suicide

నిన్న మహిళ... ఇవాళ మరో వ్యక్తి

Updated By ManamThu, 11/08/2018 - 12:34
  • మెట్రో స్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide by jumping from Hyderabad metro stationహైదరాబాద్ : నగరంలో వరుసగా మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. నిన్న ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఇవాళ మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా అంటూ మెట్రో పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలితం లేకపోతోంది. వేర్వేరు మెట్రో స్టేషన్ల వద్ద ఆత్మహత్యలకు పాల్పడటంతో వారంలో ఇది రెండో సంఘటన.

వివరాల్లోకి వెళితే...గురువారం ... అమీర్ పేట మైత్రివనం మెట్రోస్టేషన్‌ మొదటి అంతస్తు పైనుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి కిందకు దూకాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఓ మహిళ  కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్‌ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను హుటాహుటీన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కాగా వరుస సంఘటనలతో మెట్రో అధికారులు అప్రమత్తం అయ్యారు. భద్రతను మరింతగా పెంచారు. 
 13వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్

Updated By ManamSat, 10/27/2018 - 16:35
suicide

ముంబై : ఓ పదహారేళ్ల బాలిక బహుళ అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సెంట్రల్ ముంబయిలోని టర్డో ప్రాంతంలో శనివారం ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. 13 అంతస్తుల భవనం పై నుంచి దూకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. మృతురాలు ఇంపీరియర్ టవర్స్‌లో నివాసం ఉంటున్న ప్రియాంక కొఠారీగా గుర్తించారు. కాగా ప్రియాంక భవనంపై నుంచి దూకుతున్న విషయాన్ని గమనించిన పలువురు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే అప్పటికే ఆమె పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రియాంకను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ప్రియాంక తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి

Updated By ManamThu, 09/20/2018 - 18:44
suicide

హైదరాబాద్ : భార్యను ఆమె తల్లిదండ్రులు తీసుకు వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన  ఓ యువకుడు  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురంకు చెందిన శ్రీకాంత్ మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అతడి భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకు వెళ్లిపోవడంతో అతడు గతరాత్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి యువతీ, యువకులు తమ వాళ్ల చేతులో మృతి చెందుతున్నారు. మొన్న మిర్యాలగూడ ఉదంతం ...నిన్న ఎర్రగడ్డ ఉన్మాద ఘటనల్లో చిందిన రక్తం తడి ఆరకముందే ప్రేమకు చిహ్నమైన భాగ్యనగరంలో మరో ప్రేమ వివాహం విషాదంతంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆమె పుట్టింటి వాళ్లు తీసుకెళ్లడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టి వేధిస్తుండడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పాతబస్తీలో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు మృతి చెందిన యువకుడు తన ఆవేదను సోషల్ మీడియాతో పంచుకున్న దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్నాయి. అత్యంత హృదయవిదారకరమైన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పాతబస్తీలోని సంతోష్‌న గర్‌కు చెందిన శ్రీకాంత్, శ్రీహర్ష గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు అంగీకరించరన్న భయంతో వీరు 2015 సంవత్సరంలో ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు అంగీకరించడంతో పాటు కొడుకు, కోడలును తమతో పాటే ఉంచుకుంటున్నారు. దీంతో ఇద్దరూ యథావిధిగా తమ చదువును కొనసాగిస్తూ వచ్చారు. అయితే గత సంవత్సరం శ్రీహర్ష గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమె పుట్టింటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి శ్రీహర్ష తల్లిదండ్రులు ఆమెతో మాట్లడనివ్వకపోవడంతో పాటు శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళనలకు గురైన శ్రీకాంత్ బుధవారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మయత్నాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసత్ప్రికి తరలించినప్పటికి తీవ్ర గాయాలతో పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం అనంతరం శ్రీకాంత్ కుటుంబ సభ్యులు శ్రీహర్ష ఇంటి వద్ద ఆందోళన చేయాలని ప్రయత్నించగా పోలీసులు అడ్డుకు న్నారు. తమ కుమారుని మృతికి శ్రీహర్ష తల్లిదండ్రులే కారణమని వారిని కఠినంగా శిక్షించాలని తమ కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమపై నకిరేకల్‌లో 17 పోలీస్ కేసులు పెట్టారని పేర్కొన్నారు.రిజర్వేషన్ల కోసం 17ఏళ్ల బాలిక ప్రాణత్యాగం.. 

