జగ్గారెడ్డి అరెస్ట్.. ఉద్రిక్తత!

Updated By ManamFri, 09/07/2018 - 14:40
Jagga reddy, 100 party supporters, Prajala avedhana sabha, Police 
  • ప్రజల ఆవేదన సభకు అనుమతి నిరాకరణ

  • జగ్గారెడ్డి సహా వంద మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట

Jagga reddy, 100 party supporters, Prajala avedhana sabha, Police హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ విపక్షాలు కన్నెర్ర చేశాయి. ‘ప్రగతి నివేదన సభ’ తరహాలో ‘ప్రజల ఆవేదన సభ’ను నిర్వహించేందుకు సన్నద్దమయ్యాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సంగారెడ్డి గంజి మైదాన్‌లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రజల అవేదన సభ నిర్వహించ తలబెట్టారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో గంజి మైదాన్‌‌కు వెళ్లేందుకు జగ్గారెడ్డి యత్నంచిగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు, జగ్గారెడ్డి అనుచరులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు జగ్గారెడ్డితో పాటు వంద మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హస్నాబాద్‌లో కేసీఆర్ సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. తమ సభకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ మండిపడ్డారు. పోలీసులు ఇంకా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం దారుణమన్నారు. 

English Title
Jagga reddy along with 100 supporters arrested by police
Related News