలకు పోతుందనే చర్చ  రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. తెరాస అధికారంలోకి  రాక ముందు ముస్లీం మైనారిటీలు కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. తెదేపా అధికారంలో ఉన్న కాలంలో కూడా అత్యధికులైన మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓట్లేసిన దాఖలాలు ఉన్నాయి. తెరాస ఎన్నికల బరిలోకి దిగడం, అధికారంలోకి రావడం, మజ్లీస్‌తో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడంతో  మైనారిటీల అండ తమకు దండిగా ఉందని తెరాస భావిస్తుంది. మజ్లీస్‌లో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించడంతో పాటు వారి ప్రయోజనాలు పరిరక్షించడంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారనే వాదన వినబడుతుంది.

image


మైనారిటీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా  ఆ వర్గాలను ఎంతగానో ప్రభావితం చేసిందనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణలోని సుమారు 40 నియోజక వర్గాల్లో ముస్లీం ఓటర్ల ప్రభావం ఉంటుందని అధికార తెరాస భావించింది. మరో 12 నియోజక వర్గాల్లో 20 నుండి 30 వేల వరకు ముస్లీం మైనారిటీలు ఉన్నారనే గణాంకాలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్న  44.65 లక్షల మంది ముస్లీంలలో 17.13 లక్షల మంది హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ముస్లీంలకు రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఉపాధి అవకాశాలు మెరుగపరిచింది.

 రైతులు, ఉద్యోగులు, ముస్లీంలను తెరాస బలంగా భావించడం వల్లనే ముందస్తుకు వెళ్లడం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వర్గాల అండదండలను ఓటుగా మలచుకొనేందుకే పక్కా ప్రణాళికతో ముందస్తుగా ఎన్నికల బరిలోకి పోతున్నామని తెలిపారు. జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాతో సయోధ్య కొనసాగిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో మంచి అవగాహన కలిగి ఉన్నారు. దూకుడు పెంచిన టీఆర్‌ఎస్

Updated By ManamThu, 09/06/2018 - 00:13
 • ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్

 • 50 రోజుల్లో 100 బహిరంగ సభలు! 

 • 7న హుస్నాబాద్ సభతో తొలి అడుగు

 • తమ 4 ఏళ్ళ ప్రగతితో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్

imageహైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఎన్నికలు సమిపిస్తున్నాయంటూ చెబుతున్న అన్ని పార్టీల నేతల వాదనకు బలం చేకురినట్లయ్యింది. ఎన్నిక లు ఎప్పుడూ వచ్చిన తామంతా అందుకు సిద్దంగానే ఉన్నామని ఎవరికి వారు రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఏ ఇద్దరూ ఎక్కడ కలిసినా అందరి నోట ఎన్నికల మాటే వినపడ్తుండటం చూస్తుంటే...ముందస్తు ఎన్నికలు వచ్చేలా ఉన్నాయనడంలో సందేహం కలుగక మానదు. ఇక, ఇదంతా ఒక ఎత్తయితే, ఆదివారం టీఆర్‌ఎస్ పార్టీ జరిపిన ప్రగతి నివేదన సభలో గులాబి బాస్ ముందస్తు..ఎన్నికలకు సంకేతాలు ఇస్తారన్న అనుమానాలను పటాపంచెలు చేయడంతో.. ప్రతి పక్షాలన్ని టీఆర్‌ఎస్‌పై మండిపడుతూనే...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందస్తుకు సిద్దమేనని అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు.

అధికార పార్టీ తన నాలుగేళ్ల అభివృద్ధితో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంద నే ఊహగానాలే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఆ వార్తాలను నిజం చేసే విధంగా నేడో..రేపో గులాబి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశమే ఎక్కువగా ఉందన్న వార్తలు సైతం అన్ని పార్టీల్లో చర్చకు తెరతీస్తున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్‌ఎస్ తన ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేసింది. ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. గత వారం రోజులుగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాల నేపథ్యంలో అధికారుల భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గత పది రోజుల్లోనే తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ రెండు సార్లు భేటి అయ్యారు. ఇదిలా ఉండగానే సీఎం కలిసిన రెండు, మూడు రోజుల తర్వాత ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి సమావేశమయ్యారు.

ఈ భేటీకి ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అటు సీఎస్‌తో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతకు ముందు రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రవేశపెట్టిన ఆధునిక సాఫ్ట్‌వేర్ ఈఆర్‌వో నెట్ 2 వెర్షన్ అన్ని జిల్లాల ఎన్నికల విభాగం అధికారులకు శిక్షణ ఇచ్చి, వారిని ఇప్పటికే సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే, ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తుందని రజత్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. వరుసగా గవర్నర్ నరసింహ్మన్‌తో ఉన్నతాధికారుల భేటీలు, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది.

Related News