manam news

అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో చివరికిలా..

Updated By ManamFri, 03/30/2018 - 18:19

Man Records Selfie Video Before Committing Suicide in Vizag

విశాఖపట్నం (క్రైమ్): ఇద్దరు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. తప్పు భార్య చేసిందా? మూడో వ్యక్తి చేశాడా అన్నది పక్కనపెడితే.. వారు చేసేది సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పనని తెల్సి వారికి అడ్డొస్తున్నాడని భర్తను పొట్టనుపెట్టుకుంటున్నారు. మూడు పూవులు ఆరు కాయలుగా సాగిన అక్రమ సంబంధాలు అంతే రీతిలో తెంచుకునిపోయి ఇరు కుటుంబాలు రోడ్డున పడే స్థితికి తెస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధాల వ్యవహారాలు చాలా ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా ఉదాహరణలు కూడా చెప్పనక్కర్లేదు. సినిమాలు, సీరియల్స్ ప్రభావం జనాల మీద ఎంతుందో ఏమోగానీ.. రీల్ ‌‌చూసింది చూసినట్లుగానే రియల్ జీవితంలో తూ.చ తప్పుండా పాటించేస్తున్నారు. దీంతో రోజు రోజుకు నేరాలు ఘోరాల సంఖ్య అమితంగా పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది.

అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో చివరికిలా..విశాఖ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. విశాఖలోని అనకాపల్లిలో అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో రాజశేఖర్ తీవ్ర మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగింది..
అనకాపల్లికి చెందిన రాజశేఖర్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. పెళ్లై ఐదేళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అశ్విని అనే యువతితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అప్పటికే అశ్వినికి పెళ్లైంది.. పాప కూడా ఉంది. అయితే ‘నీకు ఎలాగో పిల్లలు లేరు కదా నా బిడ్డను నీ బిడ్డ అనుకొని పెంచుకో’అని రాజశేఖర్‌తో తాళి కట్టించుకుంది అశ్విని. కొంత కాలం వీరిద్దరూ అన్యోన్యంగా జీవించినా అంతే స్పీడ్‌తో బెడిసికొట్టింది. ఈ క్రమంలో తనకు జన్మినిచ్చిన తల్లిని.. తాళ్లికట్టిన భార్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఆఖరికి ఇంటికి కూడా వెళ్లడం మానేశాడు. ఒకనొక సమయంలో ఎందుకు ఇంటికి రావట్లేదని తల్లి, భార్య, మేనమామ నిలదీశారు. అయితే వారితో దురుసుగా వ్యవహరించి గొడపవపడి మరీ అశ్వినీ దగ్గరికే వెళ్లిపోయాడు. అశ్వినితో ఉంటున్నప్పటికీ ఆమె వేరొకరితో తరుచుగా ఫోన్‌లో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకున్నాడు. ఆమెపై ఆంక్షలు విధించడంతో ఎదురుతిరిగిన అశ్వని ప్లేట్ మార్చేసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాళికట్టిన ప్రియుడిపై (భర్త) ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో జరిగిందంతా చెబుతూ ఆవేదనతో తన మిత్రులకు వాట్సాప్‌లో వీడియో షేర్ చేసి రైలు కిందపడ్డాడు రాజశేఖర్. 

