డ్రగ్స్ డోస్ ఎక్కువై ప్రముఖ సింగర్ మృతి

Updated By ManamSat, 09/08/2018 - 10:56
Mac Miller

Mac Millerప్రముఖ అమెరికన్ ర్యాప్‌ సింగర్‌ మ్యాక్‌ మిల్లర్‌(26) మృతి చెందాడు. లాస్‌ ఏంజెల్స్‌లోని తన నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించాడని వైద్యులు పేర్కొన్నారు. డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడంతో గుండెపోటు వచ్చిందని, దీని వలనే మ్యాక్‌ ప్రాణాలు విడిచాడని వైద్యులు వెల్లడించారు. 

అయితే గత కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న మిల్లర్‌ను వరుస సమస్యలు ఇబ్బంది పెట్టాయి. ప్రియురాలు అరియాన గ్రాండేతో బ్రేకప్‌.. హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్ట్‌ కావడంతో మ్యాక్‌ తీవ్ర డిప్రేషన్‌లోకి వెళ్లాడు. దీనికి తోడు జూన్‌లో తన ప్రియురాలు గ్రాండే అమెరికా కమెడియన్‌ పిటె డెవిడ్సన్‌తో నిశ్చితార్థం చేసుకోవడం మ్యాక్‌ తట్టుకోలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా 2012 నుంచి గ్రాండేను ప్రేమిస్తున్న మ్యాక్‌ 2017లో ఆమెతో విడిపోయాడు. వీరిద్దరు కలిసి ఎన్నో ఆల్బమ్స్‌ చేశారు. 

English Title
American singer Mac Miller dead from overdose
Related News