Kishan Reddy

మేనిఫెస్టోపై విపక్షాల విసుర్లు

Updated By ManamThu, 10/18/2018 - 01:32

dk arunaహైదరాబాద్: కేసీఆర్ మంగళవారం ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోపై ప్రతిపక్ష నాయకులు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఏడాది కాలంగా ప్రకటిస్తున్న హామీలను కాపీ కొట్టి కొత్తగా టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రకటించారని ఎద్దెవా చేశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు.

అర్రాస్‌పాట అనుకుంటున్నావా కేసీఆర్?: డీకే అరుణ
కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టడానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిగ్గుండాలని, అర్రాస్ పాటలాగా పథకాలను 16కు పెంచుకుంటూ పోయారని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్ పర్సన్ డీకే అరుణ మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ దేవరద్ర నియోజకవర్గం  నేత పవన్‌కుమార్ తో కలిసి విలేఖరుల సమా వేశంలో మాట్లాడారు. గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని, కేసీఆర్‌లో ఆందోళన, అభద్రతా భావం నెలకొన్నదని అన్నారు.  టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసిపోయినందున తాము ప్రకటించిన పథకాలకు రూ.16 పెంచుతూ పాక్షిక ప్రణాళికను కేసీఆర్ విడుదల చేశారని ఆరోపిం చారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల బడ్జెట్ కూ డా సరిపోదని కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారని,వాళ్లయ్యా ఆ పథకాలనే ప్రకటిం చారని ఇప్పుడేమంటారో చెప్పాలని డీకే అరుణ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే కొత్త పథకాలను చేపడుతామని కేసీఆర్ హామీలు గు ప్పిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగాలేరని చెప్పా రు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, స్వాతం త్య్రాలను తుంగలోతొక్కిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బొందపెట్టబోతున్నారని అరుణ హెచ్చరించారు.

కేసీఆర్ బెదరింపులకు భయపడం: చిన్నారెడ్డి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి టీఆర్‌ఎస్ తన పాక్షిక ప్రణాళికను ప్రకటించిందని చిన్నారెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరిపిస్తామని కేసీఆర్ బెదరింపులకు భయపడే ప్రసక్తిలేదని చిన్నారెడ్డి హెచ్చరించారు. నాలుగేళ్ల మూడు నెలలు అధికారంలో ఉండి ఏం చేశావు? కేసీఆర్ బ్లాక్ మెయిల్ ప్రకటనలను సహించమని చెప్పారు. పింఛన్లు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.5 లక్షలు చెల్లింపు తదితర పథకాలను తమ పార్టీ చాలా రోజుల క్రితమే ప్రకటించిందని, ఆయనకు చెప్పుకునేందుకు ఏమీ లేనట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలనే మక్కికి మక్కీగా కాపీ కొట్టారని చిన్నారెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేశవరావుకు తెలియకుండానే కేసీఆర్ తమ పథకాలను ప్రకటించారని విమర్శించారు.