సెల్ఫీ వీడియోలో ఏముందంటే..
" అమ్మా.. నన్ను క్షమించు.. 
ఇంకా తప్పులు చేస్తూ మిమ్మల్నందర్నీ రోడ్డుమీదికి లాగలేను. చిన్నప్పట్నుంచి తండ్రి లేకపోయినా సరే నన్ను చాలా బాగా పెంచావు. డబ్బుల్లోనే నన్ను పెంచారు. మీరు కడుపుకు తినకుండా నాకు పెట్టారు అవన్నీ నాకు తెలుసమ్మా. నాకు ప్రతిదీ తెలిసినప్పటికీ తప్పులు మీద తప్పులు చేశాను. కనీసం మీకు ఒక పూట అన్నం కూడా నేను పెట్టలేదు. పుట్టినప్పట్నుంచి ఈ రోజు వరకూ ఒక్క చీర కూడా నీకు కొనిపెట్టలేదు అమ్మా. ఎంతసేపూ అమ్మాయి.. అమ్మాయి (అశ్విని) అని చెప్పి అక్కడికే వెళ్లాను. ఆ అమ్మాయి నీకు పిల్లలు లేరు నా కూతుర్ని పెంచుకో.. నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి తాళి కూడా కట్టించుకుంది. అయితే కొద్దిరోజులకే నువ్వెవరు? నీకు నాకు సంబంధమేంటి? అంటూ నామీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయిని నమ్మి చాలా మోసపోయానమ్మా. నిన్ను ఇంకా బాధపెట్టదలుచుకోలేదు. అమ్మా.. నీతో ఇప్పటికే చాలా అప్పులు చేయించాను.. స్టేషన్ల చుట్టూ తిప్పించాను. ఇకపై నిన్ను రోడ్లపైకి.. స్టేషన్ల దగ్గరికి లాగలేను. ఇంకా నేను బతికి కూడా నీకు మనశ్శాంతి లేకుండా చేశానమ్మా. వచ్చే జన్మ అంటూ ఉంటే నీకు మంచి కొడుకునై పుడతానమ్మా" అంటూ తన అమ్మకు రాజశేఖర్ కంటతడి పెట్టి చెప్పాడు.

ఎప్పుడూ వెదవలాగే బతికానమ్మా..
"మామయ్యా.. అమ్మ మీరిద్దరూ నన్ను క్షమించండి..
మామయ్యా.. నన్ను కొడుకు కంటే ఎక్కవగా చూసుకున్నావ్. నేను బతికినన్నాళ్లు మిమ్మల్ని బాధపెట్టాను. భర్తగా భార్యకు న్యాయం చేయలేపోయాను. అల్లుడిగా.. మేనల్లుడిగా మీకూ నేను మంచి చేయలేదు. అమ్మకీ మంచి కొడుగ్గా బతకలేదు. ఎప్పుడూ వెదవ పనులు చేస్తూ.. బయటివాళ్లను నమ్ముకుంటూ వెదవ మీద వెదవ అనిపించుకుంటూనే బతికాను"అని తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు.

Man cheated by second wife, records suicide in selfieతాళికట్టిన అశ్విని గురించి...
"అల్లం అశ్విని నువ్.. నాతో, నా జీవితంతో కాదు.. నా మనసుతో ఆడుకున్నావ్.
మా ఆయనకు విడాకులిచ్చేశాను.. తను నా లైఫ్‌లో లేడని.. వెంకన్నపాలెంలో వేరే అమ్మాయితో ఉంటున్నాడు, అమ్మవాళ్లు చోడవరంలో ఉంటున్నారని అని మీ ఇంటికీ తీసుకెళ్లావ్.. మాట్లాడించావ్ ఇలా అన్నీ చేశావ్.. చివరికీ తాళి కూడా కట్టించుకున్నావ్. పాపతో డాడీ.. డాడీ అని పిలిపించావ్. నేను చాలా ఆనందపడ్డాను. ఏ పిల్లయినా ఒకటే నాకు పిల్లలు లేరు కదా నా పిల్లేలే అనుకున్నాను. రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నావ్.. ఎందుకని అడిగితే ఇప్పుడు కూతురుంది కదా కొడుకునిస్తా అన్నావ్. ఇప్పుడు వేరొకరితో మాట్లాడుతున్నావ్.. ఎందుకిలా చేస్తున్నావని రోడ్డు మీద నిలదీస్తే నాపై పోలీసులకు ఫిర్యాదు చేశావ్. ఎందుకని అడిగితే చిత్రహింసలు పెడుతున్నా అంటున్నావ్. చూడు అశ్వనీ.. నేను బతకలేక చావట్లేదు. మా అమ్మకు మంచి కొడుకుగా బతకలేను. ఈ రోజు వరకు మా అమ్మకు ఏమీ చేయలేదు. నేను బతకడం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. 

అశ్విని నాజీవితంలోకి వచ్చి నాతో తాళి కట్టించుకుని హైదరాబాద్, అరకు, వైజాగ్‌లో ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడికి తిరిగి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి.. ప్రమాణాలు చేసింది. నాకు ఇంట్లో అమ్మమ్మ తప్ప ఇంకెవ్వరూ ఎక్కువ కాదు. నీతోనే కాపురం  చేస్తానని మాటిచ్చి.. నాతో ఆడుకుని ఈ రోజు నన్నిలా చేసింది" అని కంట తడిపెట్టాడు రాజశేఖర్.

