పరుగుల గిరిముత్యం

Updated By ManamWed, 09/12/2018 - 00:28
mathanam

imageఇటీవల ఇండోనేసియాలోని జకర్తాలో జరిగిన ఆసియా క్రీడల మహిళల 400 మీ. రిలే ఈ వెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన సరితా గైక్వాడ్ భారతీయ రెండో గిరిపుత్రిక. ఇప్పటికీ మహిళల హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి తొలి గిరిజన ఆసియాడ్ అథ్లెట్‌గా స్వప్న బర్మన్ రికార్డు కెక్కినది విదితమే. కనీస సౌకర్యాలకు నోచుకోని ఓ గిరిజన కుగ్రామం నుంచి వచ్చిన నిరుపేద గిరిపుత్రిక సరిత అత్యున్నత వేదిైపెకి చేరుకోవడానికి కొండంత ఆత్మ విశ్వాసంతో అలుపెరుగని పోరాటమే చేసింది. ఈ యేటి ఆసియా క్రీడలలో స్వర్ణ ప తకం సాధించిన పరుగుల బంగారు కొండ సరితను ఆసియా గిరి జనముత్యం అనడం సముచితం.

సరితా గైక్వాడ్ జీవన నేపథ్యాన్ని పరిశీలి స్తే ఆమె గుజరాత్‌లోని ప్రకృతి అందాల విరబోత ఐనడంగ్ జిల్లా కరాడిimage అంబా అనే కొండ ప్రాంతంలో జన్మిం చింది. కేవలం 45 కుటుంబాలే నివసించే ఆ కొండ కోనల్లోని గిరిజనులది మౌళిక వసతుల లేమి తో కూడిన నిత్యజీవన పోరాటం. ఇంటర్నెట్ సంగతి అటుంచితే కరాడి అంబా గ్రామానికి బస్ సౌకర్యం సూదూరైమెనా సరైన రోడ్డు కూ డా లేదు. ఈ స్థితి నుంచి వెలుగులోకి వచ్చిన సరితతో ఫోన్‌లో మాట్లాడాలన్నా, ఆమె ఫోన్ చేయాలన్నా సెల్ సిగ్నల్ కోసం కొండెక్కాల్సిందే. నలుగురు పిల్లలను పెంచడమే భార మైన సరిత తల్లిదండ్రులు లక్ష్మణ్‌బాయ్, రేణూ గైక్వాడ్‌లు రెక్కాడితే డొక్కాడని వ్యవసాయ కూలీలు. అమ్మానాన్నలు నిరక్షరాస్యు లైన విపత్కర పరిస్థితుల్లోనూ క్రీడల గురించి ఆమె ఆలోచించడం యాదృచ్ఛికమే. ఆర్థికంగా ఆమె అనేక అడ్డంకులు ఎదుర్కొన్నా తల్లిదం డ్రుల ప్రోత్సాహమే ఈనాడు సరితను దేశానికి బంగారు కొండగా నిలిపిందన్నది నిస్సం దేహం.

సరితను ఆసియాడ్ పసిడి పతాక విజేతగా నిలిపిన ఆమె క్రీడా స్ఫూర్తి వెనుక గిరిజన నిజ జీవన పరిస్థితులే ముఖ్య కారణంగా కన్పిస్తాయి. గుజరాత్ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునే అందైమెన ప్రదేశం డంగ్, డంగ్ పరిసరాల్లోని కరాడి అంబా లాంటి కొండల మధ్య నివసించే గిరిజనులది నిత్య జీవన పోరాటం. వర్షాకాలం వస్తే వారికి బాహ్య ప్రపంచం అం టే తెలియదు. స్వగ్రామంలో నీటి కొరత వల్ల తాగునీటి కోసం సరిత చిన్నప్పటి నుంచే కొం డలు ఎక్కేది. పసి వయస్సులోనే కష్టాలను ఓర్చి నిలిచేది. ఇలా శారీరక, మానసిక దృఢత్వాన్ని పోగుచేసుకుంది. ఓసారి బంధువుల ఇంట్లో టీవీలో ఆటల పోటీలు చూసి క్రీడలపై మక్కువ పెంచుకున్నది. పాఠశాల స్థాయిలో ఖోఖో ఆడేది. డిగ్రీలో ఆమె టాలెంట్‌ను గు ర్తించిన కోచ్ అజిమోన్ అథ్లెటిక్స్ వైపు మళ్ళిం చాడు. రన్నింగ్‌పై మెలకువలు నేర్చుకున్నది. బూట్లు లేకుండానే పరుగు పం దెంలో పాల్గొన్నది. కాని తన ఆర్థి క పరిస్థితిని చూస్తే తినడానికి సరై న తిండి, బూట్లు కూడా కొనలేని స్థితిలో కళాశాల యాజమాన్యం సరితకు అండగా నిలిచింది.

2012లో సరిత స్పోర్ట్స్ అథారిటీ శిక్షణ కార్యక్రమానికి ఎంపిైకెంది. తదుపరి 2014లో పటియాలాలోని జాతీయ శిబిరంలో అవకాశం దక్కించుకుంది. గుజరాత్ ప్రాధికార సంస్థ ని ర్వహించిన 400 మీటర్ల పరుగు ట్రయల్స్‌లో 1ని. 1 సెకను టైమింగ్‌ను నమోదు చేసుకొని గుజరాత్ క్రీడల అకాడమీలో ఆమె ప్రగతి సా ధించింది. 2016లో జాతీయ అథ్లెటిక్స్ చాంపి యన్ షిప్‌లో రజతం సాధించింది. లఖ్‌నవ్‌లో జరిగిన ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్‌లో 400మీ.లో కాంస్యం, 400మీ. హార్డల్స్‌లో రజ తంతో మెరిసింది. జాతీయ స్థాయిలో సత్తా చాటిన సరితకు కావున్వెల్త్ క్రీడలలోఅవకాశం దక్కినా అపజయం పాలైంది. ఆ అపజయాన్ని విలుైవెన అనుభవంగా మార్చుకొని ఈ యేటి ఆసియా క్రీడలలో స్వర్ణ పతకంతో పునఃవైభవాన్ని తీసుకొచ్చింది. డంగ్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు తెచ్చుకున్న సరితా గైక్వాడ్ ఇదే ప్రతిభతో త్వ రలో టోక్యోలో జరుగబోయే ఒలింపిక్స్‌లో తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిద్దాం.

- గుమ్మడి లక్ష్మీనారాయణ
9491318409

English Title
Running star
Related News