జాతీయ వివక్షకు చరమ గీతం

Updated By ManamWed, 09/12/2018 - 04:26
colin

Geography of national discriminationజాతీయగీతాలాపన జరుగుతోంది. ఆ సమయంలో గీతాలాపన పూర్తయ్యే వరకు అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడాలి. అయినా అతను కూర్చునే ఉన్నాడు. జాతీయగీతాన్ని గాయకులు ఆలపిస్తూనే ఉన్నారు..., అతను మాత్రం కూర్చునే ఉన్నాడు. అదొక ధిక్కారం. అతను దేశభక్తిని ధిక్కరించాడు... కాదు, కాదు ప్రశ్నించాడు..., మూడేళ్ళుగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. స్వేచ్ఛకు ప్రతీక అయిన అమెరికన్ గడ్డ మీద పుట్టిన  కొలిన్ కేపర్నిక్ కూడా జాతీయ జెండాకు వందనం చేస్తూనే, జాతీయ గీతాన్ని ఆలపిస్తూనే పెరిగాడు... అచ్చం మనందరిలాగానే! కానీ ఇవాళ అమెరికాలో జాతీయ గీతాలాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అతను మారుపేరయ్యాడు.  ఎవరిని కదిలించినా పుంఖానుపుంఖాలుగా ఉపన్యాసాలు దంచవచ్చు. అమెరికా జాతీయజెండా ముందు నిబద్ధతతో నిలబడి వందనాల్ని సమర్పించవచ్చు. అమెరికా జాతీయగీతాన్ని ఆలపించేటపుడు తప్పనిసరిగా నిలబడి తమ భక్తిప్రపత్తుల్ని చాటుకోవచ్చు.

మనదేశంలో కూడా ఇటీవల సినిమాహాళ్ళలో ఇలాంటి బలవంతపు దేశభక్తి ప్రదర్శనలు చాలానే జరిగాయి. అమెరికన్ చట్టాల ప్రకారం జాతీయ గీతాన్ని ఆలపించేట పుడు గౌరవసూచకంగా అందరూ లేచి నిలబడాలి... ఇది నియమం! కానీ నిత్యం అమెరికన్ రోడ్ల మీద అవమా నాలకు, హత్యలకు గురవుతూ, పోలీసుల వేధింపులకు బలవుతూ ఎందరో నల్లజాతీయులు నానా హింసల పాలవుతున్నారు. దేశపౌరుల్లో ఒక వర్గం మానవహక్కులకు దూరంగా జీవిస్తూ కూడా దేశభక్తి గీతాల్ని వినమ్రంగా ఆలపించాలనడం ఏ స్థాయి ప్రజాస్వామిక స్ఫూర్తికి నిదర్శనం? అతిపెద్ద ప్రజాస్వా మిక దేశంగా గుర్తింపు పొందిన మనదేశంలో కూడా బడుగులు, అభాగ్యుల హక్కుల కోసం గొంతెత్తితో చాలు ‘అర్బన్ నక్సల్స్’ అంటూ కేసులు బనాయి స్తున్న వైనాన్ని కూడా మనమిక్కడ గుర్తుకు తెచ్చు కోవాలి. ప్రజాస్వామ్యం అంటూ, స్వేచ్ఛ అంటూ పెద్దపెద్ద పదాలు వల్లె వేసే అమెరికా మనకు ఇలాంటి విషయాల్లో ‘సమీప బంధువు’ కావడం దురదృష్టకరం. అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకోవలసి వచ్చిందంటే, జాతీయ గీతాలాపన జరుగుతున్నపుడు కేపర్నిక్ లేచి నిలబడలేదు. అలా నిలబడక పోవడం ద్వారా ఆయన తన దేశంలో నల్లజాతీయుల మీద జరుగుతున్న హింసాకాండను, పోలీసుల దమననీతిని నిరసించారు. ఒక సెలబ్రిటీ క్రీడాకారునిగా గుర్తింపు పొందిన తరువాత కూడా తన ఆటేమిటో, తన యాడ్ రెవిన్యూ ఏమిటో తాను చూసుకుంటూ, హాయిగా భద్రజీవనాన్ని వెళ్ళదీసేంత తెలివితేటలు బహుశా ఈయనకు లేవేమో?!

