16న వీఆర్వో పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి.. 

Updated By ManamWed, 09/12/2018 - 20:42
VRO Exam, TSPSC secreatary Vani prasadh, VRO Hall tickets Download 

VRO Exam, TSPSC secreatary Vani prasadh, VRO Hall tickets Download హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 16న జరగనున్న వీఆర్వోల రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 700 వీఆర్వో పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆమె చెప్పారు. ఇప్పటివరకూ 7,73,000 మంది అభ్యర్థులు వీఆర్వో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. 16వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వాణీ ప్రసాద్ తెలిపారు.

పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు, పర్సులను పరీక్ష హాలులోకి అనుమతించమని తేల్చి చెప్పారు. పరీక్ష రోజున ఉదయం 10.45 గంటలలోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలన్నారు. వీఆర్వో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే జిల్లాల హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చునని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2945 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వాణీ ప్రసాద్ తెలిపారు. 

English Title
VRO Exam to be held on september 16, all arrangements done
Related News