kcr

ప్రచారంపై ప్రత్యేక నజర్

Updated By ManamWed, 10/17/2018 - 03:12
 • టీఆర్‌ఎస్ కాన్వాసింగ్‌ను నియంత్రిస్తున్న కేసీఆర్ 

 • అభ్యర్థులకు ఫోన్‌లో సలహాలు, సూచనలిస్తున్న అధినేత

 • పద్ధతి మార్చుకోకుంటే మార్పు తప్పదంటూ హెచ్చరికలు

kcrహైదరాబాద్: తెరాస అభ్యర్ధుల ఎన్నికల ప్రచారంపై నిరంతర నిఘా కొనసాగుతుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే నియోజక వర్గాల వారీగా ప్రచారం జరుగుతోంది. మహిళలు, యువత, వృత్తిదారులను లక్ష్యంగా చేసుకొని ఓట్ల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అభ్యర్ధులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి  నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. అత్యధిక నియోజక వర్గాల్లో అభ్యర్ధులపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పార్టీ కొంత కలవరపాటుకు గురువుతుంది.  సిట్టింగ్ అభ్యర్ధులపై ఎంతో కొంత వ్యతిరేకత సహజమని భావించిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో కొందరు మంత్రులు కూడా ఓటర్ల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల్లో కేసీఆర్ ముగ్గురు మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి ఇదేమి పద్ధతి, సొంత నియోజక వర్గంలోనే  వ్యతిరేకతను ఎదుర్కొంటే ఎట్లా,  జిల్లాలో ఇతర నియోజక వర్గాల్లో అభ్యర్ధులను ఎలా గెలిపించుకుంటారు, ఇలాగైతే  పార్టీ పరిస్థితేమిటి? అని ప్రశ్నిస్తూనే.., సత్వరం పరిస్ధితుల్లో మార్పు రావాలి, ప్రజలతో మమేకం కావాలి, అంతా కలిసి కట్టుగా ఉన్నామనే సంకేతాలు వెలువడాల్సి ఉంది అంటూ తగు సూచనలు చేస్తున్నారు. ఎంతగా బుజ్జగించినప్ప టికీ దారికి రాని వారిని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్ప టికే ఒక ఎమ్మెల్సీని వదులుకున్నాం.., పార్టీ ముఖ్యం, అభ్యర్దుల గెలుపు అత్యంత ప్రధానం అని ముఖ్యమంత్రి హెచ్చరికలూ జారీ చేస్తున్నట్లు తెలిసింది. సిట్టింగ్‌లను అభ్యర్ధులుగా ప్రకటించడంతో పలు నియోజక వర్గాల్లో అంతర్గత విబేధాలు బహిర్గతమవుతున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన తెరాస అధినేత గత వారం పది రోజులుగా నియోజక వర్గాల వారీగా రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ప్రచారం దృష్టి కేంద్రీకరించారు. అన్ని స్థాయిల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. నియోజక వర్గం ఇన్ ఛార్జీలపై నిఘాను పెంచడం, ప్రచార సరళిపై కన్నేయడం, అభ్యర్థులపై నిరంతరం నిఘాను  కొనసాగించడం, నేతలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడటం, అసమ్మతులపై కన్నేయడంతో ప్రచారంపై అప్రమత్తమయ్యారు. అభ్యర్దుల బలం, బలహీనతలు పరి గణలోకి తీసుకొని ప్రచార సరళిలో మార్పులు చేర్పులు  సూచిస్తున్నా రు. పార్టీలో సమన్వయం లోపించిందనే సంకేతాలు తెరాస అధినేత ను ఆందోళనకు గురి చేయడంతో మేనిఫెస్టో కమిటీతో అత్యవసరంగా భేటీ జరిగి వివిధ వర్గాలకు ఎన్నిలక హమీలకు కురిపించారు. 

