వారంలో గ్రూప్-డీ హాల్ టికెట్లు.. సెప్టెంబర్‌లో పరీక్ష! 

Updated By ManamSat, 08/25/2018 - 16:56
RRB Group D, admit card 2018, Exam date to release by next week, call letters by September
  • ప్రస్తుతం గ్రూపు-సీ పరీక్షల నిర్వహణ.. వచ్చేనెలలో గ్రూపు-డీ

  • కేరళలో వరదలతో గ్రూపు-సీ పరీక్ష రద్దు చేసిన రైల్వే బోర్డు..

  • సెప్టెంబర్‌ 4న గ్రూపు-సీ పరీక్ష.. ఆ తర్వాతే గ్రూపు-డీ పరీక్ష

RRB Group D admit card 2018: Exam date to release by next week, call letters by Septemberన్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆర్ఆర్‌బీ గ్రూపు-డీ పరీక్ష తేదీలు వారంలో వెలువడనున్నాయి. కొన్ని మీడియాల్లో కథనాల ప్రకారం.. రైల్వే రిక్ర్కూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఆగస్టు 30న గ్రూపు డీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్‌బీ గ్రూపు-డీ పరీక్షను వాయిదా వేసుకుంటు వచ్చిన రైల్వే బోర్డు సెప్టెంబర్‌లో పరీక్షలను నిర్వహించనుంది. ప్రస్తుతం గ్రూపు-సీ (ఎఎల్పీ, టెక్నిషియన్) 66,502 పోస్టులకు ఆర్ఆర్‌బీ ఫస్ట్ స్టేజ్ పరీక్షను నిర్వహిస్తోంది. గ్రూపు-డీ అడ్మిట్ కార్డులు విడుదల చేసిన వెంటనే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్ఆర్‌బీ గ్రూపు-సీ పరీక్షను నిర్వహిస్తుండగా కేరళల వరదల కారణంగా రైల్వే బోర్డు ఈ నెల 17న పరీక్షను మరోసారి రద్దు చేసింది. కేరళలో రద్దు చేసిన గ్రూపు-సీ పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించనుంది. ఈ పరీక్షకు కేరళ నుంచి 27వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నెల 9న రద్దు చేసిన పరీక్షకు హాజరుకావాల్సిన అభ్యర్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు రైల్వే బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. 

English Title
RRB Group D admit card 2018: Exam date to release by next week, call letters by September
Related News