10 లక్షల మంది తరలింపు!

Updated By ManamTue, 09/11/2018 - 22:22
hurricane
  • ఫ్లోరెన్స్ హరికేన్ నేపథ్యంలో నిర్ణయం

  • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన

  • ఉభయ కరోలినాలు, వర్జీనియాలో హై అలర్ట్ 

hurricaneవాషింగ్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఫ్లోరెన్స్’ హరికేన్ బీభత్సం  సృష్టించే అవకాశాలు ఉండటంతో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అమెరికా నిర్ణయించింది. ఉత్తర, దక్షిణ కరోలియా, వర్జీనియా తీర ప్రాంతాల్లోని ప్రజలను తరలించేందుకు యంత్రాంగం  ముమ్మర ఏర్పాట్లు చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. బెర్మూడా దీవులకు 1100 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన టైఫూన్.. అమెరికా తీరాన్ని చేరే సరికి భీకర హరికేన్‌గా మారనుంది. ప్రస్తుతం గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా అమెరికా తూర్పుతీరంలో ఉన్న రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావంతో కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయి.అమెరికా తూర్పు తీరంలో ఫ్లోరెన్స్ విధ్వంసం 2-3 రోజుల పాటు కొనసాగవచ్చని నేషనల్ హరికేన్ సెంటర్(ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. ఉత్తర కరోలీనా, వర్జీనియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించే అవకాశముందని వెల్లడించింది.  ఉత్తర, దక్షిణ కరోలీనా రాష్ట్రాల మధ్య హరికేన్ గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం తీరం దాటే అవకాశం ఉంది.  ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో కొత్తగా ఐజాక్, హెలెన్ హరికేన్లు ఏర్పడినప్పటికీ, ఇవి అమెరికా తీరంవైపు రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపింది. ఫ్లోరెన్స్ హరికేన్‌ను ఎదుర్కొనేందుకు దక్షిణ కరోలినా, వర్జీనియా, ఉత్తర కరోలినా రాష్ట్రాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి. కాగా, గత కొన్నేళ్ల తర్వాత తూర్పు తీర ప్రాంతాలు భీకర తుఫాన్‌ను ఎదుర్కోనున్నాయి అని దేశాధ్యక్షుడు ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags
English Title
10 lakh people move!
Related News