వచ్చే 10 నుంచి దసరా ఉత్సవాలు

Updated By ManamFri, 09/07/2018 - 23:10
indra keeladri

imageవిజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అక్టోబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఒకే రోజు రెండు అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన వైదిక కమిటీ తెలిపింది. అక్టోబర్ 10వ తేదీ నుండి మొదలై 17వ తేదీ వరకు అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తారన్నారు. 18న ఉదయం శ్రీమహిషాసుర మర్ధినిగా, మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కమిటీ ఛైర్మన్ వై.గౌరంగబాబు తెలిపారు. అలాగే 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. దసరా మహోత్సవాల సందర్భంగా అక్టోబర్ 10 నుంచి 20వ తేదీ వరకు ఆలయంలో జరిగే ఆర్జిత సేవలను నిలిపి వేస్తున్నామని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ప్రత్యేక చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చన ఆర్జిత సేవలు యధాతధంగా జరుగుతాయని తెలిపారు.

English Title
Dussehra celebrations from 10th
Related News