ధర్మ సూక్ష్మ మెరిగిన పాలకుడు...

Updated By ManamWed, 09/12/2018 - 00:32
mathanam

image‘ధర్మము ధర్మమటంచు వితండ వితర్కము లాడదేలా... ఆ మర్మము మీమెరుంగమే అణు మాత్రము సందియమేలా..’

యేందిర సత్తి... పద్యాలు పాడుతున్న వియ్యాల
యేంలేదన్నా... రామాంజనేయ యుద్దం అనే పౌరాణిక నాటకంల పద్యమిది. 
యేందిర అండ్ల అర్తం..బిత్తిరోడ..అయినా ఆ పద్యమెందుకురా ఇప్పుడు.?
నీకేం సోయుండదు.. చెప్తినన్న.

రాముడేమంటడంటే.. ‘ధర్మము ధర్మము అంటూ ధర్మమూర్తినయిన నాతోనే వితండ వా దాలు చేయడం సరికాదుimage ఆంజనేయా... ధర్మం యొక్క మర్మం దానిలోతు దాని తాత్పర్యం నాకు తెలువది అనుకోకు ..యేది యెప్పుడు చేయాల్నో యేది యెప్పుడు చేయకూడదో నాకు పూర్తిగా అవగాహనున్నది.. నీకు అనుమాత్రం గూడా అనుమానం అక్కరలేదు... నిశ్చింతగా వుండి నీను చెప్పినపనిచేయి..’ అంటూ ఆంజనేయునికి బుద్దులు చెప్తడు శ్రీరాముడు.

అవునురా... మరి ఇప్పుడెందుకురా ఆ ముచ్చెట... ఆ పద్యం.?
అదే అన్నా... ఇపుడు తెలంగాణలో కూడా ధర్మమేందో అధర్మమేందో తెలుసుకోలేని ఆంజనేయునివంటి ఆంధ్రా మేధావులు ఎక్కువయిన్రే.

అయిందానికి కానిదానికి రంధ్రాన్వేషణ చేసే కోతులు ఆడోటి ఈడోటి మోపయినయి. ఈ మేధావి కోతులు (ఆంజనేయునికి పర్యాయ పదం) తెలంగాణల చీమ చిటుక్కుమంటే... అధర్మరాగాలాపన మొదలు పెడుతున్నయి. పొం తన లేని పోలికలను ముందుకు తెచ్చి సగత దోపిడీ వలస పాలనకు నేటి తెలంగాణ ఆదర్శ వంతమైన పాలనకు లింకుపెట్టేందుకు ఆత్రపడు తున్నయి.
నీ కాల్మొక్తరా... సత్తీ... నాకు వొక్క ముక్క అర్థం కావట్లే... నీ ధర్మమేందో అధర్మమేందో.. ఆపద్ధర్మమేందో..
వూకో అన్న... యేం సదువుతవే పేపర్లు.. వుకెనే పైపైన సదువుడు కాదు... ఎడిట్ పేజీలు సదువవా.. లోపలగూడ సదువాలె. 

ఆపద్దర్మంలోనూ అధర్మ పాలనే అంటూ వో పత్రికలో వో సీనియర్ జర్నలిస్టు వ్యాసం పేరు తో తన అక్కసు కక్కిండు తెలంగాణ ముఖ్య మంత్రి మీద.. సూశినవా (మంగళవారం, సాక్షి ఎడిట్ పేజీలో ఏబీకే వ్యాసం..).
సూడలేరా సూస్త...యేమన్నర్రా అండ్ల..?
ముందుగాల సదువు... అయిటంక మాట్లా డుదాంగని
అవును కదరా... నెరీ గింత గోరంగ రాస్తార్రా... గా పెద్దమనిషి..
అవునన్నా.. యెట్లయిన మా చేతిల పెన్ను న్నదని యేది బడితె అది రాస్తే వుకుంటమా.. ప్రజాస్వామ్యంలో ప్రతివొక్కరికీ మాట్లాడే స్వేచ్చ వుంటది... భావస్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లు తెలంగాణల కుప్పిగంతలు వేస్తమంటే వూకునే పరిస్తితిలో తెలంగాణ సమాజం లేదు. తెలంగా ణను ఎప్పుడు ఎట్లా నడిపించాల్నో ఎప్పుడు ఎన్నికలకు పోవాల్నో.. ముఖ్యమంత్రి కేసీయార్ కు తెలుసు..యేది ధర్మమో ఆపద్దర్మమో, ధర్మం లోని మర్మమేందో... తెలంగాణ వ్యతిరేకులు ద్రోహులతో చెప్పించుకునే పరిస్తితిలో తెలంగాణ కానీ కేసీయార్ కానీ లేరనే సంగతిని ఈ ఆంధ్రా పక్షపాత అధర్మమేధావులు తెలుసుకోవాల్సిన అక్కెరున్నది.

