అమెరికా ‘స్పేస్ ఫోర్స్’

Updated By ManamSat, 08/11/2018 - 00:23
america
  • చైనా, రష్యాలను ఎదుర్కొనేందుకే..

  • 2020లోగా ఏర్పాటుకు ప్రణాళికలు

  • కాంగ్రెస్ ఎదుట ప్రతిపాదనలు


imageవాషింగ్టన్: పదాతి దళాన్ని చూశాం! నౌకా దళాన్ని, వాయు సేనను కూడా చూశాం! భవిష్యత్తులో ‘అంతరిక్ష దళం’ను కూడా చూడాల్సి రావొచ్చు! చైనా, రష్యా నుంచి తన ఆధిపత్యానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న నేపథ్యంలో కొత్తగా ‘స్పేస్ ఫోర్స్’ ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనలను కాంగ్రెస్  ముందుంచారు. వాటికి ఆమోదం లభిస్తే త్వరలోనే ‘స్పేస్ ఫోర్స్’ కార్యరూపం దాల్చనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కొద్దిరోజుల క్రితం ఆ దేశ రక్షణశాఖ మంత్రి మెక్ పెన్స్ చూచాయగా వెల్లడించారు.

‘‘రష్యా, చైనా అంతరిక్ష కార్యక్రమాలు సైనిక అవసరాలతో ముడిపడి ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరకొరియా, ఇరాన్‌తోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఆ హెచ్చరికలు చివరికి అంతరిక్షంలో ఘర్షణకు దారితీయొచ్చు. రష్యా కొద్ది రోజుల క్రితం యాంటీ శాటిలైట్ మిసైల్ సిస్టమ్ పీఎల్-19/నుడాల్‌ను పరరీక్షించింది. అలాగే చైనా కూడా ఇలాంటి పరీక్షలే నిర్వహించినట్లు తెలిసింది. ఎస్‌సీ-19 లేదా డీఎన్-3 పేరుతో అంతరిక్షంలోని శాటిలైట్లను పేల్చేసే పరిజ్ఞానాన్ని చైనా పరీక్షించింది.

image

వాటి వాలకాన్ని చూస్తుంటే అంతరిక్షంలో యుద్ధానికే సిద్దపడినట్లు అవగతమవుతోంది. మేం కూడా సిద్ధం కావాలని భావిస్తున్నాం. ప్రత్యేకంగా స్పేస్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటుకు యోచిస్తున్నాం’’ అని పెన్స్ పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించిన లోగోలను కూడా విడుదల చేశారు. ఓటింగ్ ద్వారా ఒక లోగోను ఎన్నుకోవాలని సూచించారు.  2020 నాటికి దీనికి కార్యరూపం ఇవ్వాలని భావిస్తున్నారు.

English Title
America's 'space force'
Related News