ఇప్పటికే కొన్ని నియోజక వర్గాల్లో ముఖ్య నాయకులను పార్టీ కోల్పో వలసి వచ్చింది.   రాబోవు రోజుల్లో మరింత మంది పార్టీకి దూరమ వుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకిలా జరుగుతుంది, క్షేత్ర స్ధాయిలో సమన్వయ లోపం ఎక్కడుంది, పార్టీ శ్రేణులు ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటు న్నాయనే అంశాలపై ఆరా తీస్తున్నారు. లోటుపాట్లను సవరించుకోవాలని అభ్యర్ధులకు సూచిసు ్తన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం పది రోజులుగా 65 నియోజక వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిం చారు. గెలుపు గుర్రాల విషయంలో ధైర్యంగా ఉన్నప్పటికీ బలహీనమైన అభ్యర్దులను గెలిపించుకోవడం పార్టీకి సవాల్‌గా మారిందని అంటున్నారు. ఈ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న వారిలో మంత్రులు కూడా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు మంత్రులతో పాటుగా మరో నలుగురు తెదేపా నుండి తెరాసలో చేరి సిట్టింగ్‌ల కోటాలో తెరాస టికెట్‌పై పోటీ చేస్తున్నవారికి కూడా ముఖ్యమంత్రి హెచ్చరి కలు జారీ చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో గెలుపే ప్రధానమని, తమ వెంట పార్టీలో చేరిన వారిని ప్రచారంలో ఎందుకు వినియోగించు కోలేక పోతున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. పార్టీ మారడంతో పాటు ఓట్లు కూడా మారవలసి ఉందని, లేని పక్షంలో రాజకీయంగా నష్టదాయకమైన ఫలితాలు చూడవలసి వస్తుందని హెచ్చరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.మరిన్ని వరాలు 

Updated By ManamWed, 10/17/2018 - 03:12
 • తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ ఎన్నికల నజరానాలు

 • ఆసరా పింఛన్ వయసు 60 నుంచి 57కు కుదింపు

 • రైతుబంధు సాయం రూ. 10 వేలకు పెంపు

 • డ్వాక్రా మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

 • రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి

 • మేనిఫెస్టోలో నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు,             

 • వికలాంగులు, అగ్ర వర్ణాల పేదలకూ పెద్దపీట

 • టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రకటించిన కేసీఆర్

kcrహైదరాబాద్: టీఆర్‌ఎస్ ‘ఎన్నికల’ వేగం పెంచింది. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఉద్యమ నేత కేసీఆర్ ప్రకటించబోయే ఎన్నికల హమీలు, మేనిఫెస్టోపైన తెలంగాణ ప్రజలంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఆశలను తీర్చేటట్టుగానే టీఆర్‌ఎస్ అధినేత ఇప్పుడున్న వాటికి తోడు మరిన్ని వరాల జల్లు కురిపించారు. గులాబీ పార్టీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఫించన్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతుబంధు, అగ్రవర్ణాల వారికి కార్పస్ ఫండ్‌తో పాటు కార్పొరేషన్‌ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే, రైతుబంధు పథకంలో ఇప్పటి వరకు ఇచ్చే మొత్తాన్ని 8వేల నుంచి 10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఐకేపీ మహిళలు, స్వయం సహయక మహిళ గ్రూపుల వారితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లను నిర్వహిస్తామన్నారు. రైతు సమన్వయ సమితులలో పనిచేస్తున్న వారికి గౌరవ భృతి ఇస్తామన్నారు. కేసీఆర్ అధక్షతన మేనిఫెస్టో కమిటీ మంగళవారం మద్యాహ్నం తెలంగాణ భవన్ లో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చించామని కేసీఆర్‌చెప్పారు. 

