వావ్.. గ్రే హెయిర్..

Updated By ManamTue, 09/11/2018 - 00:03
life style

imageవామ్మో తెల్ల జుట్టు వచ్చి మేము గుండెలు బాదుకుంటూంటే.. ఇదేంటీ.. వావ్ గ్రే హెయిర్ అంటారు? అని ఆశ్చర్యంగా ఉందా? ‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’ మరి అందుకే ఇదంతా.  తెల్ల రంగు వేసుకోవడం నయా స్టైల్ అయినప్పుడు మీకు సహజంగానే తెలుపు రంగు జుట్టు ఉండడం స్టైల్ కాదా? అంతెందుకు ఇందిరా గాంధీ గ్రే హెయిర్ తలకట్టును గుర్తుకు తెచ్చుకోండి.. ఆమె ఎంత డిగ్నిఫైడ్‌గా, డీసెంట్‌గా కనిపించేవారో అర్థమవుతుంది.

లేటెస్ట్ ఫ్యాషన్
గ్రే హెయిర్ స్టైల్స్ పేరుతో సరికొత్త ట్రెండీ లుక్ ఇప్పుడు రాజ్యమేలడం లేటెస్ట్ ఫ్యాషన్‌గా మారింది.  కమాన్.. ఇది మీ జుట్టు.. మీ ఇష్టం వచ్చినట్టు మీరుండవచ్చు.. చూసేందుకు ఇలాగే ఉండాలి.. ఇలాగే కనిపించాలనే రాజ్యాంగం ఎక్కడా లేనప్పుడు తెచ్చిపెట్టుకున్న రంగుతో, మీ మనసుకు పూర్తిగా నచ్చని పనులెందుకు చేయాలి? అందుకే మీలాంటి ఆత్మవిశ్వాసం ఉన్నవారు ప్రారంభించిన ‘గ్రే హెయిర్ చాలెంజ్’ స్వీకరిస్తే ఇక మీకు టెన్షన్ ఫ్రీ. 
 

image


సెల్ఫ్ రెస్పెక్ట్ సింబల్
‘మీ టూ చాలెంజ్’లానే సిల్వర్ హెయిర్‌ను చూపించుకునేలా హెయిర్ స్టైల్ చేసుకోవడం ఇప్పుడు కొత్త చాలెంజ్‌గా మారింది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కు సింబల్‌గా మారింది.  అందుకే జెన్నిఫర్ లోపెజ్, ఏంజిలినా జోలీ వంటి స్టార్లు ఏమాత్రం జంకకుండా తమ తెల్ల జుట్టుతో ఎంచక్కా పోజులిచ్చేస్తున్నారు. బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ మిడిల్‌టన్ ఇలాగే గ్రే హెయిర్‌తో ప్రౌడ్‌గా కనిపిస్తారు. ఇక చిన్న వయసులోనే తెల్లవెంట్రుకల బారిన పడ్డ మహిళలు గర్భిణీగా ఉన్నప్పుడు హెయిర్ డైలు అస్సలు వేయరాదు. వేస్తే తల్లీ-బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ప్రమాదాలు తప్పవు. 
 
