'జగ్గారెడ్డి చరిత్ర తెలుసు.. కేసీఆర్ సంగతేంటి?'

Updated By ManamWed, 09/12/2018 - 15:40
Jaggareddy, Nirmala reddy, KCR, Sangareddy former mla   
  • చంచలగూడ జైల్లో జగ్గారెడ్డిని కలిసిన భార్య నిర్మలారెడ్డి 

Jaggareddy, Nirmala reddy, KCR, Sangareddy former mla   సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని ఆయన భార్య నిర్మలారెడ్డి ఆరోపించారు. బుధవారం చంచలగూడ జైల్లో జగ్గారెడ్డిని ఆయన భార్య నిర్మలా రెడ్డి కలిశారు. చంచల్‌గూడ జైల్లో జగ్గారెడ్డితో ఆయన భార్య నిర్మలారెడ్డి ములాఖత్ ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగ్గారెడ్డి చరిత్ర అంటే అందరికి తెలుసునని, కేసీఆర్ చరిత్ర అంటే ఏంటో కూడా అందరికి తెలుసునని మండిపడ్డారు. జగ్గారెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారనేందుకు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నట్టు తెలిపారు. అధికార దాహంతో కేసీఆర్ చేస్తున్న పనుల్ని తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందని విమర్శించారు. కేసీఆర్, హరీశ్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిర్మలారెడ్డి ప్రశ్నించారు. 

కాగా, సంగారెడ్డి కాంగ్రెస్ మైనార్టీ సభకు పోలీసుల అనుమతి లభించింది. సాయంత్రం 6 గంటలకు మదీనా చౌక్‌లో కాంగ్రెస్ మైనార్టీ సభ జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ర్యాలీగా బయల్దేరనున్నారు. ఈ సభకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఇతర నేతలు హాజరుకానున్నారు. జగ్గారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో సంగారెడ్డి మైనార్టీ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. 

English Title
Jaggareddy wife Nirmala reddy slams KCR
Related News