tdp

చివరి వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయండి

Updated By ManamWed, 03/21/2018 - 08:46

babu తిరుమల: రాష్ట్ర హక్కుల కోసం చివరి రోజు వరకు స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు సూచించారు. తిరుపతిలో టీడీపీ ఎంపీలతో టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించిన చంద్రబాబు పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగష్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకే తాటిపై నిలిచి విజయం సాధించారని.. ఇప్పుడు అదే స్ఫూర్తి ఎంపీల్లో కనిపించాలని, న్యాయం జరిగే వరకు పోరాడాలని సూచించారు. మనకు ఎవరిపైనా కోపం, ద్వేషం లేదని తెలిపిన చంద్రబాబు కేంద్రం అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. ఏపీ సమస్య ఇప్పుడు జాతీయ సమస్యగా మారిందని.. అవిశ్వాసానికి బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక వైసీపీది లాలూచీ అవిశ్వాసమని.. జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని తెలిపారు.పవన్ నిమిషానికో మాట మాట్లాడతాడు: చంద్రబాబు

Updated By ManamTue, 03/20/2018 - 18:35

pawanఅమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీపై, పవన్‌పై మండిపడ్డారు. ఏపీకి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. నాలుగేళ్లు ఓపికగా ఎదురుచూశామని, తామెక్కడా తొందరపడలేదని ఆయన తెలిపారు. నాలుగేళ్ల సమయాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేకపోయిందని సీఎం వ్యాఖ్యానించారు. అన్యాయమైపోయిన ఏపీకి అండగా నిలవాలని కేంద్రాన్ని కోరామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. అవిశ్వాసం నోటీసు అనుమతించకుండా వాయిదాలు వేస్తున్నారని పార్లమెంట్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి వకాల్తా పుచ్చుకుని వైసీపీ, జనసేన నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. పవన్ నిమిషానికో మాట మాట్లాడతాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ టీడీపీపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. 3పార్టీల డ్రామాలాడుతున్నాయని, గ్రామాల్లో ప్రజలకు ఆ పార్టీలాడుతున్న డ్రామాల గురించి చెప్పాలని టీడీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మోదీ పై తనకు కోపం లేదని, ఏపీకి అన్యాయం చేశాడనే బాధ ఉందని చంద్రబాబు చెప్పారు.'కాంగ్రెస్‌తో టీడీపీ చీకటి ఒప్పందం'

Updated By ManamTue, 03/20/2018 - 16:36

TDP, BJYM AP President, Vishnu vardhanreddy న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ చీకటి ఒప్పందం కుదుర్చుకుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్టువర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 600 హామీల్లో 590 వరకు అమలు చేయలేదని అన్నారు. బీజేపీని ముద్దాయిలుగా చేయాలని చూస్తే టీడీపీనే మునిగిపోతుందని హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40 లక్షల మంది నిరుద్యోగులను వంచించారని మండిపడ్డారు. ఖాళీగా ఉ‍న్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయలేదని.. రుణమాఫీ కూడా అసంపూర్ణంగా చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.అవిశ్వాసాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్

Updated By ManamTue, 03/20/2018 - 13:50

trs

న్యూ ఢిల్లీ: అవిశ్వాసం తీర్మానం ఇప్పట్లో పార్లమెంట్‌లో చర్చకు వచ్చేట్లు లేదు. మూడు రోజులుగా జరిగిన పార్లమెంట్ సమావేశాలను పరిగణలోనికి తీసుకుంటే ఒక్కరోజంటే ఒక్క రోజు కూడా పట్టుమని పదినిమిషాలు సక్రమంగా జరిగిన దాఖలాల్లేవ్. ఓ వైపు అవిశ్వాసంపై చర్చించాలని ఏపీ ఎంపీల ఆందోళనలు, మరోవైపు రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు, ఇంకోవైపు కావేరి జలాలపై అన్నాడీఎంకే ఎంపీల నినాదాలతో పార్లమెంట్ లోపల, ప్రాంగణమంతా అట్టుడికింది. దీంతో మంగళవారం కూడా అవిశ్వాస తీర్మానం చర్చకు రాలేదు. 