Updated By ManamTue, 09/11/2018 - 15:36
  • మరాఠి రిజర్వేషన్ల కోసం ఇంటర్ విద్యార్థిని ప్రాణత్యాగం..

  • హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణం.. సూసైడ్ నోట్‌ లభ్యం.. 

Class 11 girl, suicide, reservation, Maratha communityముంబై: మరాఠా రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ 17ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అహ్మద్ నగర్ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. రాధాభాయ్ కాలే ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న కిషోరి బాబన్ కకడే హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు ఎస్పీ రంజన్ కుమార్ శర్మ తెలిపారు. ఘటనా స్థలంలో కిషోరి పక్కన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరాఠా కమ్యూనిటీల రిజర్వేషన్ల కోసం త్యాగం చేసుకుంటున్నట్టుగా సూసైడ్ నోట్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలో 89 శాతం మార్కులతో పాసైయ్యానని, కానీ, సైన్స్‌ విభాగంలో సీటు రాలేదని నోట్‌లో పేర్కొన్నట్టు ఎస్పీ శర్మ తెలిపారు. బాలిక కిషోరి తండ్రి పేదరైతు. కుమార్తె కాలేజీ అడ్మిషన్ కోసం నాన్ డివిజన్ కింద రూ.8వేలు చెల్లించాడు. తనకంటే 76 శాతం తక్కువ మార్కులు సాధించిన బాలికలకు రూ.1000తో రిజర్వడ్ కేటగిరీ కింద అడ్మిషన్ ఇచ్చారని వాపోయింది. మరాఠి కావడం కారణంగా తాను వివక్షకు గురైనట్టు కిషోరి ఆరోపించింది. తన ప్రాణత్యాగంతోనైనా మరాఠి కమ్యూనిటీలకు రిజర్వేషన్ల ఉద్యమానికి చేయూతనిస్తుందని ఆశిస్తున్నట్టు నోట్‌లో పేర్కొంది.  పిల్లలు పుట్టలేదని దంపతులు ఆత్మహత్య

Updated By ManamFri, 08/31/2018 - 19:09

Couples, suicide, no children, Jaggayapet జగ్గయ్యపేట: పిల్లలు పుట్టడం లేదన్న తీవ్ర మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎస్‌బీఐ బ్యాంకు వెనుక వీధిలో కత్తోజు‌ ప్రసాద్‌ (41), లక్ష్మీ సరస్వతి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీఎస్‌పీ జగ్గయ్యపేట లైమ్‌ మైన్స్‌లో‌ ప్రసాద్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

అయితే వివాహమై ఏళ్లు గడుస్తున్నా ఇంకా తమకు సంతానం కలగడం లేదన్న మనస్తాపం వారిలో రోజురోజుకీ పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రసాద్‌ భార్య లక్ష్మి సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుంది. భార్య మృతిచెందడాన్ని చూసిన భర్త.. అదే తాడుకు ఉరివేసుకుని తాను చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జగ్గయ్యపేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంపీపైనే గ్యాంగ్ రేప్‌..ఆత్మ‌హత్య‌

Updated By ManamMon, 08/13/2018 - 20:07

Dutch politician commits suicide after revealing she was ‘gang raped by Muslims’
నెదర్లాండ్స్: త‌న‌పై కొంద‌రు దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారంటూ నెద‌ర్లాండ్స్‌కు చెందిన ఓ మ‌హిళా ఎంపీ మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ మేర‌కు ఆమె ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు. కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను మాట్లాడ‌కుండా చేయ‌డానికే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని అందులో ఆరోపించారు. రైట్‌వింగ్ ఫ్రీడం పార్టీకి చెందిన ఈమె.. త‌న‌పై ఏడాది క్రితం కొంద‌రు ముస్లింలు త‌న‌పై అత్యాచారం చేశార‌ని, దీనికి కార‌ణం అర్న‌డ్ వాన్ డూర్న్ కార‌ణ‌మ‌ని ఆ వీడియోలో ఆరోపించారు. 