అవున్రా సత్తీ... కరెక్టు చెప్పినవుర. కనీ ఆ యన వో సీనియర్ జర్నలిస్టు కార్ర..అట్లనొద్దు రా..
సీనియర్ యేంది గీనియరేంది.. యెవలయి నాకేంది..ఆయన యేం రాసిండో సదువినంక కూడా యెందుకు యెనుకేసుకొస్తున్నవ్ నీ అసొం టోల్లతోనే గింతకాడికొస్తాంది... సీనియరయితే ఇష్టం వున్నట్టు ఎట్ల రాస్తడు.? ఆయన యేం రా సిండో యెందుకు రాసిండో  తెలంగాణ మీద, కేసీయార్ మీద విషం గక్కిండనే సంగతిని ఆయ న గురించి తెలిసిన ప్రతి తెలంగాణ బిడ్డ అల్కగ పసిగడుతడు.

అవున్రా...సత్తీ.. ఎంత గలీజుగ రాసిండే మిరా...ఆపద్ధర్మంలోనూ అధర్మపాలనే నం ట... ఈనెకు అప్పటికే కనపడ్డ అధ ర్మమేందో ఆయన చేసే రంధ్రా న్వేషణ యేందో ... కలం చేతులున్నదిగద అని యేది పడితే అది రాస్తే వూకోరు జనం అనే సంగతి తెలు సుకో వాలెరా.. ఆ పెద్ద మనిషి.. గూడ జర ఆలోచించి రాయనుండె
అందికేనే అన్నా నీ ను అనేది...మంటికైనా ఇంటోడే కావాలె..అని. మం చయినా చెడయినా మాట్లాడు కోవడానికి తెలంగాణ హృదయం కా వాలె. 

ఆరి సత్తీ నిజమేనేమిరో....రానురాను మేధా వి ముసుగున ఆంద్రా పక్షపాతం జోరందు కుంటున్నదిరో... మనం వీటికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయకపోతే ఆగమాగం చేసే ప్రమాద మున్నదిరో..
నీను ఎప్పటినుంచో చెప్తాన మీరింటరా.. పోరా బిత్తిరోడా అని అదురగొడుతరు.. నన్ను.. ఈ నొక్కలేనా..? యెంతమంది యెన్నితీర్ల పొద్దు గాల లేసి టీవీల కాడ కూసోని వొర్లుతాన్రో తెలుస్తలేదా.? వొకాయినె అంటడు టీవీల కూసో ని.. ప్రభుత్వాన్ని రద్దు చేసినంకనట రాష్ర్టపతి పాలన చేయమని చెప్పేదుండెనట కేసీయార్ సారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగకుంట రాష్ర్టపతి పాలన పెట్టున్రి.. అని గవర్నర్‌కు చెప్పి వుంటె బాగుండునట...అట్ల చెప్పితే తెలంగాణల ప్రజాస్వామ్యం నిలవడేదట. 
యేందీ.. తెలంగాణల రాష్ర్టపతి పాలన వస్తె ప్రజాస్వామ్యం నిలవడుతదా... యెవల్రా అంతలావు మోతెవరి. ఆ మేధావి తలకాయ కనవడ్డదాచర్చల మాట్లాడుతున్నప్పుడు. లేకుంటె ఆయన మోకాల్లు చూయించిన్రా టీవీ చాన లోల్లు.

అవుపడ్డదే తలకాయే.. వున్నది వున్నది
మరి అట్లెట్ల మాట్లాడిండురా...యేం పేరో అంటివి ఆయనది
అదేందో పార్టీ .. జోక్ సత్తా అని వుండెగా ఎనుకటికి. అండ్లో రొండో లీడరుండె సూడు ఆయనపేరేందో వుండె.. పటారో పుటారో సుతా రో యేందో ఆయన పేరు యెవలికి యాదికున్న దిగని.. ఫుల్లు చేతులంగి పైకి మల్సుకుంటడు సూడు గాయిన.  యేందేందో మాట్లాడుతాండు అడ్డగోలుగ ఆంధ్రా చానలు చర్చల కూసోని..పొద్దుగాల పొద్దుగాల
ఎక్కడి కతరా సత్తీ వీల్లతోని.. యెవడెవడె వడో యేదిపడితె అది మాట్లాడుకుంట రాసు కుంట మోపయిన్రు హైద్రాబాద్ల..
ఆ మరి వుకెనే వొదిలిపెడుతరు అనుకున్న వా.. ఆల్లు మనల. ఎటుదిరిగి సందుకోసం సూస్తాన్రు. యెప్పుడు దొరుకుద్దిరా యెట్ల అందు కుందాని తెలంగాణను.. ఎట్లాగం చేద్దామని...గీ కేసీఆర్‌ను వొక్కన్ని వోడగొడితె సాలు.. ఇగ యెవలొచ్చినా హైద్రాబాద్ మన కంట్రోల్లనే వుం టది అనే ప్లానేత్తాండ్రు ఆంధ్రా నాయకులు ఛాన ల్లు కలిపి.

