ఆండ్రాయిడ్ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్, ఓ బ్యాడ్‌న్యూస్

Updated By ManamFri, 08/17/2018 - 12:23
whatsapp

whats appమెసేజింగ్ యాప్‌లలో దూసుకుపోతున్న వాట్సాప్, సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌తో జతకట్టింది. దీంతో ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఒక గుడ్‌న్యూస్‌, మరో బ్యాడ్‌న్యూస్‌ రాబోతున్నాయి. అందులో గుడ్‌న్యూస్ ఏంటంటే.. గూగుల్‌ డ్రైవ్‌ స్టోరేజ్‌లో మీ వాట్సాప్‌ డేటా స్టోరేజ్‌ స్పేస్‌ను కౌంట్‌ చేయరని వాట్సాప్‌ తెలిపింది. 

ఇక బ్యాడ్‌న్యూస్‌ ఏమిటంటే.. ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు గూగుల్‌ డ్రైవ్‌ అప్‌డేట్‌ చేయకపోతే మాత్రం, వాట్సాప్‌ బ్యాకప్‌లన్నీ ఆటోమేటిక్‌గా తొలగించబడనున్నట్లు తెలిపింది. ‘‘ఆటో-డిలీట్‌ ఆప్షన్‌ నవంబర్‌ 12 నుంచి అందుబాటులోకి వస్తుంది. మాన్యువల్‌ బ్యాకప్‌ ద్వారానే మీ ఫైల్స్‌ను, మెసేజ్‌లను సురక్షితంగా ఉంచుకోవాలి. మీ చాట్స్‌ను అక్టోబర్‌ 30 లోపే మాన్యువల్‌ బ్యాకప్‌ చేసుకోవాలి’’ అని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ యూజర్లకు సూచించింది.

ఇందుకోసం ‘‘సెట్టింగ్స్‌కు వెళ్లి, చాట్‌, చాట్‌బ్యాకప్‌ను క్లిక్‌ చేయాలి. ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ ఫోన్‌ను మార్చినప్పుడు, కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను సెట్టింగ్‌ చేసుకోవడంతో పాటు పాత ఫోన్‌లోని చాట్లను బ్యాకప్‌ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌కు చాట్‌ డేటా అంతా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ విషయాలపై ఇప్పటికే గూగుల్‌.. గూగుల్‌ డ్రైవ్‌కు వాట్సాప్‌ అకౌంట్లతో లింక్‌ అయి ఉన్న ఖాతాదారులందరికీ సమాచారం అందజేస్తుంది.  అయితే యూజర్లెప్పుడూ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. గూగుల్‌ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకునే వాట్సాప్‌ చాట్‌లు, మెసేజ్‌లు ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ కాదు’’ అంటూ పేర్కొంది.

English Title
Whatsapp link with Google
Related News