నందమూరి హరికృష్ణ దుర్మరణం

Updated By ManamWed, 08/29/2018 - 08:19
nandamuri harikrishna dies
hari krishna

హైదరాబాద్‌ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆయనను హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలపాలై దాదాపు మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన హరికృష్ణ చివరకు కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు హుటాహుటిన అక్కడకు వెళ్లగా.. ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ కూడా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన మృతితో ఇటు కుటుంబసభ్యులు, అటు అభిమానులు తీవ్ర విషాదంలో మునగగా.. పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

HarikrishnaHarikrishnaHarikrishna

 

English Title
Nandamuri Harikrishna Dies In Accident at nalgonda district
Related News