Kamal Haasan

‘భారతీయుడు 2’ నటీనటులు వీరే

Updated By ManamWed, 11/14/2018 - 12:34

Indian 2శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ నటించనున్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో భారీ విజయం సాధించిన ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెరకెక్కనుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో నటించే నటీనటుల పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. అందులో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నాడు. అలాగే కోలీవుడ్ హీరో శింబు పోలీస్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.‘ఇండియన్ 2’లో దుల్కర్ సల్మాన్..?

Updated By ManamTue, 11/13/2018 - 09:54

Kamal Haasan, Dulquer Salmaanదాదాపు 22 సంవత్సరాల తరువాత సంచలన చిత్రం ‘భారతీయుడు’ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ ప్రధానపాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ నటించనుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ విలన్‌గా కనిపించనున్నారు. 

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రతినాయకుడి ఛాయలున్న మరో పాత్ర కోసం దుల్కర్‌ను చిత్ర యూనిట్‌ సంప్రదించిందని, అందులో నటించేందుకు అతడు ఒప్పుకున్నారని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.‘సర్కార్‌’కు రజనీ, కమల్ మద్దతు

Updated By ManamFri, 11/09/2018 - 11:44

Sarkarవిజయ్ హీరోగా మురగదాస్ తెరకెక్కించిన సర్కార్‌ ఓ వైపు థియేటర్లలో దూసుకుపోతుండగా.. మరోవైపు వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో జయలలితను, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సర్కార్‌కు తమ మద్దతును ప్రకటించారు. 

‘‘సెన్సార్ బోర్డు సినిమా ప్రదర్శనకు అనుమతిచ్చాక పలు సినిమాలను తొలగించాలని డిమాండ్ చేయడం, పోస్టర్లను చించుతూ ఆందోళన చేయడం సబబు కాదు. ఇవన్నీ అననైతిక చర్యలు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా’’ అని రజనీ ట్వీట్ చేశారు. అలాగే కమల్ స్పందిస్తూ.. ‘‘సెన్సార్ ప్రక్రియ పూర్తి చేసుకున్న సర్కార్‌ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం ప్రస్తుత ప్రభుత్వానికి కొత్తేం కాదు. విమర్శలను నేరుగా ఎదుర్కోలేక ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది. కమర్షియల్ రాజకీయ నాయకులు ఎప్పటికైనా కనుమరుగైపోవాల్సిందే’’ అని ట్వీట్ చేశారు.వైఫై కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా

Updated By ManamWed, 10/31/2018 - 10:00

Shruthi Haasanలోకనాయకుడు కమల్‌హాసన్ తనయగా వెండితెరకు పరిచయమైన శృతీహాసన్ ప్రస్తుతం విద్యుత్ జమాల్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కాగా గత రెండేళ్లుగా ఈ భామ లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సెలోతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి వివాహానికి కమల్ హాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే తమ రిలేషన్‌పై ఇంతవరకు స్పందించిన శృతీహాసన్.. సోషల్ మీడియాలో మాత్రం అప్పడుప్పుడు మైఖేల్ గురించి పోస్ట్‌లు పెడుతూనే ఉంటుంది.

ఈ క్రమంలో తాజాగా మైఖేల్‌తో కలిసి తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన శృతీ.. వైఫై కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది. దీంతో మరోసారి మైఖేల్‌పై తన ప్రేమను చెప్పకనే చెప్పింది శృతీ. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసు బేధం లేకుండా ప్రతి ఒక్కరు వైఫైకి ఎంత కనెక్ట్ అయ్యారో చెప్పక్కర్లేదు. అలా వైఫై కన్నా ఎక్కువగా శృతీ, మైఖేల్‌కు కనెక్ట్ అయ్యింది.దానిపై నేను కామెంట్ చేయలేను: కమల్

Updated By ManamMon, 10/15/2018 - 13:01

Kamal Haasanచెన్నై: ప్రముఖ అయ్యప్పస్వామి ఆలయం శబరిమలలో మహిళలకు అనుమతినిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల చారిత్రాత్మక తీర్పును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై కొన్ని మహిళా సంఘాలతో పాటు పలు అయ్యప్ప సంఘాలు భగ్గుమంటున్నాయి.

ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ ఆ సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ వివాదంపై ఉలగనాయగన్, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ స్పందించారు. ‘‘ఇది భక్తులకు, సుప్రీం కోర్టుకు మధ్య సంబంధించిన విషయం. నేను కేవలం చూసేవాడిని మాత్రమే. ఈ వివాదంపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. అలాగని నో కామెంట్ అని కూడా చెప్పను’’ అంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.శృతిహాస‌న్ మ్యూజిక్ ఆల్బ‌మ్‌

Updated By ManamFri, 10/05/2018 - 15:16

Shruthi Haasanక‌మ‌ల్ హాస‌న్ ముద్దుల త‌నయ శృతిహాస‌న్. హీరోయిన్ కంటే ముందుగా సంగీత ద‌ర్శ‌కురాలిగానే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత హీరోయిన్‌గా మారి బాలీవుడ్, సౌత్ సినిమాల్లో మెప్పించింద‌నుకోండి!. అయితే ఇప్పుడు శృతిహాస‌న్ సినిమాలు చేయ‌డం లేదు. బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తుందంతే.. శృతిహాస‌న్ ఇప్పుడు ఎల‌క్ట్రానిక్ మ్యూజిక్ ప్రొడ్యూస‌ర్ న్యూక్లియాతో క‌లిసి ఓ ఆల్బ‌మ్‌కు ప‌నిచేశారు. ఈ ఆల్బ‌మ్‌లో ఉన్న పాట‌కు శ్రుతి హాస‌న్ సొంతంగా పాట రాసి, ఆమె పాడారు. న్యూక్లియాతో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ ఆల్బ‌మ్‌ను న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు ఆమె తెలిపారు. శృతి టాలెంట్‌కు న్యూక్లియా థ్రిల్ అయ్యార‌ట‌. ‘ఇండియన్ 2’ ఫస్ట్‌లుక్

Updated By ManamFri, 09/07/2018 - 10:29

Indian 2ఉలగనాయగన్ కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘ఇండియన్ 2’(భారతీయుడు 2). 1996లో ఘన విజయం సాధించిన ‘ఇండియన్’ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్ర లొకేషన్ల ఎంపిక విషయంలో తలమునకలైన దర్శకుడు శంకర్ ఇటీవలే కొన్నింటిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ ఆరంభం నుంచి ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. సేనాపతి ఈజ్ బ్యాక్ అంటూ విడుదల చేసిన ఈ లుక్‌లో కమల్ చేతితో మర్మ విద్యను ప్రదర్శిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కమల్ సరసన నయనతార నటించనుండగా.. అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.కేరళ వరద బాధితులకు కోలీవుడ్ హీరోల సాయం

Updated By ManamMon, 08/13/2018 - 09:20
Kamal Haasan, Karthi, Suriya, Vishal

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కేరళలో ముంచెత్తాయి. ఈ వర్షాలతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 54వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు కోలీవుడ్ హీరోలు నడుం బిగించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విఙ్ఞప్తి మేరకు ముందుకు వచ్చిన కోలీవుడ్ హీరోలు దాదాపు 75లక్షల విరాళాన్ని ప్రకటించారు.

అందులో కమల్ హాసన్, విజయ్ టీవీ ఛానెల్ చెరో రూ.25లక్షలు ప్రకటించగా.. సూర్య, ఆయన సోదరుడు కార్తీ కలిపి రూ.25లక్షల విరాళాన్ని ఇస్తామని చెప్పారు. అలాగే వారిని ఆదుకునేందుకు హీరో విశాల్ ముందుకొచ్చాడు. కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలను స్వీకరించిన విశాల్, వాటిని వరద బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నాడు. మొత్తానికి సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తాము హీరోలని మరోసారి నిరూపించారు కోలీవుడ్ నటులు.‘విశ్వరూపం 2’ రివ్యూ

Updated By ManamFri, 08/10/2018 - 13:07
Vishwaroopam 2

ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌:  రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌

ప్రెజెంట్స్: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌

ఆర్టిస్ట్స్: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: గిబ్రాన్‌, 

లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, 

కెమెరా: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, 

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, 

డైలాగ్స్: శశాంక్‌ వెన్నెలకంటి, 

ప్రొడ్యూస‌ర్స్: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, 

డైర‌క్ష‌న్‌: కమల్‌హాసన్‌. 

రిలీజ్ డేట్‌: 10.8.2018

క‌మ‌ల్‌హాస‌న్ అత్యంత ప్యాష‌న్‌తో తెర‌కెక్కించిన చిత్రం `విశ్వ‌రూపం`. ఆ సినిమా విడుద‌ల‌కు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కుందో తెలిసిందే. ఆ సినిమా క్లైమాక్స్ లోనే ఆయ‌న సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చారు. తొలి భాగం విడుద‌లైన నెల రోజుల్లోనే రెండో భాగం విడుద‌ల‌వుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు. ఎందుకంటే అప్ప‌టికే షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ విడుద‌ల‌కు మాత్రం ఐదు ఏళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అయినా క‌మ‌ల్ అంతే ఆస‌క్తిగా ఆ సినిమాకు ప్ర‌మోష‌న్ చేశారు. ఇంత‌కీ తొలి సినిమా ఉన్నంత ఆస‌క్తిక‌రంగా రెండో సినిమా ఉంటుందా? జ‌స్ట్ హావ్ ఎ లుక్‌... 

