exports

తగ్గిన ఎగుమతులు 

Updated By ManamWed, 10/17/2018 - 23:11

exportన్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో పెరుగుతూ వచ్చిన ఎగుమతులు 2018 సెప్టెంబర్‌లో ఎగుమతులు (గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే) 2.15 శాతం తగ్గి, 27.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనికి బేస్ ప్రభావం హెచ్చుగా ఉండడం చాలా వరకు కారణమని, ఈ తరుగుదల తాత్కాలికమేనని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. దిగుమతులు 2018 సెప్టెంబర్‌లో 10.45 శాతం పెరిగి 41.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా, వాణిజ్య లోటు 13.98 బిలియన్ డాలర్లుగా ఉంది. ‘‘ఎగుమతులలో తరుగుదల తాత్కాలిక దశ మాత్రమే. అక్టోబర్‌లో మేం డాలర్ల రూపేణా మంచి వృద్ధినే చూస్తాం. తిరిగి వర్తమాన ధోరణితో సరితూగే స్థితికి చేరుకుంటాం’’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనుప్ వాధ్వాన్ సోమవారం నాడిక్కడ మీడియా ప్రతినిధులతో అన్నారు. గత సెప్టెంబర్‌తో పోల్చి చూసుకున్నందు వల్ల 2018 సెప్టెంబర్‌లో ఎగుమతులలో వృద్ధి తగ్గినట్లు అనిపించిందని వాధ్వాన్ చెప్పారు. జి.ఎస్.టికి ముందు రేట్ల వద్ద డ్రాబ్యాక్‌ల కటాఫ్ నిర్ణయించడం వల్ల 2017 సెప్టెంబర్‌లో ఎగుమతుల్లో అసాధారణంగా 26 శాతం వృద్ధి కనిపించిందని ఆయన అన్నారు. ‘‘ఎగుమతుల రంగానికి రుణాలు పెంపొందించాలన్న డిమాండ్‌ను మేం పునరుద్ఘాటిస్తున్నాం. రుణాలు హఠాత్తుగా తగ్గిపోవడం భవిష్యత్తుకు మంచిది కాదు.  ఒకపక్క ఎగుమతులు రెండు సంఖ్యలలో వృద్ధి చెందుతున్న సమయంలో రుణాలు తగ్గడం మంచిది కాదు’’ అని ఆయన అన్నారు. మొత్తం మీద ఎగుమతులు తగ్గినప్పటికీ, విడిగా చూస్తే, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, ఫార్మాస్యూటికల్స్, నూలు, వస్త్రాలు, చేనేత ఉత్పత్తులు, ప్లాస్టిక్‌తో సహా అనేక వస్తువుల ఎగుమతులు పెరుగుదలను నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, డాలర్ల రూపంలో ఎగుమతులు 12.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు 16.1 శాతం పెరిగాయి.  ఎగుమతులలో వృద్ధి 2018-19లో సుమారుగా 16 శాతంగా ఉండగలదని వాణిజ్య మంత్రిత్వ శాఖ గత నెలలో అంచనా వేసింది. అది 2018-19 ఏప్రిల్-ఆగస్టు కాలానికి సగటు వృద్ధిని సూచిస్తోంది. ఎగుమతులు 2017-18లో 9.8 శాతం పెరిగి 302.84 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 



ఎగుమతుల్లో 19 శాతం వృద్ధి

Updated By ManamWed, 09/12/2018 - 22:33

exportsన్యూఢిల్లీ: పెట్రోలియం వంటి రంగాల ఆరోగ్యకరమైన పనితీరు వల్ల భారతదేశపు ఎగుమతులు ఆగస్టులో 19.21 శాతం వృద్ధి చెంది 27.84 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘‘ఎగుమతి వాణిజ్యం 19.21 శాతం సానుకూల వృద్ధితో  2018 ఆగస్టులో 27.84 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పెట్రోలియం మినహా, మిగిలినవాటి ఎగుమతులు కూడా 17.43 శాతం సానుకూల వృద్ధిని నమోదు చేశాయి’’ అని వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. వస్తువుల దిగుమతులు కూడా 25.41 శాతం పెరిగి ఆగస్టులో 45.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ముడి చమురు ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా, దేశానికి 17.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది. వాణిజ్య లోటు జూలైలో  ఐదేళ్ళ అత్యధిక స్థాయి 18.02 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టులో  ఎగుమతులు 16.13 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో దిగుమతులు 17.34 శాతం వృద్ధి చెందాయి.