పాక్షిక మేనిఫెస్టోతో కేసీఆర్ డ్రామా: కిషన్‌రెడ్డి
పాక్షిక మేనిఫెస్టో పేరుతో ఆపధర్మ సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామా ఆడుతున్నారని బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు,కొత్తవి ప్రకటించి రాజకీయం పబ్బం గడుపుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017నాటికి నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించకపోతే ఓట్లు అడగనని శపథం చేశారని దానిపై సమాధానం చెప్పాలని అన్నారు. ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయడానికి వెనకడుగు వేసి ఆయన నిరుద్యోగులకు భృతి ఇస్తానంటే ఎవరు నమ్మే ిస్థ్దితిలో లేరని అన్నారు. ముందుస్తు ఎన్నికల్లో బయటపడేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బూటకపు వాగ్దానాలు చేస్తున్నాయని, గతంలో హామీలిచ్చి అమలు చేయకుండా తప్పించుకున్నారని వాటిని ప్రజలు గమనించి  తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పులు రూ.63వేల కోట్లు ఉంటే కేసీఆర్ పాలనలో రూ.లక్షల 73వేల కోట్లు చేశారని మండిపడ్డారు.దేశంలో కాంగ్రెస్ పరిిస్థ్దితి ఆధ్వాన్నంగా మారిందని, ఎంచేయల్లో తెలియక రాహుల్‌గాంధీ విపక్ష నేతలపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారని,టీఆర్‌ఎస్ కాంగ్రెస్ ఉచ్చులో పడి ప్రజలను మోసం చేస్తుందన్నారు.ఓట్లు, సీట్లు, అధికారమీదనే ఈరెండు పార్టీలు దృష్టిపెట్టి డబ్బుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌ది కాపీ పేస్ట్ యవ్వారం: ఎల్ రమణ
గత ఎన్నికల్లో తమ రూ.వెయ్యి పింఛన్, రుణమాఫీ పథకాలను కాపీ కొట్టిన కేసీఆర్, ఈసారి పెన్షన్ల పెంపు, రైతులకు ఆర్థిక భరోసా వంటి పథకాలను కాపీ కొట్టాడని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. బుధవారం, హైదరాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకతతో నాలుగు సభలతోనే సరిపెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలం గాణను, నిట్టనిలువునా అప్పుల్లో ముంచేశారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన్ను తొలగించి పార్టీని కాపాడుకోవాలని టీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. సమావేశంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బండ్రు శోభారాణి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు రమణ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.అసదుద్దీన్‌కు కిషన్ రెడ్డి కౌంటర్

Updated By ManamSat, 09/15/2018 - 18:07

asaduddin owaisi, Kishan reddy, MIM president, MahababNagar BJP public meetingమహబూబ్‌నగర్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్‌కు బీజేపీ నేత కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హైదరాబాద్‌ నుంచి పోటీచేయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరిన నేపథ్యంలో కిషన్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఎన్నికల శంఖరావ సభను ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అసదుద్దీన్కు సవాల్ విసిరారు. దమ్ముంటే అంబర్‌పేట నుంచి పోటీ చేసి గెలవాలన్నారు. కాగా, ఈ సమావేశంలో అమిత్ షా సహా బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పలువురు మాజీలు హాజరయ్యారు. అమిత్ షా వచ్చిన తర్వాతే...

Updated By ManamWed, 09/12/2018 - 18:22
 • కుటుంబ పాలనను ఓడించాలి

 • గ్రామాల్లో బీజేపీలో భారీ చేరికలు

 • ఎన్నికల షెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన

 • బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

bjp leader kishan reddy comments on party condidates list

హైదరాబాద్ : గత కొన్ని రోజలుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో మునిగిపోయాయి. కానీ బీజేపీ మాత్రం తమకేం తొందర లేదని, ముందెళ్లిన పార్టీలు తొందరగా అలసిపోతాయని ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ వంటి కుటుంబ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగేండ్ల తర్వాత ఫ్రంట్ పెడతామని టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న వారసత్వ రాజకీయాలకు బుద్ధిచెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చిన తర్వాతనే ఏ పార్టీతోనైనా చర్చలు, పొత్తులు ఉంటాయని ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ పథకాలను చూసి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత చేరుతోందని తెలిపారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయినట్టు పేర్కొన్నారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలోనూ బీజేపీనే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తీసుకువస్తున్న ఫ్రంట్‌ల‌తో టెంట్లతో తమకేమీ నష్టం లేదని విమర్శించారు. తెలంగాణలో తమ హామీలపై వస్తున్న విమర్శలను చూసి టీఆర్‌ఎస్ భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టిందని విమర్శించారు.

అసోంలో చివరి మూడు రోజుల్లో తీర్పు మారిందని, ఆంధ్రలో కూడా వారం రోజుల ముందు జగన్ ముందున్నప్పుటికీ మోదీ పర్యాటనతో టీడీపీ గెలిచిందని వివరించారు. తెలంగాణలో చేయాల్సిన కార్యచరణపై బహిరంగ సభలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అమిత్ షా సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించబోమని, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.అసెంబ్లీ రద్దు.. అప్రజాస్వామికం: కిషన్ రెడ్డి