Dutch politician commits suicide after revealing she was ‘gang raped by Muslims’

గ‌త ఏడాది మార్చి 15వ తేదీన కొంద‌రు దుండ‌గులు త‌న‌ను కిడ్నాప్ చేసి వేధించడంతోపాటు రేప్ చేశార‌ని పేర్కొన్నారు. హేగ్ సిటీ కౌన్సిల్‌లో త‌న‌ను మాట్లాడ‌కుండా చేసేయ‌డ‌మే వారి ఉద్దేశ‌మ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న కార‌ణంగా ఆమె తీవ్ర వేద‌న‌తో ఉన్న‌ట్లు క‌నిపించారు. చివ‌రగా ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు.  స‌ద‌రు ఎంపీ త‌న‌పై జ‌రిగిన లైంగిక దాడికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు చేయ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి ఆధారాలున్నాత‌మ‌కు అంద‌జేయాల‌ని కోరినా ఆమె స్పందించ‌లేద‌న్నారు.

 వాట్సప్‌లో ‘మోమో’ చాలెంజ్

Updated By ManamTue, 08/07/2018 - 16:17
  • మరో బ్లూవేల్ చాలెంజ్

  • వాట్సప్‌లో వస్తున్న మోమో చాలెంజ్

  • తల్లిదండ్రులూ.. అప్రమత్తం

  • శిల్పం బొమ్మతో చాలెంజ్

  • జాగ్రత్తగా ఉండాలి: నిపుణులు

After Blue Whale Challenge, is Momo Challenge

లండన్ : నిన్న మొన్నటి వరకు హల్‌చల్ చేసిన బ్లూవేల్ చాలెంజ్ లాగే ఇప్పుడు మరో కొత్త చాలెంజ్ టీ నేజర్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ఈ సరికొత్త మోమో చాలెంజ్ వాట్సాప్ ద్వారా వ్యాపిస్తోంది. వాట్సాప్‌లో ముందుగా ఓ శిల్పం బొమ్మ వస్తుందని, అందులో పలు చాలెంజిలు వస్తాయని చెబుతున్నారు. క్రమంగా అవి అందుకున్నవారి జీవితాలు ప్రమాదంలో పడతాయి. అచ్చం బ్లూవేల్ చాలెంజ్‌లాగే చాలా తీవ్రమైన ప్రవర్తన రూపంలో ఈ చాలెంజలు వస్తాయి.

ఏంటీ మోమో..?
వాట్సాప్‌లో ఓ శిల్పం బొమ్మ వస్తుంది. దాన్ని జపాన్‌కు చెందిన కళాకారుడు మిదొరి హయాషి తయారు చేశాడని అంటున్నారు. అయితే ఆ శిల్పానికి గానీ, ఈ కళాకారుడికి గానీ గేమ్‌తో సంబంధం లేదు. టోక్యోలోని వెనీలా గ్యాలరీలో ఉన్న ‘మదర్ బర్డ్’ శిల్పం ఫొటోనే ఇలా బయటకు వస్తోంది. దాంతోపాటు కొన్ని భయంకరమైన కళారూపాలు కూడా వస్తాయి. అర్జెంటీనాలో 12 ఏళ్ల అమ్మాయి ఈ చాలెంజ్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు బ్యూనస్ ఏర్స్ టైమ్స్ తెలిపింది. దాంతో ఆమెకు ఈ మెసేజిలు పంపింది ఎవరో తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్పెయిన్ పోలీసులు కూడా మోమో చాలెంజితో జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.