‘నమ్మండి..., నమ్మిన దాని కోసం చివరికి మీరు అన్నింటినీ త్యాగం చేయాల్సి వచ్చినా సరే...దాన్నే నమ్మండి!’.. ఇది కేవంల  ఒక్క వాక్యమే ... ఈ ఒక్క వాక్యమే... తగలరాని చోట తగిలినట్టుగా ఇవాళ అమెరికా అధ్యక్షుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. దేశం యావత్తు రెండు వర్గాలుగా చీలి పోయింది. ‘అమెరికా పరువు తీశారంటూ’ ఒక వర్గం ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేస్తుంటే, మరో వర్గం ఈ వాక్యాన్ని సమర్థిస్తోంది. ఇంతకీ ఈ వాక్యం వెనుక దాగిన వివాదమేమిటో తెలుసుకుందామా?! 

 ఎవరీ కేపర్నిక్?
కొలిన్ కేపర్నిక్ అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆయన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ ఎఫ్‌ఎల్) టీమ్‌లో ‘క్వార్ట ర్‌బ్యాక్’గా ఫుట్‌బాల్‌ను ఆడేవాడు. అయితే అమెరికాలో నల్లజాతీయుల పట్ల జరుగుతున్న హింసాకాండకు, ఫుట్‌బాల్ క్రీడలో తమ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా కేపర్నిక్ 2016 నుంచి జాతీయగీతాలాపన సమయంలో లేచి నిలబడకుండా, మోకాళ్ళ మీద కూర్చుని తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ ‘నైక్’ ‘జస్ట్ డూ ఇట్’ టాగ్‌లైన్ పేరిట నిర్వ హిస్తున్న వాణిజ్యప్రకటనల పరంపరలో భాగంగా తన 30వ వార్షికోత్సవ సందర్భంగా ఒక విభిన్నమైన వాణిజ్య ప్రక టనను రూపొందించింది. ఇందులో కేపర్ని క్ ఫోటో మీద ‘‘నమ్మండి..., నమ్మిన దాని కోసం చివరికి మీరు అన్నిం టినీ త్యాగం చేయాల్సి వచ్చినా సరే... నమ్మండి!’ అనే వాక్యం రాసి ఉంటుంది. ఈ వాణిజ్య ప్రకటన ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో వివాదాస్పదంగా మారింది. నైక్ కంపెనీ కేపర్నిక్‌ను ఉపయోగించి, దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించిందంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అదే సమయంలో కేపర్నిక్ లక్ష్యం సమర్థించదగినదే అన్న మద్దతు కూడా భారీస్థాయిలో లభించింది. నిజానికి కేపర్నిక్ తన నిరసనోద్యమాన్ని మూడేళ్ళ కిందటే ప్రారంభించినప్పటికీ నైక్ వాణిజ్య ప్రకటనతో ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. 

కేపర్నిక్ శాన్‌ఫ్రాన్సిస్కో ‘ఫార్టీనైనర్స్’ బృందంలో క్వార్టర్‌బ్యాక్‌గా సుప్రసిద్ధుడు. ఆయన 12 సెప్టెంబరు 2016లో గేమ్‌ను ప్రారంభించే ముందు ఆనవాయితీగా జరిగే జాతీయగీతాలాపన సమయంలో మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఆఫ్రికన్-అమెరికన్‌ల మీద దేశంలో జరుగుతున్న పోలీసుల హత్యాకాండకు, నల్లజాతీయుల పట్ల ప్రదర్శిస్తు న్న వివక్షకు నిరసనగానే తాను అలా ప్రవర్తించానని ఆయన చెప్పారు. ‘ఈ పరిస్థితి మారాలి. ఎప్పుడైతే ఈ పరిస్థితిలో మార్పు చోటు చేసుకున్నదని భావిస్తానో అప్పుడే ఈ జెండా దాని ఉద్దేశాన్ని నెరవేర్చిందని నేను నమ్ముతాను. అప్పుడు నేను లేచి నిలబడ తాను’ అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. వర్ణవివక్షకు పూనుకుంటూ, నల్లజా తి వారిని అవమానించే దేశానికి సంబంధించిన జాతీయ జెండాను తాను గౌరవించలేనని కూడా ఆయన అన్నారు. కోపెర్నిక్ వాదనను తోటి క్రీడాకారులు కూడా సమర్థించారు. కేపర్నిక్ క్రీడాబృందానికి చెందిన ఎరిక్‌రీడ్, యాంటోనీ బెథియా, ఎలిహెరాల్డ్, రషార్డ్ రాబి న్‌సన్, తదితరులు కూడా ఆయనతో పాటే జాతీయగీతాలాపన జరుగుతున్న సమయంలో మోకాళ్ళ మీద కూర్చుని మద్దతును తెలిపారు. జాతీయగీతాలాపన జరుగుతున్న సమ యంలో ఎన్‌ఎల్‌ఎఫ్ క్రీడాకారులు ఇలా మోకాళ్ళ మీద కూర్చుని నిరసన తెలపడం 2016 నుంచి ఏటా జరుగుతూనే ఉంది. ఇది దేశాధ్యక్షుడు ట్రంప్‌కు కంటగింపుగా మారింది. 