అవున్రా... సత్తీ.. వొక్కడన్న మాట్లాడుతా న్రార...టిడిపీ కాంగ్రేస్ పార్టీ పొత్తుల మీద. దు ర్మార్గపు పొత్తులమీద వాల్ల అనైతిక సిద్దాంతాల మీద వొక్కడంటే వొక్క ఆంధ్రా మేధావి రాజ కీయ నాయకులు మాట్లాడుతాం లేరు.. వీల్ల పె న్నుల్ల ఇంకులు వొడిసిపోయినాయిర..వాల్ల పత్తు లు ఇరిగిపోయినాయిర. అదే తెలంగాణ మీదన యితే కోడిగుడ్డు మీద ఈకెలుపీకుదానికి రడి అంటరు.
యే వూకోవె అన్నా...వొర్లి వొర్లి వాడుబాయె వొండుక తిని వీడు పాయె అన్నట్టు...మీరింట్లె కూసోని వొర్లుతనే వుంటరు ఆల్లు బజార్లకెక్కి తెలంగాణను బదునాం చేస్తనే వుంటరు.

మరి యేం జేయమంటవురా..
యేం చేసేదేంది అన్నా... ఇటువంటి కీలక సమయంలోనన్నా బయటపడాలెకదా మన మే ధావులు.. ఎక్కడికక్కడ రౌండుటేబుల్ సమా వే శాలు పెట్టి యీ ఆంధ్రా మేధావులు జర్నలి స్టు లు రాజకీయ నాయకుల కుట్రలను తిప్పికొట్టా లె గద. వీల్లు, రాతల ముసుగున చర్చల ముసు గున తెలంగాణ ప్రజలను గందరగోళ పరిచే కు యుక్తులకు కౌంటరియ్యాలె గద. మనోల్లందరి తోని రోజు పేపర్లు సదివిపిచ్చి ఆంధ్రా థాట్ పోలీసింగు రాతల దాడులను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలెగద. అన్నీ కేసీయార్ సారు మీద నే యేసి కూసంటమా.? తెలంగాణ ఉద్య మంల ఎట్ల కొట్టాడినం.. ఎవలిసక్కిన వా ల్లం. ఆయన చేత్తడు ఈనే చేత్తడు అని ఎదిరిచూసినమా..? తెలంగాణ రాంగనే అయి పోయిందా... దాన్ని నిలవెట్టుకోవద్దా.? నాలు గేండ్లు కాలే యేమిట్లెకేమయిందని...అప్పుడే యేం పంచకపోయిన్రని బెల్లపప్పలు..యిగలేదా ముందుముందు సైమం. మనం కాకపోతే యిం కెవడన్న వత్తాండా పోటీకి. అరువయేండ్ల సంది మంది యేసుకపోతే యేంలేదుగాని నాలుగేండ్లకే హైబతైబతి అయితున్నరు నాగ్గావాలె నాగ్గావాలె అని మన మేధావులు రాజకీయ నాయకులు.

