దుర్గమ్మకు బంగారు రాళ్ల హారం 

Updated By ManamFri, 09/07/2018 - 23:26
golden stones

imageవిజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గకు ఓ భక్తురాలు బంగారు రాళ్ల హారాన్ని కానుకగా సమర్పించారు.  శ్రీ చలుమూరు వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీహెచ్.గోవిందమ్మ ద్వారా దివ్య భవాని, అవినాష్, ఆదిత్య శ్రీకాంత్ శివాని, వెంకటమహేష్, బాలశ్రీదేవి, గీతాంజలీ తదితరులు రూ.10 లక్షలు విలువైన 241 గ్రాముల బంగారు రాళ్ల హారాన్ని అమ్మవారికి కానుకగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ కు శుక్రవారం అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన వీరేష్ రెడ్డి అనే భక్తుడు రూ.88 వేలు విలువైన బంగారు వజ్రాల నత్తు (ముక్కు పుడుక)ను అమ్మవారికి కానుకగా ఆలయ ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్‌వో యస్.అచ్యుతరామయ్య, ఆలయ ప్రధాన అర్చకులు యల్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

English Title
denomination of golden stones
Related News