'టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం..' 

Updated By ManamWed, 09/12/2018 - 18:08
TRS-KTR, option, people, KCR, TRS party, Uttam kumar reddy, Congress party, Chandrababu naidu 
  • తెలంగాణను అడ్డుకున్న శక్తులు ఒక్కటయ్యాయని విమర్శ

  • కొండగట్టు కారణంగా కేసీఆర్ రాలేకపోయారు... 

TRS-KTR, option, people, KCR, TRS party, Uttam kumar reddy, Congress party, Chandrababu naidu హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు విపక్షాలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ, బషిర్‌బాగ్‌లు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందని, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టే అవకాశం లభించిందన్నారు. 60ఏళ్లుగా రాబందుల్లా ప్రజలను పీక్కుతున్న వాళ్లు కావాలా.. రైతుబంధుగా నిలిచిన టీఆర్ఎస్‌ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన పార్టీలు ఒకవైపు.. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మరోవైపు ఉందని తెలిపారు. అపవిత్ర, నీచమైన పొత్తుతో ప్రజలకు ఓ మంచి అవకాశం లభించిందని చెప్పారు. తాగునీరు ఇవ్వకుండా చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయాని, ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని ముంచిన ఇద్దరు ఒక్కటవుతున్నారని విమర్శలు గుప్పించారు. కొండగట్టు ఘటన కారణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేకపోయారని చెప్పారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం పూర్తి చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీకి అడుగుదూరంలో నిలిచామన్నారు. కార్పొరేటర్ ఝాన్సీ రాకతో సెంచరీ కొట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.

English Title
TRS-KTR gives option to state people 




Related News