rajanikanth

సంక్రాంతి బరిలో..!!

Updated By ManamSun, 09/23/2018 - 01:29

imageరజనీకాంత్ 165వ చిత్రం ‘పేట్ట’ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. సన్ పిక్చర్స్ పతాకంపై ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డార్జిలింగ్, లక్నో షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇటీవల సినిమాకు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. పగటి పూట వాచ్‌మెన్.. రాత్రిపూట మాఫియా డాన్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. త్రిష, నవాజుద్దీన్ సిద్ధికీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, మేఘా ఆకాశ్ తదితరులు తారాగణంగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.రజనీకి భారీ సెక్యూరిటీ

Updated By ManamTue, 09/11/2018 - 00:29

imageరజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రజనీ 165వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పేట్ట’ అనే టైటిల్‌ని ఇటీవల ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో రజనీ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ‘పేట్ట’ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, వారణాశిలో జరగనుంది. నెలరోజులపాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రజనీ కోసం 25 మంది పోలీసులతో భారీ సెక్యూరిటీని ఇచ్చింది. విజయ్ సేతుపతి, సిమ్రాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. మరోపక్క రజనీ నటించిన ‘2.0’ చిత్రం టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేస్తున్నారు. శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.జమిలికి రజనీకాంత్ ఓకే

Updated By ManamMon, 07/16/2018 - 00:18
  • మద్దతు తెలిపిన తమిళ సూపర్ స్టార్

  • సమయం, డబ్బు ఆదా అవుతాయని వ్యాఖ్య

rajanikanthచెన్నై: ఒకే దేశం-ఒకే ఎన్నికలు (జమిలి ఎన్నికలు)కు తమిళ సూపర్ స్టార్, ఇటీవల రాజకీయ అరంగేట్రం చేసిన రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. జమిలి ఎన్నికల ప్రతిపాదన మంచి ఆలోచన అని, దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు. త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇటీవల రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిపాదించిన జమిలి ఎన్నికలకు రజనీ మద్దతు తెలపడం విశేషం. కాగా ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. జమిలి ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, జేడీయూ, వైసీపీ వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా.. టీడీపీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.

ఈరోడ్ హీరోకు రజనీ ప్రశంస 
ఈరోడ్ హీరో, ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయతీకి తగిన బహుమతి లభించింది. రజనీకాంత్‌ను కలిసే అవకాశం రావడంతో పాటు ఆ బాలుడి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని సూపర్ స్టార్ భరోసా ఇచ్చారు. ఇటీవల పాఠశాల దగ్గర దొరికిన రూ.50 వేలు నగదును యాసిన్ పోలీసులకు అప్పగించి హీరో అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ ఆ బాలుడిని తన ఇంటికి పిలిపించారు. యాసిన్  నిజాయతీ తనను ఎంతగానో ఆకట్టుకుందని ఈ సందర్భంగా రజనీ అన్నారు. ఆ చిన్నారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాలుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు రజనీని కలిసి మాట్లాడారు.మారిన 'కాలా' రిలీజ్ డేట్.. ఎప్పుడంటే?

Updated By ManamFri, 04/20/2018 - 21:17

kaalaసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం 'కాలా'. పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని ర‌జ‌నీకాంత్ అల్లుడు, యువ క‌థానాయ‌కుడు ధ‌నుష్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. నానా ప‌టేక‌ర్‌, అంజ‌లి పాటిల్‌, హ్యుమా ఖురేషి, ఈశ్వ‌రీ రావ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 27న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా.. త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో చోటుచేసుకున్న స‌మ్మె కార‌ణంగా వాయిదా ప‌డింది. కాగా.. ఈ సినిమాని జూన్ 7న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ఈ రోజు (శుక్ర‌వారం) అధికారికంగా ప్ర‌క‌టించింది.  త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ అదే రోజున తెర‌పైకి తీసుకురానున్న‌ట్లు చిత్ర నిర్మాత ధ‌నుష్‌తో పాటు.. చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా ప్ర‌క‌టించింది. రజనీ స‌ర‌స‌న న‌టించే ఆ కథానాయిక ఎవ‌రో?!

Updated By ManamTue, 03/27/2018 - 18:14

rajinikanthప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. అటువంటి రజనీ స‌ర‌స‌న న‌టించాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు. ఇప్పుడు ఆ అవకాశం కోసం ముగ్గురు ముద్దుగుమ్మలు పోటీ పడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. కళానిధి మారన్ నిర్మాతగా.. కార్తీక్ సుబ్బరాజ‌్‌ దర్శకత్వం వహించ‌నున్న‌ ఓ సినిమాలో రజనీ నటించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.