Man Records Selfie Video Before Committing Suicide in Vizag‘మనం’తో ఘనంగా టెక్నో ఉస్మానియా-2కె 2018

Updated By ManamThu, 03/22/2018 - 18:27

manamహైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ‘మనం’ దినపత్రిక నిర్వహిస్తున్న టెక్నో ఉస్మానియా-2కె 2018 ఈవెంట్ మొదటి రోజు ఘనంగా జరిగింది. ఎన్‌ఫ్యాబ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జీవీ సేతు రామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్‌ఎఫ్‌సీ హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిసెస్ షీలా కూడా ప్రాసెస్ ఇండస్ట్రీస్‌లో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆమె మాట్లాడారు. అనంతరం సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినీవిద్యార్థులు మోడ్రన్ దుస్తుల్లో చేసిన ఫ్యాషన్ షో అలరించింది. టెక్ నైట్స్ టచ్ ది స్కై పేరుతో కూడా ఈవెంట్ కొనసాగనుంది.మన శరీరంలో దాగున్న అద్భుతాలు

Updated By ManamTue, 02/13/2018 - 18:36

human bodyశాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. చంద్రమండలాన్ని దాటి.. అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నా మనిషి మేధస్సుకు అంతుచిక్కని అద్భుతంలో ఈ అనంత విశ్వంలో కోకొల్లలు.. ఇప్పటికి మనకి తెలిసింది సముద్రంలో ఇసుక రేణువంత మాత్రమే.. ఇంకా తెలియాల్సింది.. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి వాటిలో ఒకటి మానవ శరీరం. భగవంతుని అద్భుత సృజనాత్మకతకు గీటురాయి మనిషి శరీర నిర్మాణం. పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేసే ఒక అలుపు లేని మెషిన్ హ్యూమన్ బాడీ. దీని గురించి కొన్ని ఆసక్తికరమైన, నమ్మలేని నిజాలు మీకోసం.

* శరీరం నుంచి తలను తప్పిస్తే.. తల 15 నిమిషాల వరకు స్పృహలోనే ఉంటుందట.
* నిద్రపోతున్నప్పుడు మన ముక్కు వాసన గుర్తించలేదు.
* జీర్ణాశయంలో ఉండే ఆమ్లము రేజర్ బ్లెడ్‌లను కూడా కరిగించగలదట.
* మన గుండె ఒక్క రోజులో ఉత్పత్తి చేసే శక్తితో ఓ ట్రక్‌ని సుమారు 30 కిలోమీటర్ల వరకు నడిపించగలదు.
* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏ రసాయనాలు సాయపడతాయో.. మనం మరణించిన 3 రోజులకి అవే మనల్ని తినేస్తాయట
* కెమెరాతో మన కంటిని పోలిస్తే.. అది 576 పిక్సెల్స్‌ ఉంటుందట.
* మన నాలుక 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
* మన బెడ్‌పై ఉండే దుమ్ములో సగం మన చర్మం విసర్జించిందే.
* ఒక్క అంగుళం చర్మం మీద సుమారు 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుందట.
* మెదడు ఏదైనా అవయవానికి సమాచారం పంపిస్తే.. అది గంటకు 268 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందట.
* కొన్ని లక్షల కంప్యూటర్లలో స్టోర్ చేయగలిగినంత మెమొరీని దాచవచ్చట.
* ఊపిరితిత్తులను పూర్తిగా విడదీస్తే.. అది 50 నుంచి 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరచుకుంటుందట. అంటే అది దాదాపు ఓ టెన్నిస్ కోర్ట్ వైశాల్యంతో సమానం.ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి ‘మనం’

Updated By ManamSun, 01/14/2018 - 22:08

క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్

koppula eswar

వెల్గటూర్, జనవరి 14( మనం న్యూస్): ‘మనం’ దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలని ప్రభుత్వ చీఫ్ విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ‘మనం’ వారధిగా పని చేస్తూ అనతి కాలంలోనే ప్రజా దరణ పొందిందని అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ ‘మనం’ దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త పత్రికే అయినప్పటికీ ప్రధాన పత్రికలతో సమానంగా అన్ని వార్తలను సమగ్రంగా అందిస్తోందని కొనియాడారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో ‘మనం’ ఎంతో ముందుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్‌ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, ‘మనం’ పత్రిక విలేకరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధిక్కారస్వర ప్రభంజనం

