అమ్మ కాళ్లకు చక్రాలు

Updated By ManamTue, 09/11/2018 - 00:18
sushma

మన అమ్మలంతా కాళ్లకు చక్రాలు కట్టుకుంటే? ఈ ఊహకు స్పష్టత లేదనుకోవద్దు.. ‘మదర్ ఆన్ వీల్ ’ పేరుతో నలుగురు అమ్మలు మొదలుపెట్టిన సాహస యాత్ర ఇప్పుడు మనదేశంలో సంచలనం సృష్టిస్తోంది.  వీరంతా రొటీన్‌లో బిజీగా ఉండే ఉద్యోగులే అయినా సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలన్న తాపత్రయంతో ఖండాతరాల్లో ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలేసుకున్నారు. కొన్ని నెలలపాటు ఇందుకు అనుగుణంగా శారీరకంగా, మానసికంగా సిద్ధమై చాలెంజ్‌కు రూపకల్పన చేసుకున్నారు. ఎప్పుడూ ఇంటి పని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధుల్లో మునిగితేలే ఈ నలుగురు అమ్మలు దేశంలోని ఎంతో మంది అమ్మలను ఇప్పుడు ఆలోచింపచేస్తున్నారు.
 

image


22 దేశాల్లో..
సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే ఈ బృందం 22 దేశాల గుండా ప్రయాణించి చివరి మజిలీగా బ్రిటన్ చేరుకుంటుంది. 60 రోజులపాటు 20 వేల కిలోమీటర్లను ఏకబిగిన పూర్తి చేస్తూనే దారివెంబడి చిన్నారుల్లో సానుకూల దృక్పథాన్ని ఎలా అలవరచాలో వివరించనుంది. విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్రకు మంచి స్పందన మొదలవ్వడం విశేషం. మాధురి సహస్రబుధే, శీతల్ వైద్య, ఊర్మిళా జోష్, మాధవి సింగ్‌లు చేస్తున్న ఈ సాహస యాత్ర ఎలైట్ ఐ 20 కార్ ద్వారా సాగనుండడంతో వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని హ్యూండాయ్ సంస్థ అందించనుంది.
 

image

 

English Title
Wheels for mom's legs
Related News