చంద్రబాబుగా రానా.. ఫస్ట్‌లుక్ రిలీజ్

Updated By ManamWed, 09/12/2018 - 14:49
Rana

Rana ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. ఇందులో రానా, ఏపీ సీఎం, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్నాడు. వినాయకచవితి సందర్భంగా అతడికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో అచ్చు చంద్రబాబును పోలి ఉండి, అందరినీ ఆకట్టుకుంటున్నాడు రానా. కాగా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్ నటించనుంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

English Title
Rana's look from NTR released
Related News