మంగళవారం సభ జరిగిందిలా..!
ఉదయం సభ ప్రారంభం కాగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. ఈ గంధరగోళం మధ్యనే కేంద్ర విదేశాంగశాఖమంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీలంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేయడంతో సభకు తీవ్ర అడ్డంకి ఏర్పడింది.. దీంతో మొదట సభ ప్రారంభమైన కాసేపటికే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు సుమిత్రా మహాజన్ తెలిపారు. వాయిదా అనంతరం మళ్లీ సభ ప్రారంభమవ్వగానే.. లోక్‌సభలో సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మళ్లీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ పైకిలేచి..  ఇరాక్‌లో 39 మంది భారతీయుల హత్యకు సంబంధించి ప్రకటన చేశారు. ఓ వైపు పార్లమెంట్ సభ్యులు నినాదాలు హోరెత్తిస్తున్నా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తాను చేయాల్సిన ప్రకటన చేసేశారు సుష్మా.

Related Article: 39 మంది భారతీయులు హతం.. లోక్‌సభలో సుష్మా స్వరాజ్ ప్రకటన 

సుష్మా స్వరాజ్ ప్రకటన అనంతరం..
కేంద్ర మంత్రి ప్రకటన అనంతరం మరోసారి టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు పట్టుకుని వెల్‌‌లోకి దూసుకెళ్లారు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. సభ ఆర్డర్‌‌లో లేకపోవడంతో.. సభ సజావుగా జరిగేందుకు సభ్యులంతా సహకరించాలని కచ్చితంగా అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టవచ్చవని స్పీకర్ పదేపదే చెప్పినప్పటికీ సభ్యులు మాత్రం ఏ మాత్రం లెక్కచేయలేదు!.

ఆగ్రహించిన స్పీకర్..
"సభ్యుల తీరు ఆపేక్షణీయం. సాటి భారతీయులంటే మీకు గౌరవం లేదా?. సభ్యులు మానవత్వంలో వ్యవహరించాలి. సభలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. దేశ ప్రజల సమస్యలు ఎంపీలకు పట్టకపోతే ఎలా?" అని స్పీకర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ హడావుడి అంతా అయిపోయిన అనంతరం వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సభలో చదివి వినిపించారు.

పక్కింట్లో పెళ్లయితే మా ఇంట్లో రంగులెందుకు?
అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం పిల్లలాట కాదని.. పక్కింట్లో పెళ్లి అయితే మా ఇంట్లో రంగులు వేసుకోవాల్సిన అవసరంలేదని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. అవిశ్వాస తీర్మానం రాజకీయ స్వార్థంలో భాగమేనని, మాతో చర్చించకుండా అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తాం? అని ఎంపీ నర్సయ్యగౌడ్ ఏపీ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ సందర్భంగా సూటి ప్రశ్న సంధించారు.

టీఆర్ఎస్ అనూహ్య నిర్ణయమెందుకు?
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటానికి జై కొట్టిన టీఆర్‌ఎస్‌.. అవిశ్వాసానికి మాత్రం మద్దతివ్వబోమని తేల్చిచెప్పేసింది. అన్నదమ్ముళ్లుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు కష్టకాలంలో ఒకరినొకరు ఆదుకోకుంటే ఎలా? అంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఏపీకి సమస్య వచ్చి పడింది సరే.. రేపొద్దున ఇంతకంటే పెద్ద సమస్య తెలంగాణకు వస్తే ఏపీ సహకరిస్తుందా? అనే ప్రశ్నలు తెలుగు ప్రజల మెదళ్లలో మెదులుతున్నాయి. మొత్తానికి చూస్తే గత కొద్ది రోజులుగా చూస్తే టీఆర్ఎస్ వైఖరి పార్లమెంట్‌‌లో చాలా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదాతో పోలిస్తే రిజర్వేషన్ల అంశం చాలా చిన్నది.. మొదట ఈ అవిశ్వాస తీర్మానం వ్యవహారం పూర్తయితే అనంతరం తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా కలిసి పోరాడొచ్చు.. అవసరమైతే మరోసారి ఈ విషయంపై అవిశ్వాసం పెట్టనూ వచ్చు. అలాంటివేమీ లేకుండా స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీసులను చదివితే చాలు.. మరో క్షణమే టీఆర్ఎస్ హడావుడి చేయడం.. సభ జరగకుండా అడ్డుకోవడం, పోడియంపైకి దూసుకెళ్లడం ఇలాంటి పనులు చేస్తూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా

