Ex DGP Sambasiva Rao

అది చిన్న విషయం కాదు: ఏపీ మాజీ డీజీపీ

Updated By ManamMon, 09/24/2018 - 12:28
  • అరకు ఘటనపై స్పందించిన మాజీ డీజీపీ సాంబశివరావు

AP Ex DGP Sambasivarao Reaction On Araku Incident

అమరావతి : అరకు మావోయిస్టుల దారుణ కాండపై ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు స్పందించారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి విశ్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సాంబశివరావు సోమవారమిక్కడ మాట్లాడుతూ..‘సానుభూతిపరులు ఉన్నంతకాలం మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లే. ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు అనే కోణంలో పోలీసులు ఆలోచించాలి. 

ఉనికి కోసం మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. 50మందికి పైగా మావోయిస్టులు ఒక మండలానికి వచ్చారంటే చిన్న విషయం కాదు. మావోయిస్టుల చర్యల పట్ల పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మావోయిస్టుల రియాక్షన్స్ ఊహించుకుని, దానికి అనుగుణంగా వ్యూహాలు రచించుకోవాలి. మావోయిస్టుల అణిచివేతలో సాయం చేసిన చరిత్ర ఏపీ పోలీసులది.’ అని అన్నారు.



చంద్రబాబుతో మాజీ డీజీపీ సమావేశం

Updated By ManamTue, 08/28/2018 - 12:18
AP EX DGP Sambasivarao meets chandrababu

అమరావతి : ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. భేటీ అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ... సాగరమాల ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని అన్నారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా ఆలోచించలేదని ఆయన పేర్కొన్నారు. 

విశాఖ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను మూడు రోజుల క్రితం సాంబశివరావు కలిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను సాంబశివరావు తోసిపుచ్చారు. కమ్యూనికేషన్ గ్యాప్‌తో వైఎస్సార్ సీపీ నేతలు అలా ప్రకటించి ఉంటారని చెప్పుకొచ్చారు. 

కాగా సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఇంతలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం గమనార్హం. సీఎంతో భేటీ అనంతరం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటన చేయడం విశేషం.



వైఎస్సాఆర్ సీపీలోకి మాజీ డీజీపీ సాంబశివరావు

Updated By ManamSat, 08/25/2018 - 18:10
AP EX DGP Sambasivarao-Ys jagan

విశాఖ : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. రాంబిల్లి మండలం హరిపురంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను శనివారం సాంబశివరావు కలిశారు. పార్టీలో చేరిక విషయాన్ని ప్రస్తావించారు.  

కాగా సాంబశివరావు స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు. గత ఏడాదే ఆయన ఏపీ డీజీపీగా పదవీ విరమణ చేశారు. మరోవైపు సాంబశివరావు చేరికను ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్రువీకరించారు.





Related News