బాలీవుడ్ బయోపిక్‌లో అల్లు అర్జున్..?

Updated By ManamFri, 09/07/2018 - 11:25
Allu Arjun

Allu Arjunటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఆరంగేట్రం చేయబోతున్నాడా..? బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ బయోగ్రఫీలో బన్నీ కనిపించనున్నాడా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. 1983లో టీమిండియా ప్రపంచ కప్‌ను సాధించగా.. దాని ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 83 అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇక ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా.. కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రకు అల్లు అర్జున్ కోసం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 1983లో భారత్ వరల్డ్ కప్‌ సాధనలో శ్రీకాంత్ పాత్ర కూడా కీలకం. అందుకే ఈ పాత్రను ఒక స్టార్ హీరోతో చేయించాలని చిత్ర యూనిట్ అనుకుందట. బన్నీ చిత్రాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. అందునా అక్కడ ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో బన్నీ ఉంటే బావుంటుందని భావించిన టీం, శ్రీకాంత్ పాత్రకు ఎంచుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో నటించేందుకు బన్నీ కూడా ఆసక్తిని చూపుతున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకు పండగే.

English Title
Allu Arjun make debut in bollywood..?
Related News