Updated By ManamSat, 12/09/2017 - 22:38
  • శ్రీ శ్రీ పురస్కార గ్రహీత.. బిక్కి కృష్ణతో ప్రత్యేక ఇంటర్వ్యూ... 

kirshna ‘కార్మికుల స్వేదం నా వేదం..కర్షకుల ఖేదం నా వాదం’ అంటూ సరిగ్గా  28 ఏళ్ళ క్రితం ‘చరమ గీతం’ కవితా సంపుటితో సాహిత్యరంగ ప్రవేశం చేసిన అభ్యుదయ కవి బిక్కి కృష్ణ. ‘తెల్లని ఆకాశంలో అరుణ బింబంలా తెల్లజొన్న రొట్టె పై ఎర్రగారం నంజుకుని..మల్లె మెుగ్గల్లాంటి అన్నపు మెతుకుల కోసం..అక్షరాల విత్తుల్ని మెదడులో నాటుకుని.. మెుక్కగా.. చెట్టుగా.. మహావృక్షంగా.. బాధల గాథల్లో.. బోధి వృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ నే’నని సగర్వంగా.. చెప్పుకున్న ప్రముఖ కవి బిక్కి కృష్ణ. ఆయన రాసిన ‘కాలం నది ఒడ్డున’ కవితా సంపుటిని కడపకు చెందిన కవితా సాహిత్య సాంస్కృతిక సంస్థ రెండు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన కవితా సంపుటాల పోటీల్లో శ్రీశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. అందులో ఏ కవిత పట్టుకున్నా సలసల కాగే నీళ్ళలో  వేలు పెట్టినట్టుంటుంది. కవిత మెుదలు పెట్టగానే ప్రవాహంలో కొట్టుకు పోతుంటాం. తొలి పంక్తి నుంచే ఒక మూడ్‌లోకి తీసుకెళతాడని డా.ఎన్ గోపి కితాబిచ్చారు.‘బిక్కి కృష్ణ పుంఖానుపుంఖాలుగా సమీక్షలు, విమర్శలు రాశాడు. మూలకారణాల్ని కనుక్కోవాలనే తపన, సరెండర్‌కాని తత్వం బిక్కి కృష్ణని ఇంత దూరం తీసుకొచ్చా’యని కె.శివారెడ్డి నిజం చెప్పారు. బిక్కి కృష్ణ మాట్లాడుతున్నది అసలైన మానవత్వం గురించి సర్వం సమానత్వంగా, ప్రాణప్రదంగా బతికే,బతికించే వివక్ష లేని,దోపిడి లేని, మానవత్వమే పతాకగా తన కవితల్లో ఎగరేస్తున్నాడు’ అంటూ నగ్నముని వేనోళ్ళ కొనియాడారు. ‘ప్రపంచీకరణపై సమరభేరి’ బిక్కి కృష్ణ ‘కాలం నది ఒడ్డున’ అంటూ ఏకంగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి  అద్భుత వ్యాసాన్నే రాశారు. ప్రపంచీకరణపై ఇన్ని ప్రతీకలు వాడిన ఆధునిక కవి లేడని, అసలైన మార్క్సిస్టు కవి బిక్కి కృష్ణ అంటూ సర్టిఫై చేశారు. ఇలా ప్రముఖ కవులు విమర్శకుల చేత  అభినందనలందుకున్న బిక్కి కృష్ణ ‘కాలం నది ఒడ్డున’ పుస్తకానికి  శ్రీశ్రీ పురస్కారం రావడం తెలుగు కవులందరికీ గర్వ కారణం. అయితే, బిక్కి కృష్ణ కేవలం కవిగానే కాకుండా నిజాలను నిర్భయంగా వెల్లడించే నిఖార్సయిన విమర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఇండియాటుడే’ లాంటి పత్రికల్లో ఆయన అద్భుత సమీక్షలు రాసిన విషయం అందరికీ తెలిసిందే. సమీక్షకునిగా తెలుగు, కన్నడ సాహిత్యాలపై పరిశోధన చేసిన సాహితీవేత్తగా వివిధ పత్రికలు, టి.వి.ఛానళ్లలో తన సృజనాత్మకతతో అద్భుత కథనాలు ఆవిష్కరించిన సృజనశిల్పిగా, విద్యాసామాజిక రంగాల్లో లక్షలాది శిష్యులను చైతన్య పరిచిన బోధకునిగా,శిక్షకునిగా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరిచి ఇప్పటికీ నిరంతరం శ్రమిస్తున్న నిత్య చైతన్య శీలి. జన కారుడు. మహావక్త, గాయకుడు, నటుడు, ధిక్కారస్వర ప్రభంజనం. యువ కవుల పక్షపాతి. శ్రీశ్రీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా బిక్కి కృష్ణతో ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్రశ్న:మీరు రాసిన ‘కాలం నది ఒడ్డున’ కవితా సంపుటికి శ్రీశ్రీ పురస్కారం రావడం పట్ల మీ స్పందన ఏమిటి?
శ్రీ శ్రీ నా అభిమాన కవి. అసలు శ్రీశ్రీ వల్లనే నేను కవిని అయ్యాను. 28 ఏళ్ళ క్రితమే నా చరమగీతం కవితా సంపుటిలో ‘నా గురువు శ్రీశ్రీ.. తెరువు శ్రీశ్రీ.. అరువు శ్రీశ్రీ.. పరువు శ్రీశ్రీ’ అని రాశాను. నిజంగానే ఆనాడు రాసిన ‘పరువు శ్రీశ్రీ’ అన్న పదం నా ‘కాలం నది ఒడ్డున ’ కవితా సంపుటికి శ్రీశ్రీ అవార్డు రావడంతో నిజమైంది. ఇది యాదృచ్ఛికమే అయినా నా అభిమాన కవి పేరుతో వచ్చిన పురస్కారం. ఎంతో ఆనందమనిపించింది.

