మానవ తప్పిదమే!

Updated By ManamMon, 09/10/2018 - 02:02
kerala

keralaఇటీవల కేరళను వణి కించిన తీవ్రమైన ప్రకృతి విపత్తు, కేరళ వరదల నుంచి దేశంలో ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆసక్తి క రమైన చర్చ రాజుకుంది. వరద లలో వందలాది మంది మర ణించారు. వేలాది మంది నిరా శ్రయులయ్యారు. 1924 తరు వాత కేరళలో యిటువంటి వర దలు తిరిగి పునరావృతం కాలే దు. ఆనాడు ఒకే ఒక్క ఆనకట్ట వుండేది. కేరళలో భారీవర్షపాతం వల్ల ఆ ఆనకట్ట తెగి సుమారు వెయ్యిమంది మరణించారు. అయితే ఈనాటి పరిస్ధితి భిన్నం. కేరళ ముఖ్యమంత్రే ప్రకటించినట్లు 1924తో యిప్పటి నేటి విపత్తును పోల్చలేము. ప్రస్తుతం కేరళలో 53 పెద్ద డ్యాంలు వున్నాయి. వాటి నుంచి వెలువడే నీరు వర్షపు నీటికి తోడై ప్రమాద తీవ్రతను పెంచేసింది. ఈ నేపథ్యంలో అసలు డ్యాంలు దేశంలో ఎన్ని వున్నాయి. వాటి నిర్వహణ, స్ధితిగతులపై లోతైన చర్చ అనివార్యంగా కేరళ వరదలు ముందుకు తెస్తున్నాయి.  ఈ సంవ త్సరం ముందుగా అంచనా వేసిన ప్రకారం సాధారణ వర్షపాతం కాకుండా తీవ్రమైన వర్షపాతం వలన డ్యాంలో నిర్ణీత నీటి నిలకు మించి నీరు చేరిపోయింది. రెండు మూడు రోజుల వ్యవధిలోనే ఇడుక్కి ఆనకట్టలో సాధారణ వర్షపాతానికి రెండు మూడింతలు వుండడం వలన నీటి యాజమాన్యానికి అవకాశం లేకుండా పోయింది. కేరళలోని ఎక్కువ డ్యాంలు పశ్చిమ కనుమలలో నెలకొని వుండటం గమనార్హం. ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ 2011 లో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల కోసం నివేదిక తయారు చేశారు. అందులో పశ్చిమ కనుమలలో మైనింగ్, డ్యాంల నిర్మాణం, నిర్వహణా నాణ్యతపై పలు ఆసక్తికర సూచనలు చేశారు. ఆ ప్రతిపా దనలను కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో అభివృద్ధి నిరోధక ప్రతిపాదన లుగా భావించి తోసిపుచ్చింది. కేరళలో చిత్తడి నేలలో చేపడుతున్న భా రీ నిర్మాణాల భారం నదులపైన పడుతుందని మాధవ్ గాడ్గిల్ అభిప్రాయ పడుతున్నారు. ఖనిజ వనర్ల మైనింగ్ కార్యకలాపాలు వల్ల పశ్చిమ కనుమలలో కొండచరియలు విరిగిపడి వరద ప్రవాహానికి అ డ్డుపడి ప్రమాదకర పరిస్ధితులకు దారితీశాయి. పర్యావరణ సంబం ధిత సున్నిత ప్రాంతాలైన ఇడుక్కి, త్రిసూర్‌లలో ఎక్కువ నష్టం వాటి ల్లింది. మరిముఖ్యంగా పరిసర కొండల నుంచి నీటిని సంగ్రహించే స్ధలాకృతిలో వరిపొలాలు వుండేవి. ఇప్పుడు రబ్బరు చెట్లు పండించే ప్రాంతాలుగా మార్చబడ్డాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సస్టెయినబుల్ ఎనర్జీ అధిపతి పేర్కొంటున్నట్లు వరిపొలాల పునరుద్ధరణ జరగాల్సి వుంది. 2016లో బిహార్, 2006 సూరత్ వంటి వరదలు, ఆనకట్టల నిర్వహ ణా లోపాలవల్ల నష్టాలకు గురయ్యాయి. ఆనకట్టల భద్రతా నిబంధ నల ఉల్లంఘన కీలకాంశంగా కాగ్ నివేదిక పేర్కొంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పు లు మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఈ మార్పులు ఒక ప్రాం తానికో, ఒక రాష్ట్రానికో పరిమితమైనవి కాదు. పశ్చిమ కను మలలో నెలకొనివున్న దుర్బలమైన పర్యావరణ వ్యవస్ధను గుర్తించవలసిన అవసరం ఎంతైనా వుంది. విపరీతంగా కొండలను తవ్వి ఖనిజాలను వెలికితీయడం వల్ల ఈ ఒక్క ప్రకృతి వైపరీత్యానికే పన్నెండుచోట్ల కొండ చెరియలు విరిగి పడ్డాయి. పశ్చిమ కనుమలు పదహారు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన కొండప్రాంతం. గాడ్గిల్ కమిటీ నివేదికలలో పేర్కొన్నట్లు అనేక పర్యావరణ సున్నిత మండలాలు వున్నాయి. (ఇయస్‌జడ్) ప్రాంతాల చుట్టూ వున్న కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, నిర్వహించడం ద్వారా రక్షిత ప్రాంతాలకు ‘షాక్ అబ్జార్చర్స్’ ఏర్పడతాయి. దుర్బలమైన పర్యా వరణ వ్యవస్ధను కాపాడటం కోసం ఈ ఇయస్‌జడ్‌లు ఉద్దేశింప బడినవి. అయితే మైనింగ్, కలుషిత పరిశ్రమలు, రైల్వేలైన్లతో సహా ఎత్తైన అభివృద్ధి  కార్యకలాపాలకు మండలాలలో కేంద్రప్రభుత్వం అనుమ తించదు. అంతేకాదు కొత్త ఆనకట్టలు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలను కూడా ఈ ప్రాంతాలలో ఏర్పర్చకూడదు. ఎప్పుడైతే ఈ ప్రాంతాలను ప్రత్యేకంగా రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీక రించలేదో ఈ సున్నిత ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ విధ్వంసం జరిగింది. మానవ జీవనానికే కాకుండా సమస్త జీవరాసుల మనుగడ పశ్చిమ కనుమలలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రశ్నార్ధకంగా మారింది. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం, పశ్చిమ కనుమలు దోపిడీకి గురికాబడుతూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళ ఎదుర్కొంటున్న ప్రకృతి విధ్వంసాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇదేవిధమైన విధ్వంసాన్ని గోవాలాంటి అనేక ప్రాంతాలలో నివారణా చర్యలకు తెరలేపవలసిన ఆవశ్యకత ఎంతైనా వున్నది. 2014-15 సంవత్సరాల్లో కేరళలో 5,924 గ్రానైట్ క్వారీలలో దాదాపు 40 శాతం పర్యావరణ సంబంధిత సున్నిత ప్రాంతాలలో వున్నట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాలలో క్వారీలకు అనుమతులివ్వడం ప్రకృతి వినాశనానికి పునాదులు వేయడంలో సమానం. 

