పల్లెలకు డిజిటల్ వెలుగులెన్నడు?

Updated By ManamWed, 09/12/2018 - 00:14
mathanam

imageదేశానికి పల్లెసీమలే పట్టుకొమ్మలు. దేశ జనాభా లో సుమారు 70 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 90 శాతం గ్రామీణులకు డిజిటల్ అక్షరాస్యత లేదనే చెప్పవచ్చు. ప్రస్తుత జనాభాలో పట్టణాల్లో 30 కోట్లకు పైగా, గ్రామా ల్లో 15 కోట్ల మంది అంతర్జాల సేవలు వాడు తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్ష రత అభియాన్, ఇంటర్‌నెట్ వంటి కార్యక్రమా ల ద్వారా పల్లెలకు అంతర్జాల సేవలను విస్తరిం చే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఈ ప్రక్రి య మరింత వేగం పుంజుకోవాల్సి ఉంది. 

ఆధునిక అవసరాలకు అనుగుణంగా మహి ళా లోకం తమను తాము సాధికారికంగా తీర్చిది ద్దుకోవాలంటే వారికిimage డిజిటల్ అక్షరాస్యత తప్ప నిసరి అవసరం. నూతన సాంకేతిక విజ్ఞాన విస్త రణలో గ్రామీణ మహిళలకు ఆఖరివాటా దక్కు తోంది. కలవరం కలిగిస్తున్న సమస్య ఇది. ఇటీ వల జాతీయ నమూనా సర్వేలో వెల్లడించిన వి వరాలు పల్లెలు, పట్టణాల మధ్య విస్తరిస్తున్న డిజిట ల్ అసమానతలను బయటపెట్టాయి. అం తర్జాల సదుపాయం పట్టణాల్లో ప్రతి వెయ్యి ఇళ్ళకు 480, గ్రామాల్లో కేవలం 160 ఇళ్ళకు పరి మితమైనట్లు, గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. కంప్యూటర్ల వాడకం పట్టణాల్లో 29 శాతం, గ్రా మాల్లో కేవలం 6 శాతంగా ఉంది. 14-19 ఏళ్ళ మధ్య ప్రతి 1000 మంది గ్రామీణుల్లో కేవలం 180 మందికి, పట్టణాల్లో అయితే 485 మందికి కంప్యూటర్‌కు సంబంధించిన అవగాహన ఉం దని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రజలందరికీ అం దుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గాడి తప్పుతోంది. గ్రామీణ ప్రాంతా లు డిజిటల్ అక్ష్యరాస్యతకు బహుదూరంలో ఉ న్నాయి. పట్టణాలలో పోలిస్తే సమాచార సాంకేతి క వినియోగంలో పల్లెలు దారుణంగా వెనుకబడి ఉన్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఈ అంతరాలను తొలగించకపోతే ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ పధకాలను ప్రజలందరికి చేర్చడం కష్టమవుతోంది.

ప్రధాని మోదీ సారథ్యం లో డిజిటల్ ఇండియా కార్యక్రమాలు ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు సాగుతున్నాయని ప్రక టించిన సమాచార, ఐటీశాఖ మంత్రి విస్తరిస్తున్న డిజిటల్ అగాధంపై దృష్టి పెట్టకపోతే అనేక సమ స్యలు పోటెత్తే ప్రమాదాన్నీ గుర్తించాల్సి ఉంది. సమాచార, సాంకేతిక విజ్ఞానాన్ని ప్రజానికానికీ సమర్ధంగా చేరవేయడంలో కొంత లోటుపాట్లు ఉన్నాయని అంగీకరించిన మంత్రి ఈ సమస్య పరిష్కారానికి ఏం చేస్తామన్నది చెప్పలేదు. కేం ద్రం త్వరలో ప్రకటించనున్న నూతన జాతీయ టెలికాం విధానం డిజిటల్ అక్షరాస్యతను పెం పొందించి, అసమానతలను తగ్గించడానికి అక్క రకు రావాలి. వివిధ ప్రభుత్వ పథకాలకు ప్రధా న అడ్డంకి దళారీ వ్యవస్థే అని చెప్పవచ్చు. ఫలా లు లబ్ధిదారులకు చేరేలోగా దళారులు మధ్యలో నే వాటిని భోంచేస్తున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించడం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో దళారుల ప్ర మేయం లేకుండా సుమారు 90 వేల కోట్ల రూ పాయలు లబ్ధిదారులకు చేరవేసినట్లుగా ప్రభు త్వం చెప్పుకొంటోంది. ఈ క్రమంలో సేవల ల భ్యతకు సంబంధించి పట్టణాలు, పల్లెల మధ్య విస్తరిస్తున్న అసమానతల నిర్మూలనపైనా ప్రభు త్వం గట్టి దృష్టి సారించాలి. పట్టణ ప్రాంతాల్లో ఏటీఎం రిపేరుకు వస్తే 24 గంటలలోపే వాటి మరమ్మతుకు హడావుడి ప్రదర్శించే అధికార యంత్రాంగం గ్రామీణ ప్రాంతాలను మాత్రం చిన్న చూపుచూస్తోంది. అమెరికా, చైనా ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థలను యుద్ధప్రాతిపాదికన ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి. డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించి అస మానతలు రూపుమాపి, నూతన సాంకేతిక తను మూలమూలలకూ విస్తరింపజేసినప్పుడే దేశం పురోభివృద్ధిలో ముందడుగు వేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు! 

- శ్రీనివాస్ చిరిపోతుల

Tags
English Title
Digital light for villages
Related News