ప్రశ్న: మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు?
ఇరవై ఏళ్ళ వయసు నుంచే రాస్తున్నాను. అవధాన సీమలో పుట్టాను కాబట్టి మెుదట్లో ‘విభావరి’లాంటి పద్య కావ్యాలు రాసినా, రాచపాళెం లాంటి గురువుల ప్రభావంతో ఆధునికత వైపు దృష్టి మళ్ళించి అభ్యుదయ కవిత్వం రాశాను. నాతొలి కవితా సంపుటి ‘చరమగీతం’ తర్వాత ‘వేకువ పిట్టలు’ ‘చినుకు’ ‘ప్రేమాంజలి’ ‘కాలం నది ఒడ్డున’ ఇలాంటి కవితా సంపుటాలతో పాటు 30 పుస్తకాలు రాశాను. వందలాది గేయాలు, నాటికలు, కథలు, గజళ్లు, వ్యాసాలు, సమీక్షలు రాస్తూ పుస్తకాలుగా వెలువరిస్తూ వస్తున్నాను.

ప్ర: సాహిత్య విమర్శకునిగా మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?
ఎస్.కె.యూనివర్సిటీలో చదువుతున్నపుడు ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డిల ఆధునిక సాహిత్య భావజాలం,ఆచార్య తూమపూడి కోటేశ్వ రావు శిల్పపరమైన విమర్శనా ప్రసంగాలు, ఆచార్య బ్రహ్మానంద భాషాశాస్త్ర నైపుణ్యాలు, ఆచార్య పి.యల్. శ్రీనివాసరెడ్డి సాహిత్య దృష్టికోణం, డా.బుద్దన్న గజల్ సౌరభం.. ఇవన్నీ నాలో ఉన్న విమర్శకుణ్ణి తట్టి లేపాయి. తర్వాత నాదైన మార్గంలో దూసుకు పోయాను.

ప్ర.బోధకునిగా,పాత్రికేయునిగా కూడా పనిచేశారుగా! మరో పక్క సాహిత్యాన్ని వదలకుండా దానివెంట పడ్డారెందుకు?
నిజమే.. అసలు  బి.ఎ.వరకు హిస్టరీ చదువుకుని అతి పెద్ద స్వచ్ఛంద సంస్థలో ఓ చిరుద్యోగిగా చేరాను. అంచెలంచెలుగా ఎదుగుతూ హఠాత్తుగా డిగ్రీ, బి.ఇడి. కళాశాలల లెక్చరర్‌గా పనిచేశాను. సాయంత్రం జర్నలిస్ట్ అవతార మెత్తాను. ఎక్కడా ఇమడని నా మనస్తత్వం జర్నలిజంలోనే స్థిరపడింది. మధ్యలో హెచ్.ఆర్.డి.లో జిల్లా స్థాయి ప్రోగ్రాం ఆఫీసర్‌గా పని చేసినా దాన్ని కూడా వదిలేసి హైదరాబాద్ వచ్చేశాను. అంతకు ముందు వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ప్రజాశక్తి తదితర పత్రికల్లో పనిచేసిన అనుభవం తర్వాత అశ్వనీదత్ లోకల్  టి.వి, ఛానల్-4, స్టుడియో-ఎన్, 10 టి.వి. తదితర మీడియా సంస్థల్లో పనిచేయడానికి ఉపయోగ పడింది. మీడియా ట్రైనర్‌గా కూడా పనిచేశాను.

