Lord Venkateswara

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Updated By ManamWed, 09/12/2018 - 21:02

Andhra Pradesh, Brahmotsavams, Srivari Temple, Lord Venkateswaraతిరుమల: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణలో భాగంగా బుధవారం తిరువీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుల వారు తిరువీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మకరలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది.

అదేరోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. గురువారం రాత్రి 8గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. పెద్ద శేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 



తిరుమల దర్శనాల్లో పలు మార్పులు.. 

Updated By ManamThu, 08/09/2018 - 20:13
  • ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు

Tirumala Temple, TTD, Lord venkateswara, Special visitsతిరుపతి: మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల దర్శనాల్లో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) పలు మార్పులు చేసింది. తిరుమలలో ఆరు రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనున్నారు. రేపటి (శనివారం) నుంచి సర్వ దర్శనం క్యూలైన్ మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎల్లుండి నుంచి ఆగస్టు 16 వరకు పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతించనున్నారు. 



తిరుమల వెంకన్న సమాచారం

Updated By ManamSat, 02/24/2018 - 07:47

Lord Venkateswaraతిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల సన్నిధిలో కొలువైన వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా శుక్రవారం రోజున 61,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,115 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.63 కోట్లు. కాగా ఇవాళ మధ్యాహ్నం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.



తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Updated By ManamTue, 02/06/2018 - 09:12

lord venkateswara devotees informationతిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 5గంటలు, అలాగే నడకదారిన వచ్చేవారికి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పట్టనుందని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా సోమవారం 65,813 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినది. సోమవారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.44 కోట్లు. 24,662 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

ఇదిలా ఉంటే.. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.



తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Updated By ManamWed, 01/31/2018 - 08:28

lord venkannaతిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. వెంకటేశ్వరుడి సర్వ దర్శనానికి 2గంటల సమయం మాత్రమే పడుతోంది. మంగళవారం 62,424మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగినది. మంగళవారం ఒక్కరోజే స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.96​ కోట్లు. ​18,960​ మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. 

కాగా.. బుధవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఈ రోజు సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణం కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లను రద్దుచేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.



తిరుమలలో భక్తుల రద్దీ

Updated By ManamSat, 01/27/2018 - 08:18

Full rush of Devotees in Tirumalaతిరుమల: అఖిలాండికోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా రేపు సెలవుదినం కావడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నడకదారి భక్తులకు శనివారం ఉదయం 8 గంటల నుంచి టైంస్లాట్ కింద టోకెన్లను జారీ చేస్తారు.

కాగా శుక్రవారం 70,134 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. 36,572 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.47కోట్లు.



తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Updated By ManamWed, 01/24/2018 - 08:08

The rush of devotees in Tirumalaతిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుందని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా మంగళవారం రోజున 59,758 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. అయితే బుధవారం సాయంత్రం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.



తిరుమల వెంకన్నను ఇంత మాట అనేశారేంటి?

Updated By ManamWed, 01/10/2018 - 19:14

kanimozhiచెన్నై: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడిపై కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల బాలాజీ కోట్లు ఇచ్చేవారికే దేవుడని ఆమె వ్యాఖ్యానించారు. పేదవారిని కాపాడలేని దేవుడు ఎందుకని కనిమొళి ప్రశ్నించారు. హుండీని కాపాడుకోలేని వాడు భక్తులను ఎలా కాపాడతాడని కనిమొళి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అంతేకాదు, డబ్బు లేనివారికి దైవ దర్శనానికి రోజుల పాటు పడిగాపులు తప్పవని ఆమె చెప్పారు. కోట్లాది రూపాయలిచ్చే వారికే ఆయన దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం గమనార్హం. కనిమొళి వ్యాఖ్యలపై తిరుమల వెంకన్న భక్తులు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు కనిమొళి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Updated By ManamSun, 11/26/2017 - 10:40

Tirumala devotees, Tirumal Tirupati, Lord Venkateswara, Heavy rush తిరుమల: తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. అందులోనూ కార్తీక మాసం కావడంతో కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఆదివారం శ్రీవారి దర్శనానికి మొత్తం 41 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా నడక దారి భక్తులకు 2గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 77, 470 మంది భక్తులు దర్శించుకున్నారు.





Related News