మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగిందంటే

Updated By ManamTue, 09/11/2018 - 10:06
Priyanka Chopra, Nick Jonas

Priyanka Chopra, Nick Jonasగత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ఇటీవలే నిశ్చితార్ధం చేసుకొని తమ బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే అసలు వారు ఎలా పరిచయం అయ్యారు..? వారిద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు కలిగింది,  అనే విషయాలు పెద్దగా ఎవరికీ తెలీవు. వీటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నిక్ జోనస్.

ప్రియాంక, తను కామన్‌ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యామని.. ఫస్ట్‌ మెసేజ్‌లతో సాగిన తమ బంధం ఆ తరువాత ఫోన్ కాల్స్‌తో ప్రేమ వరకు వచ్చిందని తెలిపాడు. ఇక తాము పర్సనల్‌గా కలవడానికి ఆరు నెలల సమయం పట్టిందని, ఫస్ట్‌ టైమ్ తామిద్దరం మెట్ గాలా ఈవెంట్‌లో కలిశామని పేర్కొన్నాడు. మొదట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉండేవారిమని, కానీ తమ మధ్య ఏదో ఉందని తమ స్నేహితులు అనుకుండేవారని చెప్పుకొచ్చాడు. అయితే ఐదు నెలల క్రితమే తమ రిలేషన్‌షిప్ పట్ల తాము సీరియస్‌గా ఉన్నామని ఫీల్ అయ్యామని, ఆ తరువాత వెంటనే ఎంగేజ్ అయిపోయామని నిక్ చెప్పాడు. ఇక ఇద్దరికీ కలిపి ప్రిక్ అని పెట్టిన పేరు తనకు నచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చిత్రాలతో బిజీగా ఉంది. దీంతో వీరిద్దరు వివాహం చేసుకోవడానికి మరో రెండేళ్లు పడచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.

English Title
Nick Jonas told abot his love story with Priyanka Chopra




Related News