గతంలో ఇచ్చినట్లుగానే ఈసారి కూడా రుణమాఫీ ఒక లక్ష రూపాయలను ఒకేసారి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, గతంలోని పొరపాట్లు జరక్కుండా చూస్తామన్నారు. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ మానిఫెస్టో కమిటీకి మొత్తం 300 వినతులు వచ్చాయని ఆయన తెలిపారు. ప్రతి పక్షాలకు ఎన్నికలంటే ఒక ఆటలాగా వ్యవరిస్తున్నారని, కానీ అ ఎన్నికలు మాకు బాధ్యతతో కూడుకున్నాయన్నారు. ఒక పథకాన్ని అమలు చేయాలంటే మా ఆలోచన భిన్నంగా ఉంటుందని గులాబి బాస్ చెప్పారు. రాష్ట్ర గ్రోత్ పెరుగుతున్న కొద్దీ పథకాలను విస్తరించామన్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అసలే రావడం లేదని కేంద్రంపై కేసీఆర్ తనదైన శైలీలో ఫైర్ ఆయ్యారు. ఇక, రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కేంద్రం నుంచి అధికంగా నయా పైసా కూడా రాదని భావిస్తున్నామని కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లకుగానూ తెలంగాణ రాష్ట్రం 2 లక్షల 30 కోట్లు అప్పు తిరిగి చెలించాలని తెలిపారు.  రైతును రాజు చేయలనేదే మా ప్రధాన ఏ జండా అని పేర్కోన్నారు. భూ రికార్డ్‌ల ప్రక్షాళన విజయవంతంగా చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాష్ట్రంలో రైతులు ఆర్ధికంగా కావాలన్న సంకల్పంతోనే వారికి పలు పథకాలు ప్రవేశ పెడెతున్నామని, మొత్తం వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడ్డ వారిలో 45 లక్షల రైతులు ఉన్నారని ఆయన చెప్పారు. అందులో 42 లక్షల మంది లక్షలోపు అప్పున్న వారు ఉన్నారని ఆయన వెల్లడించారు. రైతు సమన్వయ సమితిలకు గౌరవం కలిగేలా భారీ ఎత్తున నిధులను కేటాయిస్తామని చెప్పారు. 

ఫెన్షన్లు..నిరుద్యోగ భృతి..వరాలు..
పింఛన్ల కోసం వృద్ధాప్య వయస్సును 57 సంవత్సరాలకు కుదించారు. వెయ్యి రూపాయల ఫెన్షన్‌ను 2 ,016 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ భృతి 3016 రూ.లు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు వికలాంగులకు 15 వందలుగా ఉన్నా ఫెన్షన్‌ను 3 వేలు ఇస్తామని చెప్పిన కేసీఆర్, వికలాంగుల మాదిరిగారే ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి నిరుద్యోగ భతి క్రింద 3వేల 16 రూపాయల ఇస్తామని గులాబి బాస్ వరాలు కురిపించారు. అయితే, సమగ్ర కుటంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 12 లక్షలు మంది నిరుద్యోగులు ఉన్నారని టీఆర్‌ఎస్ అధినేత స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ఇచ్చిన ఇళ్లల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, తామిచ్చె ఇళ్లలో అలాంటి ఇబ్బందులేమి ఉండొద్దని డబుల్ బేడ్ రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. అ ఇళ్లన్ని పూర్తయ్యాక త్వరలో అసలైన నిరుపెదలకు అందచెస్తామని, ప్రతి పక్షాలు అనుకున్నంత, కాలయాపన కానీ, ఆవినీతికి గానీ తామెన్నడూ కూడా తావివ్వలేదని కేసీఆర్ ఈ సందర్భంగా తెల్చి చెప్పారు. ఇక, సొంత స్థలం ఉన్నవారికి వారు కోరితే డబుల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తామని కేసీఆర్ చెప్పారు. యాదవులకు గోర్రేలు ఇచ్చినట్లుగానే తమకు ఎదైన పూర్తిస్థాయి బతుకుదేరువును చూపించాలని కొందరూ దళిత బిడ్డలు కోరారన్నారు. అయితే, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక స్కీమ్‌లను సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు. ఇక, అగ్రవర్ణాలలోని పేద వారి కోసం కార్పస్ ఫండ్ సమకురుస్తామని చెప్పారు. రెడ్డి, వైశ్యులకు ప్రత్యేక కార్పోరేషన్‌లను ఏర్పాటు చేసేందుకుగానూ మరొసారి పునారాలోచించి దానికి ఒక తుదిరూపు తీసుకొచ్చి తమ ప్రభుత్తం రాగానే వాటిని అమలు చేసేలా చూస్తామని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తమ మానిఫెస్టోలో తాము చెప్పనివే ఎన్నో పథకాలను అమలు చేశామని, ఈసారి తాము చెప్పిన వాటితో పాటు ప్రజల అవసరాలను బ ట్టి ఇంకా ఎక్కువే చేస్తామన్నారు. 

