విదేశాలకు ఐపీఎల్?

Updated By ManamWed, 09/12/2018 - 00:36
ipl
  • వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలే కారణం

iplన్యూఢిల్లీ: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ప్రకటిస్తుందా అని రాజకీయ పార్టీలే కాదు బీసీసీఐ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మరోసారి ఐపీఎల్-12ను విదేశాలకు తరలించాలని బోర్డు భావిస్తోంది. గతంలో అంటే 2009లో సౌతాఫ్రికాకు, 2014లో యూఏఈకి ఇదే ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను తరలించారు. 2019 ఐపీఎల్‌కు బీసీసీఐ ఇప్పటి నుంచే సిద్ధపడుతోంది. కమిటీ ఆఫ్ అడ్మనిస్ట్రేటర్స్ (సీఓఏ), సీఈఓ రాహుల్ జొహ్రి నేతృత్వంలోని బీసీసీఐ మేనేజ్‌మెంట్, ఐపీఎల్ సీఓఓ హేమంగ్ అమిన్ ఇప్పటికే ఎ, బి, సి ప్లాన్స్ సిద్ధం చేశారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రకారం పూర్తి టోర్నీని తరలించాల్సి వస్తే సౌతాఫ్రికాకు తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. ఒకవేళ పాక్షకంగా అంటే టోర్నీలోని కొంత భాగం మాత్రమే మార్చాల్సి వస్తే యూఏఈ తెరపైకి రానుంది. ఇంగ్లాండ్ కూడా ఈ టోర్నీ నిర్వహణ బరిలో ఉంది. కానీ అది అధిక ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇంగ్లాండ్ అనేది చివరి ఆప్షన్. యూఏఈలో భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. ఖర్చు పరంగా కూడా అనుకూలమైన దేశం కావడంతో ఎమిరేట్స్ వైపై బీసీసీఐ, సీఓఏ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మొగ్గు చూపే అవకాశముంది. అయితే మౌలిక వసతుల రూపకల్పన విషయంలో ఐపీఎల్‌కు యూఓఏ చాలా చిన్నది. ఎందుకంటే ఈ దేశంలో మూడే మూడు పెద్ద మైదానాలు (దుబాయ్, షార్జా, అబుధాబీ) ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌లోని కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే యూఏఈ ఆతిథ్యం ఇవ్వగలదు. అంతేకాని 60 మ్యాచ్‌లు, ఎనిమిది జట్ల ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నీని తరలించాల్సి వస్తే సౌతాఫ్రికాకు తొలి ప్రాధా న్యత ఇవ్వనున్నారు. ఇదిలా వుండగా.. టోర్నీ నిర్వహణ బాధ్యతలు తమకే ఇవ్వాలని మూడు దేశాల (సౌతాఫ్రికా, ఎమిరేట్స్, ఇంగ్లాండ్) బోర్డులు వివర ణలు, ఆప్షన్స్ ఇచ్చాయి. 

Tags
English Title
IPL for overseas
Related News