అధ్యక్షుల వారి అసహనం
శ్వేతభవనంలో జరిగిన ఎన్‌ఎఫ్‌ఎల్ సీజన్‌కు సంబంధించి మాట్లాడుతూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్‌ఎఫ్‌ఎల్ యజమానులకు ఒక సూచన చేశారు. ఎవరైనా జాతీయ గీతాలాపన సమయంలో కూర్చుని కనిపిస్తే వెంటనే యజమానులు ‘ఆ సన్ ఆఫ్ బిచ్‌ను మైదానం నుంచి తరిమి కొట్టండి. వాడిని టీమ్ నుంచి తొలగించాం, తొలగించాం...’ అంటూ అరవాలని ట్రంప్ వారికి సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలు క్రీడాకారుల్ని మరిం తగా రెచ్చగొట్టాయి. ఎన్‌ఎల్‌ఎఫ్‌కు చెందిన 28 ఫుట్‌బాల్ క్రీడా బృందాలు ట్రంప్ వ్యాఖ్యల్ని నిరసించాయి. జాగర్స్ యజమాని షాద్‌ఖాన్ తోటి క్రీడాకారులతో చేయి కలిపాడు. అందరూ కలిసి మోకాళ్ళ మీద కూర్చుని ట్రంప్ వ్యాఖ్యల పట్ల తమ నిరసనను వ్యక్తం చేశారు. డల్లాస్ కౌబాయ్స్ టీమ్ కూడా ఇదే దారి పట్టింది. అటు క్రీడాకారులు కానీ, ఇటు ట్రంప్ కానీ ఎవరూ ఒక్కడుగు కూడా వెనక్కి తగ్గడం లేదు. క్రీడాకారులు తమ నిరసనను మోకాళ్ళ మీద కూర్చుని వ్యక్తం చేస్తుంటే, ట్రంప్ మహాశయుడు వాళ్ళని ఎద్దేవా చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ల యుద్ధం చేస్తూనే ఉన్నారు. కేపర్నిక్‌కు అంతకంతకూ మద్దతు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆయనకు ‘అంబాసిడర్ ఆఫ్ కన్‌సైన్స్’ అవార్డును బహూకరించింది. ఈ అవార్డుతో పాటుగా ‘జిక్యు’ పత్రిక 2017కు గాను కేపర్నిక్ ఎన్‌ఎల్‌ఎఫ్ నుంచి వైదొలిగారు. చేతిలో కాంట్రాక్టులు లేకుండా ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు ఇవాళ ‘నిరుద్యోగి’గా మిగిలారు. అయిన ప్పటికీ ఉద్యమమే ఇవాళ ఆయనకు సిసలైన ‘ఉద్యో గం’ అయింది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశ ప్రజలకైనా మానవహక్కులకు హామీ నిచ్చే స్వేచ్ఛ కావాలి. ఈ పోరాటాలన్నీ అందుకే!

Tags
English Title
Geography of national discrimination
Related News