చంద్రబాబుపై ఫైర్...
ఎపీ సీఎం చంద్రబాబుపై టీఆరశ్రీస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పక్కా రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణలో ఎం పని అని నిలదీశారు. గత కోన్నేళ్ల క్రింద తెలంగాణకు వలసొచ్చిన ఆంద్ర సోదరులను రెచ్చగొట్టి పుండు మీద కారం చల్లుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దోరికిన దోంగకు ఇక్కడే పని అని ఘాటుగా హెచ్చిరించా రు. ఆయన ఆటలు ఇకపై సాగనీవ్వబోమన్నారు. గతంలో ఉన్న పేకాట, కోళ్ల పందాలు, జుదం వంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేశామని తాము అలాంటి దందాలను ప్రొత్సహించబోమన్నారు. సమైఖ్య బాబు మీరు ఇక్కడికి వచ్చిఎన్ని ఆటలు చేయాలని చూసిన తెలంగాణ ప్రజలు, మా ఆంద్ర సోదరులు మీ ఆటలకు చెక్ పెడతారన్నారు. ఇక నుంచి వాళ్లని రెచ్చగొట్టాలని చూసిన, వాళ్లని ఇబ్బందులు పెట్టిన జరుగబోయే పరిణామాలు వేరేలా ఉంటాయని కేసీఆర్ చంద్రబాబును హెచ్చరించారు.టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్

Updated By ManamTue, 10/16/2018 - 18:45
kcr releases trs party manifesto

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖరరావు మంగళవారం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ మేనిఫెస్టోలో పలు వరాల జల్లు కురిపించారు. 

టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...

 • 57 ఏళ్లకే పెన్షన్

 • పెన్షన్ రూ.2016కి పెంపు

 • రెండువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

 • ఈసారి కూడా రైతులకు లక్ష రుణమాఫీ

 • రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10వేలు 

 • కొత్తగా నిరుద్యోగ భృతి ప్రకటించిన కేసీఆర్

 • నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3,016 భృతి

 • 2.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం

 • సముచిత రీతిలో ఉద్యోగులకు ఐఆర్ (మధ్యంతర భృతి)

 • రెడ్డి, వైశ్య కులాలకు కార్పొరేషన్లు

 • అగ్రవర్ణాలలోని పేదలకు కార్పస్ ఫండ్కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు

Updated By ManamMon, 10/15/2018 - 11:24

V.Hanumantha Raoహైదరాబాద్: నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని  కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో తెరాసకు ఓటేసి తప్పు చేశామన్న భావన ప్రజల్లో ఉందని... అందుకే ఈ సారి కాంగ్రెస్‌కే ఓటేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరా విజయయాత్రలో భాగంగా ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని.. అన్నిచోట్ల టీఆర్‌ఎస్‌పై అసంత‌ృప్తి కనిపిస్తోందని తెలిపారు. ఇక మహాకూటమిలో టీడీపీ చేరినందుకు కేసీఆర్‌ తిడుతున్నారని.. తాను చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా అంటూ వీహెచ్ మండిపడ్డారు.కోటిన్నర మందికి ఉత్తరాలు

Updated By ManamMon, 10/15/2018 - 06:28
 • ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు కోసం ఆపద్ధర్మ సీఎం మరో ఆలోచన