 

క‌థ‌: 

రా ఏంజెట్ విసాద్ అహ్మ‌ద్‌(క‌మ‌ల్ హాస‌న్‌) .. అల్‌ఖైదాలో ఓమ‌ర్(రాహుల్ దేవ్‌) వేసిన ప్లాన్‌ను లండ‌న్‌లో భ‌గ్నం చేస్తాడు. అక్క‌డ నుండి ఇండియా వెళ్లే క్ర‌మంలో ఓమ‌ర్ మ‌రో ప్లాన్ వేశాడ‌నే సంగ‌తి తెలిస్తుంది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌లో మునిగిపోయిన అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేస్తే... అవి పేలి.. పెద్ద సునామీ వ‌చ్చి.. లండ‌న్ న‌గ‌రం నాశ‌నం అయిపోతుంది. కాబ‌ట్టి అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేయాల‌నేది ఓమ‌ర్ ఆలోచ‌న‌. దాన్ని ప‌సిగ‌ట్టిన విసాద్ స‌ముద్రంలోకి త‌న భార్య నిరుప‌మ స‌హాయంతో ఆ ప్లాన్ స‌క్సెస్ కాకుండా అడ్డుకుంటాడు. అక్క‌డ నుండి ఇండియా చేరుకున్న విసాద్ త‌న పై అధికారుల‌ను క‌లిసే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా.. అత‌ని భార్య‌, అసిస్టెంట్ ఆశ్రిత‌, త‌ల్లిని ఓమ‌ర్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు విసాడ్ ఏం చేస్తాడు?  అస‌లు ఓమర్ ప్లాన్ ఏంటి? ఇండియాలో ఓమ‌ర్ వేసిన ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- క‌మ‌ల్ హాస‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌ట‌ల ప‌నితీరు

- నిర్మాణ విలువ‌లు

- కెమెరా వ‌ర్క్‌

- సీజీ వ‌ర్క్‌

 మైన‌స్ పాయింట్స్‌:

- సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువ‌గా ఉండ‌టం

- ఎడిటింగ్‌

- నేప‌థ్య సంగీతం

- క‌న్‌ఫ్యూజ‌న్ చేసేలా ఉండ‌టం

Vishwaroopam

విశ్లేష‌ణ‌:

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూనే.. సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. విశ్వ‌రూపం పార్ట్ వ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు చాలా ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. అయితే పార్ట్ వ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక సీక్వెల్‌లో పార్ట్ వ‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌న్నింటినీ క్లియ‌ర్ చేసినా.. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. యాక్ష‌న్‌సీన్స్ లో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి డూప్‌లేకుండా చ‌క్క‌గా న‌టించారు. అయితే యాక్ష‌న్ పార్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎక్క‌డా అనిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో లండ‌న్ స‌ముద్రంలోని స‌న్నివేశాల్లోని సీజీ వ‌ర్క్ బావుంది. కానీ అస‌లు ఇండియాలో సినిమా స్టార్ట‌వుతుంద‌ని అనుకున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఎటువెళుతుందో అనే సందేహం మొద‌ల‌వుతుంది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. స‌న్నివేశాలు ల్యాగ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ రాజ ఏజెంట్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. పూజా కుమార్ పార్ట్ వ‌న్ కంటే దీంట్లో గ్లామ‌ర్ శాతం పెంచారు. ఆండ్రియా యాక్ష‌న్ సీన్స్‌కే ప‌రిమితం అయ్యింది. మొత్తంగా చూస్తే.. పార్ట్ వ‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో  విశ్వ‌రూపం 2 కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌ను మిగిలుస్తుంది

చివ‌ర‌గా.. విశ్వ‌రూపం 2.. ఆస‌క్తి త‌గ్గింది 

రేటింగ్‌: 2.5/5వాయిదా పడనున్న ‘విశ్వరూపం 2’

Updated By ManamWed, 08/08/2018 - 13:39

Vishwaroopamలోకనాయకుడు కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ మళ్లీ వాయిదా పడనుందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించిన నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మామూలుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 10న విడుదల చేయాలని భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తున్న విషయం తెలిసిందే. కాగా విశ్వరూపం సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై కమల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Related News