కూలిన ఫ్లై ఓవర్, శిథిలాల కింద పలువురు?

Updated By ManamTue, 09/04/2018 - 17:22
Flyover collapses in Kolkata's Majerhat, several feared trapped
Flyover collapses in Kolkata's Majerhat, several feared trapped

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ దక్షిణ కోల్‌కతాలోని మెజర్హాట్ ఏరియాలో ఓ ఫ్లై ఓవర్ మంగళవారం ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. మరోవైపు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా శిథిలాల కింద  కార్లు, బస్సులు, కార్లు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదం జరిగిన సమయంలో అనేక వాహనాలు ఫ్లై ఓవర్ పై ప్రయాణిస్తుండగా, మరోవైపు వంతెన కింద రైల్వే ట్రాక్ ఉంది. కాగా మెజర్హాట్ రైల్వే స్టేషన్ మీదుగా ఈ బ్రిడ్జి ఉంది. ఈ ప్రమాదం తర్వాత బడ్జ్ బడ్జ్-సీల్దా మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.ఈ దుర్ఘటన సాయంత్రం 4.45 గంటలకు జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే 5 గంటల వరకూ కూడా పోలీసులు అక్కడకు చేరుకోకపోవడంతో స్థానికులే... సహాయక చర్యలు చేపట్టారు. అయితే అయిదుగురు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నా...అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

కాగా 2016లో కూడా బుర్రా బజార్ కేవిడ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి సుమారు 26మంది మృతి చెందారు.

 

English Title
Flyover collapses in Kolkata Majerhat, several feared trapped
Related News