 • ప్రజల ఆశీర్వాదం పొందడానికి వైఎస్‌ఆర్ బాటలో టీఆర్‌ఎస్ అధినేత

 • ప్రగతిని కొనసాగించేందుకు మరో అవకాశమివ్వాలంటూ వినతి

KCRహైదరాబాద్: రాష్ట్రంలోని సగానికి పైగా ఓటర్ల హృదయాలను గెలుచునేందుకు తెరాస అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందిన వారి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. అభివృద్దిని ఆశిస్తున్న వారి మద్దతును కూడగట్టే ప్రయత్నంలో  కేసీఆర్ ఉన్నారు. అంతా తానై పార్టీని నడిపిస్తున్న కేసీఆర్, ఓటర్లు కూడా తనను చూసే టీఆర్‌ఎస్ అభ్య ర్ధులకు మద్దతు ప్రకటించే విధంగా కార్యాచరణ రూపొందించుకుం టున్నారు. ప్రగతి ఫలాల ప్రయోజనాలను వివరించి ప్రజల మద్దతు మరోసారి కోరడం ప్రధాన ఉద్దేశంగా పలు ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రభుత్వం అమలు జరిపిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో సుమారు కోటిన్నర మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందారని భావిస్తున్న కేసీఆర్, వారందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు వ్యక్తిగత లేఖలు రాసి రాజకీయ ప్రయోజనం పొందిన తీరు తెలిసిందే.  ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో పథకం వల్ల ప్రయోజనం పొందిన వారికి వైఎస్ స్వయంగా లేఖలు రాశారు. ముఖ్యమంత్రి నుండి లేఖలు అందుకున్న సామాన్య ప్రజలు ఎంతగానో సంతోషించారు. ముఖ్య మంత్రి రాసిన లేఖలను అమూల్యమైన పత్రాలుగా భద్రపర్చుకున్నారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ పట్ల తమకున్న అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపిం చారు. అలాంటి ప్రయోగం ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబోతున్నారు. తెరాస ప్రభుత్వంతో లబ్దిపొందిన వారిని గుర్తించి, వారందరికీ లేఖలు రాయాలని భావిం చారు. 

ఈ బాధ్యతను తెరాసలోని కొందరు ముఖ్యులకు అప్పగించారని తెలిసింది. పథకాల వారీగా లబ్ధిపొందిన కుటుంబాలు, వ్యక్తుల వివరాలను సంబంధిత శాఖల ద్వారా సేకరించి ముఖ్యమంత్రి సంతకంతో లేఖలు రాయబోతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా మీరు, మీ కుటుంబం ప్రయోజనం పొందింది. రాబోవుకాలంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పంతో ఉన్నాము. మీ మద్దతుతో మరో సారి అధికారంలోకి రావడం ద్వారానే కొత్త పథకా లను రూపొందించి, అర్హులకు ప్రయోజనం కల్పించ వలసి ఉంటుంది. ఇప్పటి మాదిరిగానే భవిష్యత్‌లో కూడా మీ మద్దతును తెరాస కోరుకుంటుంది. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాగిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రజల మద్దతుతో తెరాస అధికారంలోకి వచ్చి అనేక కార్య క్రమాలు అమలు జరిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని దేశం గర్వించే విధంగా అమలు జరుపుతుంది. ఢిల్లీకి గు లాంలుగా మారకుండా గులాబీలుగా గుభాళించడానికి తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ మద్దతుతో బంగారు తెలంగాణ సాధించి తీరుతాననే ధీమాతో ముందుకు సాగుతున్నాను. ఢిల్లీ గులాంల నోరు మూయించే విధంగా మరో సారి  తెరాసను ఆశీర్వదించండి అని విజ్ఞప్తి చేస్తూ  ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంతో లేఖలు రాయాలని పార్టీ నిర్ణయిం చింది.  తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముం దస్తు ఎన్నికలకు సిద్దపడిన తెరాస అధినేత, ముఖ్య మంత్రి కెసీఆర్  ఈ విథంగా  సరికొత్త వ్యూహంతో ఓటర్లకు దగ్గర కావాలనుకుంటున్నారు. గతంలో ముఖ్య మంత్రులు ప్రకటించిన పథకాలు, వాటి విజయ రహస్యంపై సమాలోచనలు జరుపుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో డాక్టర్  వై.ఎస్. రాజశేఖర్ ప్రజలకు దగ్గరైన తీరును పరిశీలించారు.  ప్రగతి రథచక్రాలు ఆగ రాదన్న ఉద్దేశంతోనే ముందస్తుకు దూకుడుగా వెళుతున్నారు.