ప్ర:ఇన్ని జీవిత ఆటుపోట్ల మధ్య సాహిత్య సేవ చేయడం ఎలా సాధ్యమైంది?
నిజమే. హిందూపురంలో ఉన్నపుడు స్వర్ణభారతి ద్వారా, అనంతపురంలో ఉన్నపుడు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ వచ్చాక  చక్రి ఛారిటబుల్ ట్రస్ట్, షి షౌండేషన్, లెర్ఫ్ ఇంటర్ నేషనల్, గిడుగు రామమూర్తి ఫౌండేషన్.. ఇలా అనేక సంస్థల్లో క్రియాశీలక పాత్ర పోషించాను. 

ప్ర.మీకు..కన్నడ తెలుగు భాషలపై మంచి పట్టు ఉందంటారు?
అవును. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో(అనంతపురం జిల్లా వడ్డేపాళ్యం గ్రామంలో బిక్కి భీమక్క, హనుమంతప్ప దంపతులకు) పుట్టాను. చిన్ననాడే కన్నడ భాష నేర్చుకున్నాను. అందుకే కన్నడ తెలుగు ప్రహసనాలపై యం.ఫిల్ చేశాను. నేపథ్యం లేని రంగనాయకమ్మ విమర్శ అంటూ నేను రాసిన సంచలన వ్యాసం చూసి ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి కన్నడ తెలుగు వయోజన వాచకాలపై పీహెచ్‌డీ చేయమని సీటిచ్చారు. హళెగన్నడ హొసగన్నడపై కృషిచేయడానికి రాయచూర్, మంగళూర్, మైసూర్ మాండ్య జిల్లాల్లో పర్యటించాను. ఇలా చెబుతూ పోతే ఎంతో శ్రమించాను. వాచకాల రచనలో కాలమంతా వృథా చేశాను. అదో పిచ్చి. సాహిత్యం మరో పిచ్చి.

ప్ర:‘కాలం నది ఒడ్డున’ కావ్యంలో మీ ఊరు, మీరు చూసిన ప్రదేశాలను అద్భుత కవితలుగా మలచడానికి ప్రేరణ ఏమిటి?
విశ్వసాహిత్యం. 10 టి.వి అక్షరంలో 220 ఎపిసోడ్లు రాశాను. అలా రాస్తూ మెుత్తం నోబెల్ బహుమతి గ్రహీతల పుస్తకాలన్నీ చదివేశాను. వారి కవిత్వం, నవలలు, కథలు.. ఇలా ఎన్నోటెక్నిక్‌లు, రచనా సంవిధానాలు,బుక్కర్ ప్రైజ్ రచయితల పుస్తకాలు, దేశ విదేశాల కవుల రచయితల సాహిత్యం నాలో హృదయవైశాల్యాన్ని పెంచింది. అది 10 టి.వి లోనూ, ఇప్పుడు రాసే కవిత్వడిక్షన్‌లోనూ మీరు చూడ వచ్చు.

ప్ర.పురస్కారాలు..ప్రోత్సాహకాలుగా మీరు భావిస్తారా?
భావిస్తాను. అది చిన్నదా పెద్దదా అని కాదు. ప్రేమతో మీరు మంచి పని చేస్తున్నారు. ఫలానా మీ పుస్తకం బాగుంది. మీ కవిత, గజల్ బాగుంది అంటూ ఫేస్‌బుక్‌లో పెట్టే కామెంట్లను కూడా నేను సహృదయులిచ్చే పురస్కారాలుగా భావిస్తాను. 
 శ్రీరాం సాగర్, కవి
9885473934

Related News