Updated By ManamTue, 03/20/2018 - 11:15

Parliament Day

న్యూ ఢిల్లీ: లోక్‌సభలో సేమ్ సీన్ మళ్లీ రిపీట్ అయింది. మంగళవారం లోక్‌సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు, నిరసనలతో హోరెత్తించారు. దీంతో చేసేదేమీ లేక స్పీకర్ సుమిత్రా మహాజన్.. ఆందోళనల మధ్య లోక్‌సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడటంతో బయటికొచ్చిన ఏపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. మరోవైపు రాజ్యసభ కూడా వాయిదాపడింది. రాజ్యసభను కూడా ఏపీ ప్రత్యేక హోదా మంటలు తాకాయి. కేంద్రం తీరుపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు గులాంనబీ ఆజాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మధ్యాహ్నం 12గంటలకు ఏపీ ఎంపీల అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందన్న నమ్మకాల్లేవని తెలుస్తోంది.! ఇదిలా ఉంటే ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం నిరవధిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా కొద్దిరోజులుగా రిజర్వేషన్ అధికారాలు రాష్ట్రానికి అప్పగించాలంటూ టీఆర్ఎస్.. కావేరి జలాలకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీని మోదీ ఏమీ చేయలేరు!

Updated By ManamSun, 03/18/2018 - 10:08

kesineni on modi

విజయవాడ: ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం, వైసీపీ, జనసేనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, వైసీపీ, జనసేన.. టీడీపీని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

"రాష్ట్ర ప్రజలను బీజేపీ నమ్మించి మోసం చేసింది. ఒక వైపు జగన్‌తో, మరో వైపు పవన్‌తో కలిసి బీజేపీ కుట్రలు చేస్తోంది. టీడీపీ ఇప్పటి వరకూ ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొన్నది. టీడీపీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న నష్టాన్ని, మోసాన్ని గత ఏడాది మే లోనే చెప్పాను. రైతులు, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పని చేస్తున్నారు" అని కేశినేని నాని చెప్పుకొచ్చారు.టీడీపీకి అన్నాడీఎంకే మద్దతివ్వాలి: స్టాలిన్

Updated By ManamSat, 03/17/2018 - 16:43

MK Stalinచెన్నై: కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడుకు న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే కూడా మద్దతు తెలపాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబుకు ఉన్న అక్కర...తమిళనాడు సీఎం పళనిస్వామి-పన్నీర్ సెల్వంకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కావేరీ జలాల విషయంలో తమిళనాడు ప్రయోజనాలను పరిరక్షించాలన్న చిత్తశుద్ధి సీఎం పళనిస్వామికి ఏ మాత్రం ఉన్నా...టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడుతున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 

Read related article: ‘ద్రవిడ నాడు’కు డీఎంకే మద్దతు

లోక్‌సభలో తమ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించి ఉండేవారిమన్నారు. లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న అన్నాడీఎంకే...కావేరీ నదీ జలాలు, నీట్ వ్యవహారంలో తమిళనాడు హక్కుల సాధన కోసం ప్రస్తుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని సీఎం పళనిస్వామి ప్రకటించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ అవిశ్వాసంతో మాకు సంబంధం లేదు

Updated By ManamSat, 03/17/2018 - 13:59

టీడీపీ, వైసీపీ అవిశ్వాసంతో మాకు సంబంధం లేదు

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ఈ అవిశ్వాసం తీర్మానం చర్చకు రావాల్సివుండగా కొన్ని అనివార్యకారణాల వలన వాయిదా పడటంతో సాధ్యం కాలేదు. అయితే ఈ అవిశ్వాసానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ అవిశ్వాసంపై టీఆర్ఎస్ మాత్రం శుక్రవారం ఎలాంటి స్పందన రాలేదు. టీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పక్షనేత జితేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంతో మాకు సంబంధం లేదని తేల్చిచెప్పేశారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం మాత్రమే పార్లమెంట్‌లో మా పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

అలాగే విభజన హామీలు అమలు చేయకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని జితేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ దేశ రాజకీయాలను మారుస్తుందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని జితేందర్‌రెడ్డి జోస్యం చెప్పారు. కాగా ఈ ఒక్క అవిశ్వాస మినహా ఇతర విషయాలపై టీఆర్ఎస్.. టీడీపీకి మద్దతిచ్చిందన్న సంగతి తెలిసిందే.

