టీఆర్‌ఎస్‌లోకి జోరందుకున్న చేరికలు

Updated By ManamThu, 11/09/2017 - 20:57
TRS

hariesh raoతెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. చేరికలు జోరందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. టీడీపీకి చెందిన ఏ నాయకుడు ఏ పార్టీలోకి జంప్ అవుతాడో తెలియని పరిస్థితి నెలకొంటోంది. టీడీపీ వర్గీయులను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంటోంది. దీంతో తెలంగాణ‌లో టీడీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంటోంది. 

రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్ తీర్థంపుచ్చుకోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని టీడీపీ క్యాడర్‌ను తమ గూటికి రప్పించుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ కి చెందిన మున్సిపల్ కౌన్సెలర్ కృష్ణ మోహన్‌తో పాటు 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో  హైదరాబాద్‌లోని టీఆరెస్ భవన్‌లో వారు గులాబీ కండువా కప్పుకున్నారు. మరిన్ని చేరికలు కొనసాగుతాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

English Title
Leaders Joining in TRS
Related News