Updated By ManamThu, 09/06/2018 - 17:22

Telangana assembly dissolve, Undemocracy, Kishan reddy, KCRహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ అప్రజాస్వామికంగా రద్దు చేశారని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం ఒత్తిడి వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీఆర్ఎస్ బొమ్మాబొరుసు లాంటివిని దుయ్యబట్టారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకో చెప్పాలని అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ ఎలా సంతృప్తి చెందారో చెప్పాలి

Updated By ManamFri, 08/10/2018 - 00:35
 • బీజేపీ నేత కిషన్ రెడ్డి డిమాండ్   

imageహైదరాబాద్: తెలంగాణలో యూనివర్శిటీల పనితీరుపై గవర్నర్ నరసింహన్  ఎలా సంతృప్తి చెందారో వివరణ ఇవ్వాలని బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజంగానే గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారా లేక మంత్రి ఆ విధంగా ప్రకటించుకున్నారో తెలియాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత యూనివర్శిటీలను దారుణంగా నిర్లక్ష్యం చేస్తోందని గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలోని మీడియా హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి విమర్శించారు.

అన్ని యూనివర్శిటీల్లో 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కనీస సౌకర్యాలు లేక హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఉస్మానియాలో కొన్ని హాస్టళ్లలో విద్యార్ధులు కాలకృత్యాలు తీర్చకునేందుకు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బాతురూమ్‌లు లేక బయటే స్నానాలు చేస్తున్నారని చెప్పారు.

టీఆర్‌ఎస్ వచ్చిన తరువాత రెండున్నర సంవత్సరాల పాటు యూనివర్శిటీలకు కనీసం వీసీలను కూడా నియమించలేదని, ఇప్పటి వరకు ఏ యూనివర్శిటీకీ పాలక మండళ్లను నియమించలేదన్నారు. ప్రభుత్వం కనీస నిధులు ఇవ్వకపోవడంతో యూనివర్శిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్నా గవర్నర్ ఎలా సంతృప్తి చెందారో చెప్పాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల రోజులు పూర్తవుతున్నా ఇంత వరకు ఎక్కడా మెస్‌లు ప్రారంభంకాలేదన్నారు.  విద్యార్ధుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌కు ఉందన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు అన్ని యూనివర్శిటీల్లో గవర్నర్ పర్యటించాలని కిషన్ రెడ్డి కోరారు.చొరబాటుదారుల వివరాలు ఇవ్వండి

Updated By ManamFri, 08/03/2018 - 01:10
 • తెలంగాణ ప్రభుత్వానికి కిషన్‌రెడ్డి డిమాండ్

kishanహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ చొరబాటుదారుల వివరాలను బయటపెట్టి కేంద్రానికి ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ సహకారంతోనే నగరానికి అక్రమ చొరబాటుదారులు వచ్చారని ఆయన ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి  విలేకరులతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీ, వారికి ఎందుకు మద్దతు ఇస్తోందోనని, కోవా అనే ఎన్జీవో సంస్థ గుర్తింపు కార్డు ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ కారణంగా హైదరాబాద్.. రోహింగ్యాలకు సేఫ్ జోన్‌గా మారిందని ఆరోపించారు. బాలాపూర్ దర్గాలో ఏకంగా బర్మా కాలనీ ఏర్పడిందని, హఫీజ్ బాబానగర్, పహాడీషరీఫ్, కిషన్‌బాగ్‌లో రోహింగ్యాలు నివాసముంటున్నారని ఆయన అన్నారు. చొరబాటుదారుల విషయం ఒక మతానికి, భాషకు, ప్రాంతానికి సంబంధించింది కాదని, దేశ సమగ్రత, ఆత్మగౌరవంతో ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో చొరబాటు దారులను పెంచి పోషించారని, దేశాన్ని నాశనం చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారే రెండు కోట్ల మంది ఉన్నారని తెలిపారు. ఇస్లాం దేశాలు కూడా రోహింగ్యాలను తీసుకోవడానికి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చే హిందువులు శరణార్థులని, వారికి ఆశ్రయం ఇవ్వడంలో తప్పులేదని కిషన్ రెడ్డి చెప్పారు.11 మంది బాలికలకు వీడిన చెర