నిజమేనా.. ఉత్తదా?
వాస్తవానికి మోమో చాలెంజ్ అనేదాన్ని కొంతమంది సైబర్ నేరస్తులు వాడతారని, యూజర్ల సమాచారాన్ని దీనిసాయంతో వాళ్లు తస్కరిస్తారని నిపుణులు అంటున్నారు. ఈ గేమ్ ఇప్పటికి ఎంతవరకు వ్యాపించిందో తెలియదు గానీ, యువతలో మాత్రం ఆత్మహత్యకు ప్రేరేపించేలాగే ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి పనికిమాలిన చాలెంజిల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యువతతో పాటు తల్లిదండ్రులను కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఉచ్చులో పడొద్దని చెబుతున్నారు. ప్రొఫెసర్ వేధింపులు, లేడీ డాక్టర్ ఆత్మహత్య

Updated By ManamTue, 08/07/2018 - 12:50

lady doctor commits suicide after alleged harassment

చిత్తూరు : చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక జూనియర్ డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడింది.  తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలోని పీడీయాట్రిక్‌ డిపార్టుమెంటులో పీజీ చేస్తున్న ఆమె... పరీక్షల్లో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన శిల్ప తాను నివాసం ఉంటున్న జాగృతి అపార్టుమెంటులో మంగళవారం  బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా గత కొంతకాలంగా ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ శిల్ప...రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని, అంతేకాకుండా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారనే కోపంతోనే ప్రొఫెసర్లు కక్షకట్టి శిల్పను పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కానిస్టేబుల్ వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Updated By ManamWed, 08/01/2018 - 15:10

suicide రంగారెడ్డి: జిల్లాలోని గండిపేట మండలం కిస్మత్ పూర్‌లో ఘోరం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులు తాళలేక నవనీత అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కిస్మత్ పూర్‌లో బాబుదాస్, నవనీత అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా నవనీతను కానిస్టేబుల్ పిరోజ్ ఖాన్ వేధిస్తున్నాడు. పోలీస్ విభాగానికి చెందిన వ్యక్తే తనను వేధించడంతో ఆమె ఏమీ చేయలేకపోయింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది నవనీత. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.ఆత్మ‌హ‌త్య కూడా అంటువ్యాధే!

Updated By ManamTue, 07/31/2018 - 11:44

suicideటొరంటో: ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు సున్నిత మనస్కుల‌పై తీవ్ర ప్రభావం చూపటంతో పాటు, వారిని కూడా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పురిగొల్పుతాయని ఓ అధ్యయనంలో తేలింది. కెనడాలోని టొరంటోలో 2011- 14 సంవ‌త్స‌రాల మధ్య ఆత్మహత్యలపై ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన దాదాపు 17వేల వార్తలను యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

 ఆ వార్తల ప్రచురణ అనంతరం జరిగిన ఆత్మహత్యలపై వాటి ప్రభావం ఉందా అనే అంశాన్ని పరిశీలించారు. ఇందులో ఆ నాలుగేళ్లలో జరిగిన 947 ఆత్మహత్యలపై 6,367 వార్తల ప్రభావం ఉన్నట్లు తేలింది. ‘సున్నిత మనస్కులు అలాంటి వార్త‌ల‌ను చదవగానే వాటి ఆలోచనలు అంటువ్యాధిలా సోకి ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. 

ఇక సెలబ్రిటీ ఆత్మహత్యలు పాఠకులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు గుర్తించిన‌ట్లు అధ్యయనంలో పాల్గొన్న మానసిక నిపుణుడు మార్క్‌ పేర్కొన్నారు. ఈ ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు ఇలాంటి వార్తలకు పాత్రికేయులు, మీడియా సంస్థలు జీవితంపై ఆశ కల్పించే సందేశాల్ని కూడా జత చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.

తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయి ఉన్నవారు పాజిటివ్ అంశాల‌ను చదివి ఉపశమనం పొందటం వల్ల ఆత్మహత్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.  అయితే, హత్యలకు సంబంధించిన‌ వార్తలు చదివినపుడు మాత్రం వీటికి పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చాయని ఆయ‌న‌ చెప్పారు. ఈ వివరాలు ఇటీవ‌ల కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Related News