కాగా గత కొద్దిరోజులుగా ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అధికారాలు రాష్ట్రాలకు అప్పగించాలని అలుపెరగని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలకు అప్పగించేంత వరకు సభలో.. బయట తమ నిరసనను తెలియజేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.పవన్‌కు టీడీపీ నేతల కౌంటర్..

Updated By ManamSat, 03/17/2018 - 13:19

TDP Leaders Counter Attack On Janasena Chief Pawan

అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ సభలో, గుంటూరు అతిసార బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ మాట్లాడిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీ టీడీపీపై సంచలన ఆరోపణలు చేయడంతో ఆ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చి పవన్‌‌ వ్యాఖ్యలపై కౌంటర్‌ ఎటాక్ చేస్తున్నారు.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు..
పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలకు ఇబ్బంది అని మంత్రి చెప్పుకొచ్చారు. సమస్యలపై పవన్ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.

ఇదేం సినిమా కాదు పవన్..!
అతిసార ప్రబలిన ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. 48 గంటల డెడ్‌లైన్ పెట్టడానికి ఇదేం సినిమా కాదని పవన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మృతుల గుర్తింపునకు కమిటీ వేశామని.. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

పవన్ మాటలు ప్రజలు నమ్మరు..
పవన్‌ కల్యాణ్‌ మాటలను ప్రజలను నమ్మడం లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చెప్పుకొచ్చారు.  ఎవరో చెబితే మంత్రి లోకేష్‌పై ఆరోపణలు చేశానని పవనే అన్నారని...అందుకే పవన్‌ను జనం నమ్మడం లేదన్నారు. ఉన్నట్టుండి పవన్‌ యూటర్న్‌ తీసుకోవడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.శివసేనను మచ్చిక చేసుకుంటున్న బీజేపీ

Updated By ManamFri, 03/16/2018 - 20:47
bjp shivasena

ముంబై: శివసేనను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ షురూ చేసింది. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ వైదొలగడంతో...పాత మిత్రపక్షమైన శివసేన చేజారిపోకుండా బీజేపీ జాగ్రత్తపడుతోంది. ఎప్పటి నుంచో బీజేపీ తీరు పట్ల గుర్రుగా ఉన్న శివసేనను...మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కున చేసుకోవాలన్నది కమలనాథుల వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ గీతేతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఏకాంత చర్చలు జరిపారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు దన్వే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ సర్కార్‌పై టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వీరి మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో చర్చకు వచ్చే పక్షంలో ఓటింగ్‌లో కేంద్రానికి మద్దతు ఇవ్వాలని అనంత్ గీతేని ఫడ్నవిస్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతిచ్చే విషయంలో శివసేన ఎలాంటి స్పష్టమైన హామీనీ ఇవ్వలేదని సమాచారం. 543 సభ్యులతో కూడిన పార్లమెంటులో ప్రస్తుతం బీజేపీకి చెందిన 274 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వానికి పార్లమెంటులో 272 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది. 16 మంది ఎంపీలతో కూడిన టీడీపీ ఎన్డీయే నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్యపక్షాలతో కలిపి బీజేపీ బలం 315గా ఉంది. శివసేనకు 18 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు.

2019లో లోక్‌సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని, ఒంటరిగా పోటీ చేస్తామని ఇటీవల ఆ పార్టీ ప్రకటించింది. మోదీ ప్రభుత్వ తీరును శివసేన ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ప్రస్తుతం బీజేపీకి 272 మంది ఎంపీలు ఉండగా...2019 ఎన్నికల్లో ఆ పార్టీ బలం 100 నుంచి 110 మేరకు తగ్గే అవకాశం ఉందని శివసేన అధికార పత్రిక సామ్నా పేర్కొంది. అంటే బీజేపీ బలం 160-170 స్థానాలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Related News