Updated By ManamTue, 07/31/2018 - 23:19
 • యాదాద్రిలో మరో వ్యభిచార కూపం

 • పోలీసుల అదుపులో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా 

kishanయాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో వ్యభిచార కూపం నుండి 11 మంది బాలికలకు యాదాద్రి పోలీసులు విముక్తి కల్పించారు. మంగళవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ యాదాద్రి డిసిపి రాంచంద్రా రెడ్డి, ఎసిపి శ్రీనివాసాచార్యులు  సిఐలు అశోక్ కుమార్, ఆంజనేయులు తదితరులతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట గణేష్ నగర్‌లో వ్యభిచారం నిర్వహించే ముఠాకు చెందిన కొందరు  కొంత మంది బాలికలను అక్రమంగా ఎత్తుకొచ్చి, లేదా  లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వ్యభిచార కూపంలో వారిని బందీగా ఉంచినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో యాదగిరిగుట్ట పోలీసులు, ఎస్‌ఓటి పోలీసులు, ఐసిడిఎస్ అధికారులు, షీ టీము పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని గణేష్ నగర్ కాలనీలోని పలు వ్యభిచార గృహాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా 11 మంది బాలికలు బందీలుగా ఉన్నట్లు గుర్తించి, వారిని పోలీసులు, అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బాలికలను అక్రమంగా బందీలుగా ఉంచిన 8 మందిని అరెస్టు చేశారు. ఇక ఈ ముఠా సభ్యులు పలు చోట్ల నుండి అక్రమంగా బాలికలను ఎత్తుకురావడం, లేదా లక్షల రూపాయలు వెచ్చించి బాలికలను కొనుగోలు చేస్తారని సిపి భగవత్ తెలిపారు . ఆ తర్వాత వారిని తమ వ్యభిచార కూపాలకు తీసుకువచ్చి బందీలుగా ఉంచుతారు. బాలికలు త్వరగా ఎదిగేందుకు ప్రత్యేకంగా ఇంజెక్షన్లు ఇస్తారు. బాలికల్లో కొంత ఎదుగుదల వచ్చాక వారిని వ్యభిచార కూపంలోకి దించుతారు. ఇలా ఈ ముఠా వ్యవహరిస్తుందని సిపి మహేష్ భగవత్ వివరించారు.రాష్ట్రంలో విద్యారంగం నిర్వీర్యం

Updated By ManamWed, 03/21/2018 - 01:13

సర్కారు విధానాలే కారణం: కిషన్ రెడ్డి

kishan reddyహైదరాబాద్: ఉపాధ్యాయ, ఆచార్య ఖాళీల భర్తీ చేయకుండా తెలంగాణ సర్కారు విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌లో విద్యారంగానికి తగు కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని విమర్శించారు. విద్యారంగానికి సంబంధించి పలు అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా, నిర్మాణాత్మక సూచనలు చేసినా సర్కారు పట్టించుకో లేదని వివరించారు. మంగళవారం అసెంబ్లీ, మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్లకు అనుమతులిస్తున్నారు కానీ ప్రభుత్వం ఫీజు నియంత్రించడంలేదని, అధిక ఫీజుల వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలోనూ ప్రభుత్వం దాటవేత ధోరణితో ఉందన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పుచేస్తే ఎత్తిచూపే బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. టీఆర్‌ఎస్ సర్కారు మాటలు కోటలు దాటుతున్నా.. అభివృద్ధి పనులు ప్రగతి భవన్ దాటట్లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రజల్లోకి వెళ్లి నిలదీస్తామన్నారు.చెప్పేది బారెడు చేసేది జానెడు

