Nandamuri balakrishna

విశ్వవిఖ్యాత నటసామ్రాట్‌గా కైకాల

Updated By ManamTue, 02/13/2018 - 22:34

kaikala satyanarayanaఐదున్నర దశాబ్దాల ప్రస్థానంలో నవ్వించి.. కవ్వించి.. ఏడిపించి.. నవరసాల్లో ఏ రసాన్నైనా ఏకధాటిగా చేయగల సత్తా ఉన్న నటుడిగా.. నవరసనట సార్వభౌమగా ఖ్యాతి గాంచిన కైకాల సత్యనారాయణ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలకు గానూ సత్యనారాయణను విశ్వ విఖ్యాత నట సామ్రాట్ బిరుదుతో సత్కరించింది టి సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ బిరుదును ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి గంటా, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బిరామిరెడ్డి, ఎంపీ మురళీమోహన్, హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ బిరుదు కేవలం కైకాలకు దక్కిన గౌరవంగా కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని బాలయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సత్యనారాయణ వంటి నటులను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.తెలుగుదేశంలోకి పురంధేశ్వరి కొడుకు..?

Updated By ManamMon, 02/12/2018 - 20:55

 daggubati purandeswariతన తండ్రి ఎన్టీఆర్ స్టాపించిన తెలుగుదేశం పార్టీలో తమకు చోటు లేకపోవడం దగ్గుబాటి పురంధేశ్వరి పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్నారనే అక్కసుతో తనభర్తతో కలిసి పార్టీ నుంచి బయటకు వచ్చారు పురంధేశ్వరీ. కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పురంధేశ్వరి.. రాష్ట్ర విభజన తర్వాత భర్తతో కలిసి తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు.. అయితే వీరి రాకను చంద్రబాబు అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే తనకు దక్కని అదృష్టాన్ని తన కుమారుడికి దక్కేలా చేయాలని పురంధేశ్వరీ పావులు కదుపుతున్నారట.

తమ కుటుంబానికి పట్టున్న పర్చూరు నుంచి తనయుడు చెంచురామ్‌ను అసెంబ్లీకి పోటీ చేయించాలని ఆమె భావిస్తున్నారట. సోదరుడు బాలకృష్ణ ద్వారా పురంధేశ్వరీ తెర వెనుక నుంచి ఈ వ్యవహారం చక్కబెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. తమ కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు తదితర అంశాలు చంద్రబాబుకు తెలియజేయాల్సిందిగా పురంధేశ్వరి.. బాలయ్యతో చెప్పినట్లు పొలిటికల్ టాక్.. ఈ అంశాన్ని బావ.. అల్లుడు లోకేశ్ వద్ద బాలయ్య ప్రస్తావించినట్లు పచ్చ కండువాలు గుసగుసలాడుకుంటున్నాయి.

చెంచురామ్‌కి టికెట్ ఇవ్వడం ద్వారా దశాబ్దాలుగా ఉన్న మనస్పర్థలు తొలగడంతో పాటు నందమూరి, దగ్గుబాటి కుటుంబాల అండ తెలుగుదేశానికి దక్కుతుందని చంద్రబాబు కూడా భావిస్తున్నారట. కుటుంబపరంగానూ.. రాజకీయం గానూ తనకు లబ్ధి చేకూర్చే ఈ అవకాశాన్ని చంద్రబాబు వంటి రాజకీయ మేధావి వదులుకోరని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.ఆస్పత్రి నుంచి బాలకృష్ణ డిశ్చార్జ్

Updated By ManamMon, 02/05/2018 - 12:44

Nandamuri Balakrishna, discharge from hospital, right hand shoulder surgery హైదరాబాద్‌: సినీనటుడు, నందమూరి బాలకృష్ణ సోమవారం కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన కుడిభుజానికి గాయం కావడంతో నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ‘రొటేటర్ కప్ టియర్స్ ఆఫ్ షోల్డర్’ సమస్యతో బాధపడుతున్న బాలయ్యకు శనివారం ఆర్థోపెడిక్ సర్జన్ దీప్తి నందన్ రెడ్డి, డా. ఆశిష్ బాబుల్కర్ సర్జరీ చేశారు.  'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం షూటింగ్‌ లో సమయంలో బాలయ్య కుడిభుజానికి గాయమైంది.

అప్పటినుంచి విరామం లేకుండా వరుసగా సినిమాలు చేసిన బాలకృష్ణ శాశ్వత పరిష్కారం కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సోమవారం ఉదయం 10 గంటలకు బాలకృష్ణను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యే ముందు తనకు ఆపరేషన్ చేసిన డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్‌లకు బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా సర్జరీ చేసిన వైద్యుల్లో ఒకరితో బాలకృష్ణ ఫొటో దిగారు. కాగా, ప్రస్తుతం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవితాధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌తో బిజీగా ఉన్న సంగతి విదితమే. బాలయ్య బొలెరో ఎత్తడం చూసి అవాక్కైన మ‌హీంద్రా 

Updated By ManamTue, 01/16/2018 - 12:25

 Bolero Car, Jaisimha movie, Tech mahindra comment viral, Anand mahindra comment, Jaisimha movie, Nandamuri balakrishnaనందమూరి నటసింహాం బాలయ్యబాబు సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 'పల్నాటి బ్రహ్మ నాయుడు'  సినిమాలో కనుసైగతోనే రైలును వెనక్కి పంపిన బాలకృష్ణ.. ఇటీవల సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన 'జై సింహా' చిత్రంలోని ఓ సన్నివేశంలో ఏకంగా బొలెరో కారును ఒక్క చేతితో ఎత్తి శభాష్ అనిపించారు. ప్రసుత్తం ఈ సినిమా.. థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ స‌న్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో గురించి మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా అధినేత ఆనంద్ మ‌హీంద్రా సరదాగా ఓ కామెంట్ చేశారు. విష్ణు చైత‌న్య అనే నెటిజ‌న్ ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్రాకి పంపించారు. ఈ వీడియోపై మీరు ఎలా స్పందిస్తారో చెప్పాలని కోరారు. 

Bolero Car (7452), Jaisimha movie (7453), Tech mahindra comment viral (7454), Anand mahindra comment (7455), Nandamuri balakrishna (7456)ఆయన కోరిక మేర‌కు ఆనంద్ మ‌హీంద్రా ట్విట్ట‌ర్‌లో ఈ సన్నివేశాన్ని చూసి అవాక్కయ్యారు. దీనిపై ఆయన ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘హాహా.. బొలెరో కార్లను చెక్‌ చేయడానికి ఇకపై సర్వీస్‌ వర్క్‌షాపులు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు వాడనక్కర్లేదు’ అని ఇలా సరదాగా ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా పలు కామెంట్లు పెడుతున్నారు. బాలయ్యకు ఇది పెద్ద కష్టం కాదు.. తన కనుసైగతో రైలునే వెనక్కి పంపేసిన సన్నివేశానికి కంటే ఇది చాలా చిన్నదే.  దట్ ఈజ్ బాలయ్యబాబు. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. 15ఏళ్ల కుర్రాడిలా బాలయ్య బోలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తాడు. దీంతో బాలయ్యకు వయస్సు మీద పడిన   తనలో ఏమాత్రం సత్తువ తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.  
Related News