అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!

Updated By ManamTue, 09/04/2018 - 01:40
boyfriend

ఇదేంటి.. విడ్డూరంగా ఉందనుకునేరు.. మీరు చదివినది అక్షరసత్యం. బట్టలు, నగలు, లగ్జరీ సెల్‌ఫోన్లు, సోఫాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అన్నీ అద్దెకు దొరుకుతున్న ఈరోజుల్లో బాయ్‌ఫ్రెండ్స్ కూడా రెంట్‌కు లభిస్తున్నారు. దీనికి ఓ లాజిక్ ఉందిమరి.

డిప్రెషన్‌కు విరుగుడట!!
boyfriendఅసలు బాయ్‌ఫ్రెండ్‌తో పనేంటి? అందునా అద్దెకు తెచ్చుకునేంత అత్యవసర పరిస్థితులేంటంటే.. వీరు స్ట్రెస్ బస్టర్లట. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మెంటల్ హెల్త్ అదుపుతప్పుతోందని, బాయ్‌ఫ్రెండ్ లేనివారు, లేదా డైవర్సీలు, లేదా బ్రేకప్ అయినవారు తమ గతంనుంచి బయటపడాలంటే బాయ్‌ఫ్రెండ్ అవసరమన్నది కొందరి వాదన. ముఖ్యంగా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ‘కంపానియన్‌షిప్’ సహకరిస్తుందని మానసిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు.  ఈ బిజినెస్‌ను నడిపితే కాసులవర్షం కురుస్తుందని భావించిన కొందరు యంగ్‌స్టర్స్ ముంబైలో ‘‘రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్’’ పేరుతో యాప్ సర్వీసులు ప్రారంభించేశారు.  వయసులో ఉన్న వారికి ఒంటరితనం పెద్ద సమస్య కనుక దానికి విరుగుడు తమ యాప్ అని వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రకాష్ వివరిస్తున్నారు.  

boyfriend

గంటకు..
ఇందులో రొమాంటిక్‌గా చెప్పుకునేందుకు ఏమీ ఉండదని, కేవలం గంటకు ఇంత చొప్పున వసూలు చేస్తున్నట్టు వీరు చెబుతున్నారు. తమది ఏమాత్రం డేటింగ్ సైట్ కాదని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్న వీరి యాప్ గత నెల్లో ప్రారంభం కాగా 1,500 మంది రిక్వెస్ట్ చేస్తూ యాప్‌కు క్లైంట్లుగా మారారు. అంతేకాదు వీరు సైకియాట్రిస్ట్‌లు, న్యూట్రిషనిస్టులు వంటి వైద్యుల బృందాన్ని కూడా నిర్వహిస్తూ తమ యాప్‌లో బాయ్‌ఫ్రెండ్ కోసం రిక్వెస్ట్ చేసేవారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

ఎన్ని కేటగెరీలో
ఇక బాయ్‌ఫ్రెండ్ అంటే? సెలబ్రిటీనా, మోడలా, ఆమ్ ఆద్మీనా, జస్ట్ ఉద్యోగా, ఏప్రాంతం వారు..ఇలా రకరకాల కేటగెరీలు కూడా వీరు అందుబాటులో ఉంచారు. అంతేకాదు వీరు గర్ల్ ఫ్రెండ్‌ను కూడా సమకూర్చుతారు. 2018 మిస్టర్ ఇండియా అయిన మోడల్ సూరజ్ దహియా ఈ యాప్ గురించి తెలియగానే ఆడిషన్స్‌కు హాజరై సెలెక్ట్ అయ్యారు కూడా. దీంతో ఇప్పుడు ఇతను ‘‘సర్టిఫైడ్ రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’’ అయ్యారు. ‘‘ఇది కూడా ఒక జాబ్, ఇందుకు జీతం ఇస్తారు కూడా..దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.. ఇదే తప్పుకాదు, ఒక వృత్తి అంతే’’ అన్నది సూరజ్ అభిప్రాయం.  ఇతన్ని బాయ్‌ఫ్రెండ్‌గా సెలెక్ట్ చేసుకుంటే గంటకు రెండువేల నుంచి మూడువేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ బాయ్‌ఫ్రెండ్ అయితే గంటకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి.  సెలబ్స్‌కు చెల్లించాల్సిన మొత్తం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇక మంచి ఫ్యామిలీ బ్యాంక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన, చదువుకున్న, ఉద్యోగమున్న వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలను గౌరవంగా చూసే వ్యక్తులనే తాము ఎంపిక చేసుకుని, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు ప్రకాష్ వివరించడం చూస్తుంటే ఆశ్చర్యమనిపించకమానదు.

Tags
English Title
Boyfriends to rent!
Related News