కోటి మందికి పైగా లబ్ధిదారులు?
ప్రభుత్వ నిర్ణయాలతో అబ్ది పొందిన సింగరేణి, విద్యుత్ కార్మికులు, అవుట్ సోర్సింగ్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులు, ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటే వివిధ రూపాల్లో వీరంతా కలిసి  ఒకటిన్నర కోటి మందికి పైగా ఉంటారని  గుర్తించారు.  వీరంతా  తెరాస ప్రభుత్వ నిర్ణయాలతో  లబ్ధిపొందారని కేసీఆర్ భావిస్తున్నట్లు  పార్టీ వర్గాలు వివరించాయి.  ఒక్క కంటి వెలుగు కార్యక్రమంలోనే 5 వారాల వ్యవధిలో 54 లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారని,  వీరంతా పార్టీకి మద్దతు ఇచ్చే వారేనని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ వారికి 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆ లేఖలో కేసీఆర్ గుర్తు చేయనున్న ట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన పనులతో ఒకే కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఏదో ఒక రూ పంలో లబ్దిపొందినవారేనని అంటున్నారు.  ఆరు నెలల వ్యవధిలోనే విద్యుత్ సంక్షోభాన్ని నివారించి 24 గంట లూ నిరంతరాయ సరఫరా చేయడం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి స్వీయానుభమమేనని పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే నాణ్యమైన విద్యుత్‌ను రెప్పపా టు పోకుండా అందివ్వడం తెలంగాణ పట్ల  ఉన్న నిబద్దతకు, చిత్తశుద్దికి నిదర్శనం అంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్ధులకు రెసిడెన్షియల్ స్కూ ల్స్  ఏర్పాటు చేయడం, హాస్టల్ విద్యార్ధులకు సన్న బి య్యంతో పౌష్టికాహారం అందించడంతో పాటుగా సమా జంలోని కుల వృత్తులకు చేకూర్చిన ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో లబ్దిపొందిన వర్గాలను గుర్తించి లేఖలు రాయబోతున్నారు. మహిళా రక్షణకు తీసుకున్న చర్యలు, రైతులకు అందించిన ప్ర యోజనాలను కూడా గుర్తు చేస్తామంటున్నారు. రైతులకు పంటల పెట్టుబడిగా అమలు జరిపిన పథకం వల్ల 57 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందిన విషయం విస్మరించబోరని తెరాస వర్గాలు పేర్కొన్నాయి.నాకు ఆ ఖర్మ పట్టలేదు: నాయిని

Updated By ManamSat, 10/13/2018 - 16:40
Naini Narshimha Reddy slams revanth reddy

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ముషీరాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. తాను పొరపాటున గత ఎన్నికల సందర్భంగా ఐదు లక్షలో, పది లక్షలో కేసీఆర్ ఇస్తారన్నారు అనే బదులు పదికోట్లు అన్నానని, దాన్ని మీడియా సవరించాలన్నారు. 

నాయిని శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌లో చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నా రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్‌కు వ్యతిరేకమే. దిక్కుమాలిన వాళ్లే అలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలను నేను శిరసా వహిస్తా. ముషీరాబాద్ నుంచి మా అల్లుడు ఇండిపెండెంట్‌గా పోటీచేసే ప్రసక్తే లేదు. మాకు టిక్కెట్ ఇవ్వకుంటే కేసీఆర్ దగ్గర మరో ప్రత్యామ్నాయం ఉండే ఉంటుంది. కాంగ్రెస్‌లోకి మారుతున్నామని ప్రచారం చేసిన ఓ మీడియా సంస్థపై మా అల్లుడు పరువునష్టం దావా వేస్తున్నారు. కేసీఆర్ నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనేది నిజం కాదు. కేసీఆర్‌తో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నా.

గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చిల్లరగాడు. ఈసారి కొడంగల్‌లో ఓడిపోవడం ఖాయం. రేవంత్ కొడంగల్‌కు చేసింది ఏమీ లేదు. ఆయనకు ఇంకా చంద్రబాబుతో చుట్టరికం పోలేదు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్‌కే నష్టం.  రేవంత్ రెడ్డి ...కేసీఆర్‌ను ఎంత తిడితే అన్ని ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరం అవుతాయి. ఉత్తమ్ అధికారంలోకి వస్తే అంతు చూస్తామని అధికారులను బెదిరిస్తున్నారు. 