కాగా, ఈ చిత్రంలో రజనీ సరసన నటించే కథానాయికలుగా.. త్రిష, అంజలి, దీపిక ప‌దుకొణె వంటి పేర్లు వినపడుతున్నాయి. మరి ఈ భారీ బడ్జెట్ మూవీలో రజనీతో పాటు తెరను పంచుకునే ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. రజనీ నటించిన ‘కాలా’ చిత్రం ఏప్రిల్ 27న విడుదలకు సిద్ధంగా ఉండగా.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన‌ ‘2.O’ నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.'కాలా'కు రూ.75 కోట్ల శాటిలైట్ రైట్స్‌

Updated By ManamTue, 03/20/2018 - 14:36

kaalaaసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం 'కాలా'. 'క‌బాలి' ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ర‌జ‌నీ అల్లుడు, యువ క‌థానాయ‌కుడు ధ‌నుష్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 27న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ రూ.75 కోట్ల వ‌ర‌కు అమ్ముడ‌య్యాయ‌ని వినిపిస్తోంది. స్టార్ యాజ‌మాన్యం.. అన్ని భాష‌ల‌కుగానూ ఈ సినిమా హ‌క్కుల‌ను ఈ మొత్తంలో కొనుగోలు చేసింద‌ని స‌మాచారం. ర‌జ‌నీ న‌టించిన మ‌రో చిత్రం '2.0'కి సంబంధించిన‌ శాటిలైట్స్ రైట్స్ రూ.110 కోట్ల మొత్తానికి అమ్ముడ‌య్యాయి. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇది త‌క్కువ‌నే చెప్పాలి.'2.O' టీజ‌ర్ లీక్‌పై ర‌జ‌నీ కుమార్తె స్పంద‌న‌

Updated By ManamSun, 03/04/2018 - 14:53

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ క‌ల‌యిక‌లో '2.O' సినిమా తెర‌కెక్కిన‌ విష‌యం విదిత‌మే. ఎమీ జాక్స‌న్ క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన‌ ఈ చిత్రం విడుద‌ల తేదిపై ఇప్ప‌టికీ సందిగ్ధం నెల‌కొనిఉండ‌గా.. క‌నీసం టీజ‌ర్‌నైనా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్న ర‌జ‌నీ అభిమానుల‌కు ఆ ఆశ కూడా నెర‌వేర‌డం లేదు. దీనిని ఆస‌రాగా తీసుకుని కొంత‌మంది దుండ‌గులు.. తాజాగా టీజ‌ర్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాల‌ను ఆన్ లైన్‌లో లీక్ చేసేశారు. 

ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌జ‌నీ కుమార్తె సౌంద‌ర్య స్పందిస్తూ, "అధికారికంగా విడుద‌ల కాని టీజ‌ర్‌ను ఇలా ఆన్ లైన్‌లో విడుద‌ల చేయ‌డం స‌హించ‌రానిది. ఇటువంటి వాటిని ప్రోత్స‌హించ‌కూడ‌దు. కొన్ని నిమిషాల ఆనందం కోసం నిర్మాత‌ల కృషినీ, ప్ర‌య‌త్నాన్నీ, క‌ష్టాన్నీ విస్మ‌రించి ఇలా చేయ‌డం మ‌తిలేని చ‌ర్య" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  '2.0' టీజ‌ర్ లీకైంది

Updated By ManamSun, 03/04/2018 - 12:08

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం గ‌త ఏడాది దీపావ‌ళికే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదాలు ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఆగ‌స్టు లేదా ఈ ఏడాది దీపావ‌ళికి తెర‌పైకి తీసుకువ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న యూనిట్‌కు.. ఓ షాక్ త‌గిలింది. అదేమిటంటే.. ఇప్ప‌టికే రెడీ అయిన‌ టీజ‌ర్.. గ‌త రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తోంద‌ని కోలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. టీజ‌ర్‌ను లీక్ చేసిన దుండ‌గుల‌పై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోతోంద‌ని తెలిసింది. అలాగే డ్యామేజ్‌ను కంట్రోల్ చేయ‌డానికి నిర్ణీత స‌మ‌యం కంటే ముందే ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.లెజెండ్స్‌తో మ‌రో లెజెండ్ శ్రీ‌దేవి.. రేర్ ఫొటో

Updated By ManamSun, 02/25/2018 - 22:53

srideviఅతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అకాల మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని రేర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వాటిలో అత్యంత అరుదైన ఓ ఫొటో కూడా ఉంది. అందులో శ్రీ‌దేవితో మ‌రికొంత మంది లెజెండ్స్ ఉన్నారు. వారిలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, న‌టీమ‌ణి జ‌య‌ల‌లిత‌, ఇసైజ్ఞాని ఇళ‌య‌రాజా, మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఉన్నారు. నిజంగా ఓ అరుదైన ఫొటో ఇది. ఇండ‌స్ట్రీ నిజ‌మైన లెజెండ్‌ను కోల్పోయింది - ర‌జ‌నీకాంత్‌

Updated By ManamSun, 02/25/2018 - 12:48

rajinikanthలెజండ‌రీ యాక్ట్ర‌స్ శ్రీ‌దేవి అకాల మృతి సామాన్య జ‌నం నుంచి సినీ జ‌నాల వ‌ర‌కు తీవ్ర దిగ్భ్రాంతికి లోనుచేసింది. ఆమె ఆక‌స్మిక మృతిపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న‌ స్పంద‌న‌ను ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ''నేను షాక‌య్యాను. చాలా క‌ల‌త చెందాను. ఓ మంచి స్నేహితురాలిని కోల్పోయాను. చిత్ర ప‌రిశ్ర‌మ ఓ నిజ‌మైన లెజెండ్‌ను కోల్పోయింది. ఆమె కుటుంబం, స్నేహితుల‌తో పాటు నేను కూడా ఆ బాధ‌ని అనుభ‌విస్తున్నాను'' అంటూ ర‌జ‌నీ ట్వీట్ చేశారు.  ర‌జ‌నీకాంత్‌, శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన త‌మిళ చిత్రాలు రూపొందాయి. 

Related News