ఎగుమతులకు ఊతమిచ్చే ప్రదర్శన

Updated By ManamFri, 02/16/2018 - 01:29

exhibitionచెన్నై: ఏడవ విడత ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ సోర్సింగ్ షో (ఐ.ఇ.ఎస్.ఎస్) చెన్నైలో 2018 మార్చి8-10 తేదీలలో జరుగనుందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది సంచికకు చెక్ రిపబ్లిక్ భాగస్వామ్య దేశంగా ఉండగా, తమిళ నాడు ఆతిథేయ రాష్ట్రంగా ఉందని ఇంజనీరింగ్ ఎగువుతుల ప్రోత్సాహక మండలి (ఇ.ఇ.పి.సి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భాస్కర్ సర్కార్ ఇక్కడ మీడియా ప్రతినిధులకు చెప్పారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, ఇ.ఇ.పి.సి ఆధ్వర్యంలో జరిగే 2018 ఐ.ఇ.ఎస్.ఎస్ సుమారు 400 ఎగ్జిబిటర్లను ఆకర్షించగలదని భావిస్తున్నారు. గత ఏడాది ప్రదర్శనను కూడా చెన్నైలోనే నిర్వహించారు. దానిలో సుమారు 300 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ‘‘ఇది కేవలం ఎగువుతుల ప్రోత్సాహక కార్యక్రమం మాత్రమే కాదు. భారతీయ రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వెసులుబాటు కల్పిస్తున్న ప్రదర్శన’’ అని ఆయన అన్నారు. ఈ షోలో తెలంగాణ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, హర్యాణా, జార్ఖండ్ రాష్ట్రాలు పాల్గొననున్నట్లు తెలిపారు. స్థానిక వ్యాపార సంస్థలకు, విదేశీ భాగస్వాములతో భాగస్వామ్యాలను పెంపొందించడం ఈ ప్రదర్శన లక్ష్యమని భారతదేశంలో చెక్ రిపబ్లిక్  రాయుబారి మిలన్ హవోర్కా చెప్పారు. ఈ కార్యక్రమంలో చెక్ ప్రతినిధి బృందాలు భాగంగా ఉంటాయి. చెక్ రిపబ్లిక్ ‘‘ఐరోపాలో పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటి’’ అని హవోర్కా అన్నారు. ఐరోపా ఖండంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో అది ఒకటని తెలిపారు.

మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధితో సహా వివిధ కేటగిరీల కింద ‘బార్క్’, ఐ.ఐ.టి మద్రాస్, సిమన్స్, కేటర్‌పిల్లర్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, చెన్నై పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ వంటి దేశ, విదేశీ దిగ్గజాలు పాల్గొననున్నాయి. ‘‘దేశ ఎగువుతులలో ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎగువుతులలో గణనీయైమెన వృద్ధి’’ కనబరచిన నేపథ్యంలో ఐ.ఇ.ఎస్.ఎస్ 2018 ప్రదర్శన చోటుచేసుకుంటోందని సర్కార్ చెప్పారు. ‘‘భారతదేశ మొత్తం ఎగువుతుల బాస్కెట్‌లో హెచ్చు ఎంప్లాయ్‌ుమెంట్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ ఎగువుతుల వాటా 26 శాతం పైగా ఉంది’’ అని ఆయన అన్నారు. 
ఈ ప్రదర్శన సుమారు 500 మంది ప్రపంచవ్యాప్త కొనుగోలుదార్లను, 10,000 మంది ట్రేడ్ సందర్శకులను ఆకర్షించగలదని భావిస్తున్నారు. మూడు చెక్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. చెన్నై ట్రేడ్ సెంటర్‌లో ఈ ప్రదర్శనను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు,  చెక్ వర్తక శాఖ మంత్రి తోమస్ హ్యూనర్ ప్రారంభిస్తారు. 





Related News