అధికారులు కాంగ్రెస్, టీడీపీ హయంలో పనిచేసినవారే.. ఎక్కడి నుంచో రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు. ఆయనకు గడ్డం పెరగాల్సిందే కానీ అధికారం రాదు. అప్పుడు ఉత్తమ్‌ను గడ్డం కుమార్ రెడ్డి అని పిలవాల్సిందే. అన్ని సర్వేలు టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయి. మా సంక్షేమ పథకాలే టీఆర్ఎస్‌కు వందసీట్లు తెచ్చిపెడతాయి. కేసీఆర్ పథకాలు దేశంలో అందరికీ ఆదర్శం అయ్యాయి. కాంగ్రెస్ నేతలు జీరోలు కాబట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. మేము హీరోలం. మళ్లీ అధికారం మాదే’ అని ధీమా వ్యక్తం చేశారు.శ్రీ రఘునాథాచార్య స్వామి మృతికి సంతాపం

Updated By ManamSat, 10/13/2018 - 15:38
kcr-Raghunathacharya Swamy

హైదరాబాద్ : ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మహోపాధ్యాయ శ్రీ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.స్వామి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రఘునాథాచార్య స్వామి మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు అన్నారు. 

శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా సంప్రదాయ పరంపరను కొనసాగిస్తూ జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను తీర్చిదిద్దిన ఆచార్యుల వారు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనిషి రఘునాథాచార్య స్వామి. అన్నారు. తన ప్రవచన పరంపరతో ప్రతీ ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనిషి అని కొనియాడారు.నేను ఏ పార్టీలో చేరను: గద్దర్

Updated By ManamFri, 10/12/2018 - 14:27
gaddar met rahul gandhi

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే తాను జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. అయితే తాను ఏ పార్టీలో చేరడం లేదని, తాను ఏ పార్టీ సభ్యుడిని కాదని ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో గద్దర్ శుక్రవారం భేటీ అయ్యారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ... అందరూ కోరుకుంటే కేసీఆర్‌పై పోటీ చేస్తానని అన్నారు. ప్యూడలిజానికి వ్యతిరేకంగా తాను పోటీ చేస్తానని, త్వరలో అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని చెప్పారు. నా జీవితం అంతా ప్రజల పక్షమే అని అన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ఆధ్వర్యంలో గద్దరు కుటుంబీకులు ఇవాళ రాహుల్‌ను కలిశారు. అలాగే ఈరోజు సాయంత్రం సోనియాగాంధీతో కూడా భేటీ కానున్నారు. కాగా గద్దర్ కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.హరీశ్‌ మీ మామను అడుగు...

Updated By ManamWed, 10/10/2018 - 20:50
 • హరీశ్‌‌రావుకు ఎల్.రమణ కౌంటర్

L.ramana Counter To Harish Rao Comments

హైదరాబాద్ : మహాకూటమికి సంబంధించి టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అభ్యర్థుల జాబితా టీఆర్‌ఎస్ కుట్రలో భాగమేనని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీల నాయకుల ఉమ్మడి సమావేశంలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని, అంతవరకూ వదంతులను నమ్మవద్దని ఆయన కార్యకర్తలకు సూచించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్‌ఎస్ కుట్రలు ఇక సాగవని, ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. 

బీజేపీ, ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు మహాకూటమిని ప్రశ్నించే నైతిక అర్హతలేదన్నారు. హరీశ్‌రావుకు నిజాయితీ ఉంటే ఆ లోపాయికారి ఒప్పందం ఏమిటో తన మామ కేసీఆర్‌ను అడగాలని రమణ దుయ్యబట్టారు. అప్పు తెచ్చిన రూ.లక్ష 50 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో హరీశ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం, ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు బుచ్చిలింగం, సామా రంగారెడ్డితో కలిసి రమణ మీడియా సమావేశంలో మాట్లాడారు.కౌంటర్ టీమ్ 

Updated By ManamWed, 10/10/2018 - 00:48
 • విపక్షాల విమర్శలు తిప్పికొట్టడానికీ..  సవాల్ జేయడానికీ బృందం 

 • పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా ఏర్పాటు

 • ఆరోపణలకు ఖండన... విమర్శలకు కౌంటర్

 • విపక్షాలకు ధీటైన సమాధానాలు.. సవాళ్లు.. విసుర్లు..

