‘నీవెవ‌రో’ మూవీ రివ్యూ

Updated By ManamFri, 08/24/2018 - 14:32
Neevevaro
Neevevaro

నిర్మాణ సంస్థ‌:  కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా
న‌టీన‌టులు: ఆది పినిశెట్టి, తాప్సి, రితికా సింగ్, వెన్నెల‌కిషోర్‌, తుల‌సి, శివాజీరాజా, శ్రీకాంత్ అయ్య‌ర్‌, స‌త్య‌కృష్ణ‌న్‌, సప్త‌గిరి, ఆద‌ర్శ్, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు
సంగీతం: అచ్చు రాజామ‌ణి, ప్ర‌స‌న్
ర‌చ‌న‌, స‌మ‌ర్ప‌ణ‌:  కోన వెంక‌ట్‌
నిర్మాత‌:  ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌
ద‌ర్శ‌క‌త్వం:  హ‌రినాథ్‌
కెమెరా: సాయిశ్రీరామ్‌
క‌ళ‌: చిన్నా
కూర్పు: ప్ర‌దీప్ ఇ.రాఘ‌వ్‌
పోరాటాలు: వెంక‌ట్‌
విడుద‌ల తేదీ: 24.08.18

కొత్త క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటి కోసం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డి మంచి ప్రాడెక్ట్ ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌న్న కాంక్ష మంచిదే. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే సినిమాలు చేయ‌కుండా, ప్యాష‌న్‌తో సినిమాలు చేయ‌డ‌మూ మంచిదే. అలా మంచి పని చేస్తున్నారు ఆది పినిశెట్టి. ర‌విరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అయి పుష్క‌రం అవుతున్న సంద‌ర్భంగా మ‌ర‌లా హీరోగా ఆయ‌న న‌టించిన తెలుగు సినిమా `నీవెవ‌రో`. ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది అనేది తెలుసుకోవాలంటే చ‌దివేయండి.

క‌థ‌:
అంద‌రిలాగే ఆరోగ్యంతో పుట్టిన కల్యాణ్ ( ఆది పినిశెట్టి) త‌న 15వ ఏట క‌ళ్లు పోగొట్టుకుంటాడు ఓ ప్ర‌మాదంలో. పోయింది క‌ళ్లే గానీ, సెల్ప్ కాన్ఫిడెన్స్ కాద‌న్న‌ది అత‌ని అభిప్రాయం. ఎవ‌రైనా అత‌ని ప‌ట్ల సానుభూతి చూపిస్తే అత‌నికి న‌చ్చ‌దు. అలాంటిది వెన్నెల (తాప్సీ) అత‌నికి అనుకోకుండా ద‌గ్గ‌ర‌వుతుంది. అను (రితికా) ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అందులోనూ ఏదో ఒక సానుభూతి అత‌నికి క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో క‌ల్యాణ్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌నికి చూపు తిరిగి వ‌స్తుంది. వెన్నెల తండ్రి తిల‌క్ వ‌చ్చి క‌ల్యాణ్ క‌లుస్తాడు. ఓ సంద‌ర్భంలో తిల‌క్ ప్ర‌మాదానికి గుర‌వుతాడు. అత‌న్ని గుర్తుప‌ట్టిన క‌ల్యాణ్ అది హ‌త్య అని తెలుసుకుంటాడు. ఆ హ‌త్య తాలూకు కూపీ లాగుతుంటే అత‌నికి వెన్నెల నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుంది. ఇంత‌కీ వెన్నెల ఎవ‌రు? క‌ల్యాణ్ తెలుసుకున్న కొత్త నిజం ఏంటి?  వెన్నెల మెడ‌లో మూడు ముళ్లు వేశాడా?   లేకుంటే అనును పెళ్లి చేసుకున్నాడా అనేది ఆస‌క్తిక‌రం. 

ప్ల‌స్ పాయింట్స్
- న‌టీన‌టుల న‌ట‌న‌
- సంగీతం
- కెమెరా
- ఆర్ట్

మైన‌స్ పాయింట్లు
- క‌థ‌, క‌థ‌నం
- నెమ్మ‌దిగా సాగిన స్క్రీన్‌ప్లే
- సాగ‌దీత స‌న్నివేశాలు

Neevevaro

స‌మీక్ష‌
రీమేక్‌లు అన్నీ పండ‌వు. అన్నీ మెప్పించ‌వు. కానీ కొన్ని మాత్రం బావుంటాయి. అలా బావుంటుంద‌నుకుని కోన వెంక‌ట్ తెర‌కెక్కించిన సినిమా `నీవెవ‌రో`. త‌మిళంలో స‌క్సెస్ అయిన `అదే క‌న్‌గ‌ళ్‌` చిత్రానికి రీమేక్ ఇది. తెలుగు ఆడియ‌న్స్ టేస్ట్ కు త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేశారు. ఆది పినిశెట్టి చూపు లేకుండా, చూపు క‌లిగిన కుర్రాడిగా బాగా న‌టించాడు. తాప్సీ స‌హజంగా న‌టించింది. త‌న పాత్ర ప‌రిధిలో రితిక‌, స‌త్య కృష్ణ‌, తుల‌సి, శ్రీకాంత్ అయ్యంగార్‌, శివాజీరాజా, వెన్నెల కిశోర్‌, స‌ప్త‌గిరి.. అంద‌రూ మెప్పించారు. చాన్నాళ్ల త‌ర్వాత స‌ప్త‌గిరికి మంచి పాత్ర ప‌డ్డ‌ట్ట‌నిపించింది. న‌టీన‌టుల ప‌రంగా సినిమా ప‌క్కాగా బావుంది. కాక‌పోతే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే విష‌యంలోనే ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకోవాల్సింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు చాలా ఉన్న‌ట్ట‌నిపించాయి. ఎడిట‌ర్ కొన్ని వేల గంట‌లు రూమ్‌లో కూర్చుని సినిమాను ఈ షేప్‌కు తెచ్చార‌ని అంతా తెగ‌పొగిడారు. మ‌రికొన్ని గంట‌లు ఎడిటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే బావుండేది. ఆర్ట్, కాస్ట్యూమ్స్, కెమెరా వ‌ర్క్ బావుంది. ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాస్త అటూ, ఇటూ త‌డ‌బ‌డ్డ‌ట్టు అనిపిస్తుంది. రీరికార్డింగ్ అక్క‌డ‌క్క‌డా అస‌లు అత‌క‌లేదు. ఎమోష‌న్స్ కొన్ని చోట్ల స‌రిగా పండ‌లేదు. అక్క‌డ‌క్క‌డా లాజిక్ కూడా మిస్ అయిన‌ట్టు అనిపించింది. మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ కి మాత్రం క‌నెక్ట్ అయ్యే సినిమా.
రేటింగ్: 2/5
బాట‌మ్ లైన్‌:  న‌త్త న‌డ‌క‌న‌.. `నీవెవ‌రో`.

English Title
Neevevaro movie review
Related News