జాతీయ విపత్తుల నిర్వహణా చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విపత్తులను నినారించ వల్సివుంది. కిందిట సంవత్సరం విపత్తులు నిర్వహణలో ఆయా రాష్ట్రాలు పెడుతున్న ఖర్చును బట్టి కేటాయింపులు వుంటాయి. 2015 నుంచి 2020 వరకూ విపత్తు నిర్వహణకు కేవలం రూ.919 కోట్లు మాత్రమే, కేటాయింపు జరిగింది. ఎక్కువ ఉపద్రవాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు, తక్కువ ఉపద్రవాలకు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు తగు మాత్రంలో కేటాయింపులు చేస్తారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.కృష్ణారావు పేర్కొంటున్నారు. ఎక్కువ కేటా యింపు చేసిన రాష్ట్రానికి ఆ ఏడు ఏ విపత్తు రాకపోతే కేటాయించిన నిధులను వెనుకకు తీసుకొని విపత్తును ఎదు ర్కొంటున్న రాష్ట్రాలకు ఆ కేటాయింపులు బదలాయించడం జరగాలి. అప్పుడే ఈ ఆర్ధిక కేటాయింపుల లక్ష్యం నెరవేరుతుంది. నష్టం వాటిల్లాక బావురుమనే కంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలను ముం దస్తు అంచనా వేస్తే ఎక్కువ శాతం ప్రాణ ఆస్తి నష్టాల్ని నివారించడానికి అవకాశం కలుగు తుంది. ఒక కేరళే కాదు దేశవ్యాప్తంగా చేపడు తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలలో పర్యావరణ పరిక్షణ బాధ్యతతో జరగాలి. జీవజాతుల మనుగడను ప్రమాదం లోకి నెట్టే స్వల్ప కాలిక ఆర్ధిక ప్రయోజనాలను పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణకు కృష్టి చేద్దాం.

Tags
English Title
Human error!
Related News