గెలుపే లక్ష్యంగా పని చేస్తాం

Updated By ManamWed, 09/12/2018 - 01:23
srinivas goud
  • మహబూబ్ నగర్  టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్  

imageహైదరాబాద్:  ముందస్తు ఎన్నికల వేళా అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి జోరుగా వలసల భాట పట్టారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్ ఆద్వర్యంలో మంత్రి కేటీఆర్, సమక్షంలో మంగళవారం సుమారు 200 మంది టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ ముదిరాజ్ సుమారు 200 నేతలు మందితో కలిసి హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ముదిరాజ్ సంఘం నేత, తెలంగాణ రాష్ట్ర బిసి మహాసభ అధ్యక్షులు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర సమన్వయ కర్త ఉపాధ్యక్షుడు మెట్టు కాడి శ్రీనివాస్ గులాభి తీర్ధం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ బిసి మహాసభ జిల్లా అధ్యక్షులు ఎం. ఆనందలింగం, విరశైవ సమాజం జిల్లా కార్యదర్శి సిద్ది రామప్ప, జిల్లా బిసి మహాసభ ప్రధాన కార్యదర్శి మెట్టుకాడి శ్యామ్ సుందర్ ముదిరాజ్, జిల్లా ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూల్ అధ్యక్షులు నిరంజన్, జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు వేణుగోపాల్‌లతో పాటు పలువురు నేతలు టీఆర్‌ఎస్ చేరారు. ఇక ఇదే విషయంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ...ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ చేస్తున్న చేస్తున్న అభివృద్దికి కర్శితులై టీఆర్‌ఎస్ పార్టీలో చెరుతున్నట్లు వారు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా తామంతా పనిచెస్తామన్నారు.

English Title
We aim to win
Related News