హుందాకు కేరాఫ్
imageహీరో అజిత్ సహజైమైన వెంట్రుకలతోనే నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. జగపతిబాబు వంటి తెలుగు నటులు కూడా ఈ ట్రెండ్‌ను సృష్టించారు. ధోని, మిలింద్ సోమన్ వంటివారు డైకు దూరంగా ఉంటూ .. ‘వాటే స్టైల్ ’ అనిపించుకుంటున్నారు.  వయసు మీద పడినా పడకపోయినా వచ్చే తెల్ల రంగు క్రెడిబిలిటీకి సింబల్‌గా మారింది. ఇలా రంగుకు దూరంగా ఉండేవారు నిజాయితీగా ఉంటారని సైకాలజీ చెబుతోంది. ఇక గ్రే హెయిర్‌లో బోలెడు రంగులున్నాయి. న్యూ సిల్వర్ గ్రే హెయిర్ ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కాస్మెటిక్‌గా వెస్ట్‌లో మారింది. వీటిలో కూడా ప్లాటినమ్ సిల్వర్, మెటాలిక్ గ్రే గ్లోరీ, గ్రాఫైట్ గ్రే, గ్రే పర్ల్ వంటి ఎన్నో వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. ‘2018 మోస్ట్ పాప్యులర్ కలర్ ట్రెండ్’గా నిలిచిన గ్రే కలర్ హెయిర్ వేసుకోవాలంటే మాత్రం చాలా ధైర్యం కావాలని హెయిర్ స్టైలిస్టులు చెబుతారు.  మధ్యవయసు వారందరికీ హుందాగా కనిపించే రంగుగా తెల్ల వెంట్రుకలనుimage భావిస్తారు. కానీ తెల్లవెంట్రుకలు కనిపిస్తే చాలు ఆంటీ, అంకుల్ అనేస్తారనే భయం మనల్ని వెంటాడుతుంది కనుక తక్షణం రంగు వేసుకోవడాన్ని ప్రారంభించడం రొటీన్‌గా మారింది. ఏజింగ్‌కు సింబల్‌గా భావిస్తే మాత్రం ఇది ఓ ఫోబియాగా మారి మిమ్మల్ని కాల్చుకు తినడం ఖాయం.  అందుకే మీ గుండె ధైర్యాన్ని ముందు పరీక్షించుకోండి.. ఆతరువాత గ్రే హెయిర్‌తో కనిపించేందుకు మానసికంగా సిద్ధమవ్వండి.. ఇక మిగతా జీవితం అంతా మీ శరీరంలో భాగమైన వె ంట్రుకల సహజత్వంతో మెరిసిపోండి.. ఎవరు ఏం కామెంట్ చేసినా పట్టించుకోకపోతే చాలు మీరు గ్రే హెయిర్ టె స్ట్‌లో పాస్ అయినట్టే. 
 
గ్రే ఈజ్ న్యూ బ్లాక్
ఈ సరికొత్త స్లోగన్ పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా ప్రభావం చూపుతుండగా మనదేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. పండు ముసలివారు సైతం తమ జుట్టుకు నల్ల రంగు వేసుకునే మనదేశంలో ప్రముఖులైన కొందరు తమ హెయిర్ స్టైల్‌ను అమాంతంగా మార్చు కుంటూ, దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ మార్చుకుంటూ తమ తెల్ల జుట్టును ప్రదర్శించడం మొదలయ్యాక అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న వారు ‘థాంక్ గాడ్’ అని ఊపిరి తీసుకుంటున్నరు. 30వ ఒడిలో పడీ పడగానే మన క్రికెటర్ మహేంద్ర సింఘ్ ధోనీకి తలంతా నెరిసిపోవడం చూసిన అభిమానులు షాక్ తిన్నారు. అయినా ధోనీ దీన్ని కూడా సరికొత్త స్టైల్‌గా మార్చేసుకుని తెల్ల గడ్డం, తెల్ల క్రాప్‌తోనే బ్యాట్ ఝుళిపించి అందరినీ ఆలోచింపచేస్తున్నారు.

 కొత్తల్లో ఇదంతా చూసినవారు ‘‘ఏంటి.. ధోనీ తన క్రాప్‌కు హెయిర్ డై వేసుకోరాదూ?’’ అంటూ సోషల్ మీడియాలో బాహాటంగానే సలహాలివ్వడం మొదలుపెట్టినా ఇవేవీ ధోనీ పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు హెయిర్ స్టైల్ మార్చుకుంటూ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. దీంతో ‘‘గ్రే ఈజ్ న్యూ బ్లాక్’’కు మనదేశంలో విస్తృతంగా ప్రచారం వచ్చినట్టైంది. మీరు మీలా మీకు నచ్చినట్టు, మీకు తోచినట్టు ఉంటే చాలు..ఇతరులు దాన్ని అభినందిస్తారా? విమర్శిస్తారా అన్నది అప్రస్తుతం అనుకుంటే మీ లైఫ్..మీ రేంజ్‌లో సాగుతుంది.

English Title
Wow .. Gray Hair ..
Related News