వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి మరో కీలక నేత

Updated By ManamWed, 09/12/2018 - 08:56
Sunil

Sunil అమరావతి: వైసీపీ మరో షాక్ తగిలింది. కాకినేత కీలక నేత చెలమలశెట్టి సునీల్ వైసీపీని వీడనున్నారు. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న సునీల్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన సునీల్, టీడీపీలో చేరనున్నతెలిపారు. వచ్చే నెల రెండో వారంలో చంద్రబాబు సమక్షంలో సునీల్ టీడీపీ కండువాను కప్పుకోనున్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండగా.. టీడీపీలోకి వలసలు పెరుగుతున్న విషయం తెలిసిందే.

English Title
Chalamalasetty Sunil join in TDP
Related News