Updated By ManamFri, 03/16/2018 - 02:32
 • ప్రభుత్వం అప్పులపై ఆధారపడింది

 • బీజేపీ నేత, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి 

kishan reddyహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని, చెప్పేది బారెడు, చేసేది జానెడు అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద  గురువారం ఆయన బడ్జెట్ గురించి మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ 25,588 ఉద్యోగాలు భర్తీ చేసిందని, లక్షకు పైగా భర్తీలు చేపడుతామన్న కేసీఆర్.. బడ్జెట్ లెక్కల ప్రకారం మిగిలిన 85 వేల ఉద్యోగాలు భర్తీ పూర్తి చేయాలంటే మరో 14 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. 2017 చివరికల్లా  హైదరాబాద్‌లో లక్ష , గ్రామీణ ప్రాంతాల్లో మరో లక్ష డబుల్ బెడ్ ఇళ్లు కడతానని, అవి పూర్తిచేయకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ గతంలో చెప్పారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే  నైతిక హక్కు లేదన్నారు. మూత పడిన పరిశ్రమలకు ఒక్క నయాపైసా కూడా కేటాయించ లేదన్నారు. రైతు రుణమాఫీల  ప్రస్తావన లేదన్నారు. హరితహారానికి నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతో పాటు కొత్త పథకాలు అమలు కావాలంటే  3 లక్షల కోట్లు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర సర్కారు అప్పులపై ఆధారపడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఉన్న 35 వేల కోట్ల బకాయిలపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదని విమర్శించారు. ఉద్యోగులకు, విలేకరులకు వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని కేసీఆర్ చెప్పారని, పథకం ప్రారంభం కాకముందే దానిని ఆరోగ్య శ్రీలో కలిపారన్నారు. హెల్త్‌కార్డ్‌లకు మొండిచెయ్యి చూపిందన్నారు. జీఎస్‌టీ, నోట్ల రద్దు వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదని, పెరిగిందన్నారు. పెట్రోల్, డీజీల్‌లపై వ్యాట్, సేల్స్ ట్యాక్స్ ఎత్తేసి, జీఎస్‌టీలో కలిపితే, లీటరు పెట్రోల్‌పై రూ.30ల వరకు తగ్గుతుందన్నారు. కోట్లాది మందికి లాభం చేకూర్చే ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు

Updated By ManamThu, 03/15/2018 - 01:24
 • ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పాలన

 • ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు

 • గవర్నర్ ప్రసంగంలో సమస్యల ప్రస్తావనేది?

 • ధన్యవాద తీర్మానంపై చర్చలో కిషన్‌రెడ్డి

kishan reddyహైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వా మ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని బీజేపీ శాసనసభపక్షనేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, మందకృష్ణమాదిగను కావాలనే రెండుసార్లు అరెస్టు చేశారని పేర్కొన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం గతంలో 29 పేజీలు ఉంటే.. ప్రస్తుతం 18 పేజీల ప్రసంగానికి తగ్గిందన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని, ఒక్క టీఆర్‌ఎస్ మాత్ర మే పాల్గొందనే భావన ప్రభుత్వానికి సరికాదని గుర్తు చేశారు. బంగారు తెలంగాణ సాధన దిశగా సభ్యులు సాగాలని గవర్నర్, సీఎం చెబుతున్నా రని.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు తెలంగాణలో లేకుండా చేశారని, ప్రజా, విద్యార్థి, కుల సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వా మ్య పాలనలో ప్రతిఒక్కరికీ విమర్శించే హక్కు ఉందని, దాన్ని ప్రభుత్వం స్వీకరించాలే తప్ప.. దాడులకు పాల్పడడం సరికాదని చెప్పారు. చట్టసభల్లో ప్రజాసమస్యల్ని ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలకు అంబేద్కర్ అవకాశం కల్పించారని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడేస్తుందన్నారు. శాసనసభ సభ్యుల సస్పెన్షన్‌పై మిగతా సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. రైతులకు బేడీలు, ధర్నా చౌక్ ఎత్తేయడం, ఎవరైనా శాసనసభ్యుడు మాట్లాడితే.. వచ్చేసారి ఏలా గెలుస్తావో.. చూస్తానని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. రైతు సమితులను టీఆర్‌ఎస్ కార్యకర్తలతో నింపారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నాటికి రూ.12 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే.. ప్రస్తుతం అది రూ.2 లక్షల కోట్లకు చేరిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో ప్రజాసమస్యల ప్రస్తావన లేకపోవడం బాధకరమని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు రీడిజైనింగ్ పేరుతో అంచనా వ్యయాన్ని ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.

Related News