రాణించిన మంధన

Updated By ManamWed, 09/12/2018 - 00:36
One Day indian Women's Team
  • లంకపై 9 వికెట్లతో భారత్ గెలుపు

  • ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్

womenగాలే: శ్రీలంకతో జరిగిన మొదటి వన్డేలో భారత మహిళల జట్టు 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఐసీసీ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మొదటి వన్డేలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక మహిళల జట్టు భారత మహిళ బౌలర్ల ధాటికి కేవలం 35.1 ఓవర్లలో 98 పరగులకే ఆలౌటైంది. లంక బ్యాటింగ్‌లో ఓపెనర్ జయన్‌గని (33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత్ బౌలింగ్‌లో జోషి 3 వికెట్లు తీయగా, గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత మహిళల జట్టు 19.5 ఓవర్లలో వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని సునాయసంగా చేధించారు. బ్యాటిం గ్‌కు దిగిన భారత ఓపెనర్లు రౌత్ (24), మంధన (73 నాటౌట్) పరుగులతో మొదటి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మిథాలీరాజ్(0 నాటౌట్)తో కలిసి ఓపెనర్ మంధన 19 ఓవర్‌లో 5 బంతిని బౌండరీకి తరలించి జట్టుకు విజయనందించింది. ఈ విజయంతో భారత్ జట్టుకు రెండు పాయింట్లు లభించాయి. 

English Title
Excellent supply
Related News