 • ఇక రాష్ట్రంలో పసందైన మాటల తూటాలు

 • దీనిలో భాగమే ఉత్తమ్‌కు హరీష్‌రావు లెటర్!

kcrహైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాటు, వారు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికి టీఆర్‌ఎస్ పార్టీలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపిక చేసిన నాయకులు ఈ బ్యాచ్‌లో ఉంటారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఆధారాలతో పాటు తిప్పికొట్టడం, ప్రతిపక్షాల లోపాలను ఆసరాగా చేసుకొని ఎదురుదాడి చేయడం ఈ బ్యా చ్ ఏర్పాటులో ప్రధాన ఉద్దేశం. ఈ బృందంలోని సభ్యులకు పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తుంది. వచ్చిన ఆరోపణల పరిధి, చేసిన వారి స్థాయిని బట్టి హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ వీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కౌంటర్లు ఇస్తారు. సభలు సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడం కోసం ఎప్పటికప్పుడు వీరు కార్యాచరణ చేపడతారు. ప్రస్తుతం ప్రతిపక్షాల విమర్శలకు నాయకత్వం ధీటైన సమాధానం ఇవ్వడం లేదని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నాలుగేండ్ల పాలనలో టీఆర్‌ఎస్ సర్కారు సాధించిన ప్రగతిని వివరించడం, విపక్షాల చర్యలను ప్రజల్లో ఎండగట్టడం, విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వడం, అవసరమైన పక్షంలో సరైన ఆధారాలతో సవాల్ విసురుతూ, విపక్షాలను రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలని సూచిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రమే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలనుకోవడం సరైన విధానం కాదంటున్నారు. పార్టీ వల్ల రాజకీయ ప్రయోజనం పొందిన వారు కూడా తెరాసకు జరిగే రాజకీయ నష్టాన్ని నివారించక పోవడం విచారకర మంటూ కేసీఆర్ ఆవేదన చెందినట్టు తెరాసలో కొందరు సీనియర్ నేతలు పేర్కొంటున్నారు.

ఇక మీదట పార్టీ ఎన్నికల ప్రచారం స్పీడు పెంచడం, ప్రతిపక్షాలను ఎండగట్టడం, విమర్శలను తిప్పికొట్టడంలాంటి కార్యా చరణ ఎన్నికలు ముగిసేంతవరకు కొనసాగవలసిన నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి సూచించడంతో,  ధీటైన నాయకులను గుర్తించడంలో పార్టీ అధినాయకత్వం నిమగ్నమైంది. దీనిలో భాగంగానే మంత్రి హరీష్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ప్రశ్నలు సంధించారు. ఇక మీదట ప్రతి నిత్యం ఎంపిక చేసిన నాయకులతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం ఇవ్వడం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్, తేదేపా, తెజస పక్షాలు తెరాసపై విమర్శలు గుప్పిస్తున్నాయి. పీపీసీ నాయకత్వం మరో రెండడుగులు ముందుకేసి కేసీఆర్ పై విరుచుకుపడుతుంది.  తమ పార్టీ, పార్టీ అధినేతపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే పరిస్ధితి తెరాసలో లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డప్పటికీ మీడియా ద్వారా జనంలోకి తెరాస వాదన పోలేకపోయింది. ఇలాంటి పరిణామాలను అధిగమించడానికి కొంతమంది సీనియర్ నాయకులను ఎంపిక చేయవలసిన అవసరం ఉందని కేసీఆర్ భావించారు. అధికార ప్రతినిధులు ఏర్పాటు చేసే విలేకరుల సమావేశాలు సర్వసాధారణమైపోయాయి. వారి వాదన ఆశించిన మేరకు ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీని వల్ల విపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్ధితి నెలకొంటుంది. ఎన్నికల సమరంలో అధికారంలో ఉన్న వారు విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కొలేక పోతే రాజకీయంగా నష్టపోతాం, తమపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా నివారించడానికే ధీటైన నాయకులతో విమర్శలను తిప్పికొట్టవలసి ఉంటుంది అని అధినేత చేసిన సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నామని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే కౌంటర్ బ్యాచ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Related News