ఆపురా నాయిన నీ పాటం చెప్పుడు... ఇప్పు డు ఎవలు కాదన్నర్రా నిన్ను. యెవలు చేత్తలేరు పని..వస్తరు వస్తరు ఆగు జర వోపిక పట్టు..
యే వూకో అన్న... వోపిక పట్టకుంటె యెట న్న వురుకుతున్నమా..వున్న ముచ్చెటే అంటాన. అదే ఆంధ్రోల్లయితే యెట్లుందురు వొక్కతాటి మీద. మనోల్లకేమొచ్చింది? అయినా.. ఈ మేధా వులతోని వూదుగాలదు పీరి లేవదు.. తెలంగాణ ప్రజలు కేసీయార్ సారు యెంటున్నరు... ఆల్లకు అన్నీ యెరుకేతీయ్.
మరింకేందిర....నువ్వన్నట్టు రేపు ఎన్నికల్ల బంపరు మెజారిటీతోని గెలిసి, యిప్పటోలిగనే కేసీయార్ సారు మల్లొక్క ఐదేండ్లు జర గట్టిగ అనుకోని తెలంగాణను నడిపిండనుకో..యిగ అ న్ని సదురుకుంటయి యెక్కడియక్కడ. అటు అభివృద్ధి పథకాలు ఇటు సంక్షేమ పథకాలు అన్నీగూడ గాడిలపడుతయి. ఇప్పుడిప్పుడే పూలు పూసి పిందలేస్తున్న వందల తీర్ల పథకాలు.. కా యలు కాసి ఫలాలుగ మారి తెలంగాణ జనా లకు అందుడు మొదలయితయి. 

ఇగ..సాగునీటి ప్రాజెక్టుల నీల్లతోని పల్లెలన్ని పచ్చబడుతయి. పల్లెజనాలకు చేతినిండ పని. ఇంతలకే విద్యా వైద్యం మస్తు బాగయితయి. వూల్లల్ల తాగునీరు రోడ్లు కరెంటు ట్రాన్స్ఫోర్టు అన్ని తీర్ల మౌలిక సదుపాయాలు అందుబాటుల కొస్తయి. మన పిలాన్లకు కొలువులు ఉపాధి హామీ దొరుకుద్ది. ఇంక సూర్రాదు యేమేమి చేత్తడో కేసీయార్ సారు..బ్రమ్మాండంగ బంగారి తెలంగాణను తీర్చి దిద్దుతడు..సూడు.
అవున్రా సత్తి... తెలంగాణకు మంచి చేయా లనేదే కేసీయార్ సారుకు లక్ష్యం తప్ప యింకోటి యేముంటదిరా.. మనం సూత్తలేమా ఇరువయేం డ్ల సంది.. యెంత కష్టం చేసిండో.
అన్నా వొక డౌటనుమానం నాకు..

యేందిర సత్తి..?
వొక్కపాలే వో పదేండ్లు ..ఎన్నికలు లేవు గిన్నికలు లేవు..సారుకే తెలంగాణను అప్పజెప్పే చట్టం లేదానె మనతాన.
లేదురా..ప్రతి ఐదేండ్లకోపాలి ఎన్నికలు జ రుపాల్సిందే.. ఎందుకురా అట్లంటివి.?
యేంలేదే...వో పని మీద పడిపోతున్నడు సారు. నడుమ నడుమ గియన్నీ డిస్టబెన్సు ఎందుకు.. టైం వేస్టు కదా.. అటు అభివృద్ది సూ స్కోవాల్నాయె.. ఇటు రాజకీయాలు చేయాల్నా యె..నడుమ నడుమ మనసొంటి మేధావుల లొల్లి..గియన్ని ఎందుకే పరేషాను.. సారు కావట్టి చేయగలుగుతాండు గని యింకోలింకోలింకో లయితే కండ్లు తేలేసి కాడెత్తేసి వురుకుదురు..ఈ పతిపకచ్చాలు ఆంధ్రా పచ్చాలతోటి యేగలేక..
అవున్రా సత్తీ..కేసీయార్ సారుకు ధర్మం యెరుకే రాజధర్మం యెరుకే...ధర్మంలోని మర్మం అందులోని సూక్ష్మం లోతు తాత్పర్యం అన్ని యె రుకే...నాడు భారతంల శ్రీకృష్ణుడు ఎట్లయితే ధర్మాన్ని గెలిపించడానికి కష్టాలుపడి కత నడిపిం డో సేమ్ టు సేమ్ అట్లనే తెలంగాణల ప్రభు త్వాన్ని రాజకీయాన్ని నడుపుకుంట వత్తాండు. శత్రువులకు తంతె గుద్దినట్టయితాంది. 

అవున్నన్నా...ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు యేందో అనుకున్న గానీ..అందుల ఇంత ధర్మ సూక్ష్మం దాగివుందని నీనుసుత అనుకోలేదే. ఇప్పుడర్తమైంది నాకు..తన నిర్ణయం తెలం గాణకు యెంతో మేలు చేస్తది నామాట వద్దమైతే సూడు నువ్వు రేపటినాడు.
అంతే నంటవార
అంతేనే..

- రమేశ్ హజారి
9390919090

English Title
cm kcr.. is the ruler
Related News