chandu mondeti

హ్యాట్రిక్‌కు వేళాయే.. (స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamMon, 04/02/2018 - 19:53

articleతెలుగు ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌తీ సంవ‌త్సరం చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో కొత్త ద‌ర్శ‌కులు అడుగు పెడుతూ ఉంటారు. అయితే వారిలో కొంద‌రు మాత్ర‌మే మొద‌టి అడుగులో విజ‌యం సొంతం చేసుకుంటారు. అలా విజ‌యం సాధించిన ద‌ర్శ‌కుల‌లో.. అతి కొద్దిమంది మాత్ర‌మే ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగ‌మించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ న‌మోదు చేసుకుంటారు. అలా రెండు వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్లుగా పేరుతెచ్చుకున్న ఓ న‌లుగురు యువ ద‌ర్శ‌కులు ఈ ఏడాదిలో హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. వారి వైపు కాస్త‌ దృష్టిసారిస్తే..

మేర్ల‌పాక గాంధీ

merlapaka gandhiర‌చ‌యిత మేర్ల‌పాక ముర‌ళి త‌న‌యుడిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన మేర్ల‌పాక గాంధీ.. 'వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌'(2013)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు వేశారు. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సొంతం చేసుకున్న ఈ యువ నిర్దేశ‌కుడు.. రెండో ప్రాజెక్ట్ విష‌యంలో ఆచితూచి అడుగులు వేశారు. అలా.. 'ఎక్స్‌ప్రెస్ రాజా'(2016)తో రెండోసారి ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చిన గాంధీకి మ‌రో హిట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం ఈ యంగ్ డైరెక్ట‌ర్‌.. వ‌రుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న నానితో త‌న మూడో సినిమా చేస్తున్నారు. 'కృష్ణార్జున యుద్ధం' పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ఈ నెల‌ 12న విడుద‌ల కానుంది. తొలి రెండు ప్ర‌య‌త్నాల‌లో విజ‌యం సాధించిన మేర్ల‌పాక గాంధీకి మూడో ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

క‌ల్యాణ్ కృష్ణ‌

kalyan krishnaనాగార్జున లాంటి అగ్ర క‌థానాయ‌కుడితో తొలి సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డ‌మే కాకుండా.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం అందుకున్నారు యువ ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ‌. 'సోగ్గాడే చిన్ని నాయనా'(2016)తో ఈ ఫీట్ సాధించిన క‌ల్యాణ్‌.. రెండో ప్ర‌య‌త్నంలో కూడా స‌క్సెస్ అయ్యారు. నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ఆయ‌న రూపొందించిన ఆ చిత్ర‌మే 'రారండోయ్ వేడుక చూద్దాం'. గత ఏడాది వేస‌వికి విడుద‌లైన ఈ సినిమాతో ద్వితీయ విఘ్నాన్ని అధిగ‌మించారీ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం త‌న మూడో చిత్రాన్ని ర‌వితేజ‌తో 'నేల టిక్కెట్టు'గా తెర‌కెక్కిస్తున్నారు క‌ల్యాణ్‌. ఈ చిత్రం మే 24న తెర‌పైకి రానుంది. మొద‌టి రెండు సినిమాల‌తో విజ‌యాల‌ను సొంతం చేసుకున్న క‌ల్యాణ్‌.. తాజా చిత్రంతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

చందు మొండేటి

chandu mondeti'కార్తికేయ' (2014) వంటి వైవిధ్య‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చందు మొండేటి.. తొలి ప్ర‌య‌త్నంలోనే ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించారు. అలాగే విజ‌యాన్ని కైవ‌సం చేసుకున్నారు. ఆ త‌రువాత మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన 'ప్రేమ‌మ్' (2016) చిత్రాన్ని త‌నదైన శైలిలో రీమేక్ చేసి.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు స‌క్సెస్‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ యంగ్ డైరెక్ట‌ర్‌.. త‌న రెండో చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తోనే మూడో సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే 'స‌వ్య‌సాచి'. రెండు చేతుల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోగ‌ల అర్జునుడిలాంటి ఓ యువ‌కుడి క‌థ‌తో ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు చందు. జూన్ 15న సెల్యులాయిడ్‌పైకి రానున్న ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నారు చందు.

విరించి వ‌ర్మ‌

virinchiబావా మ‌ర‌ద‌ళ్ళ ప్ర‌ణ‌య క‌థ‌తో 'ఉయ్యాలా జంపాలా'(2013)ని తెర‌కెక్కించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ‌. ఆ త‌రువాత నానితో 'మ‌జ్ను' (2016) రూపొందించి.. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రామ్‌తో త‌న మూడో చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు ఈ యంగ్ డైరెక్ట‌ర్‌. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ ఫిల్మ్‌.. ఈ ఏడాది చివ‌ర‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇటీవ‌ల కాలంలో రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీ‌ను, మారుతి, కొర‌టాల శివ‌, అనిల్ రావిపూడి.. ఇలా అతికొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకుని వార్త‌ల్లో నిలిచారు. మ‌రి.. ఈ ద‌ర్శ‌కులు కూడా ఆ జాబితాలోకి చేరుతారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.                                          -మ‌ల్లిక్ పైడి‘రంగస్థలం’తో ‘సవ్యసాచి’

Updated By ManamSat, 03/24/2018 - 16:57

savyasachiనాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చందు మొండేటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. చివరి మజిలీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి షెడ్యూల్‌ను ఏప్రిల్ 12 నుంచి అమెరికాలో చిత్రీకరించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను వచ్చే వారంలో అంటే ఈ నెల‌ 27న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. ఈ నెల 30న విడుదల కాబోతున్న ‘రంగస్థలం’ సినిమాలో ఈ టీజ‌ర్‌ను ప్రదర్శించే దిశగా ఆలోచనలు కూడా సాగుతున్నాయి. ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మించింది కూడా మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో.. ఈ ఆలోచనలు కార్యరూపం దాల్చేట‌ట్టే ఉన్నాయి.

జూన్ 15న విడుద‌ల కానున్న ‘సవ్యసాచి’లో తమిళ నటుడు మాధవన్, భూమిక కీలక పాత్రలు పోషిస్తుండ‌గా.. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.'కిరాక్ పార్టీ' రివ్యూ

Updated By ManamFri, 03/16/2018 - 16:35

kirrak partyచిత్రంః కిరాక్ పార్టీ
న‌టీన‌టులుః నిఖిల్‌, సిమ్రాన్ ప‌రీంజా, సంయుక్తా హెగ్డే, సిజ్జు, హ‌నుమంతె గౌడ్‌, బ్ర‌హ్మాజీ, రాకేందు మౌళి త‌దిత‌రులు
సంగీతంః బి.అజ‌నీష్ లోక్‌నాథ్‌
ఛాయాగ్ర‌హ‌ణంః అద్వైత గురుమూర్తి
ఎడిటింగ్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌
మాట‌లుః చందు మొండేటి
స్క్రీన్ ప్లేః సుధీర్ వ‌ర్మ‌
నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌
నిర్మాణ సంస్థః ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ద‌ర్శ‌కుడుః ష‌ర‌న్ కొప్పిశెట్టి
విడుద‌ల తేదిః మార్చి 16, 2018

'హ్యాపీడేస్‌'తో న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్‌. 'యువ‌త' త‌రువాత ట్రాక్ త‌ప్పిన ఈ యువ క‌థానాయ‌కుడికి.. 'స్వామి రారా, కార్తికేయ‌, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' చిత్రాల విజ‌యం కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో.. మ‌ళ్ళీ చాన్నాళ్ళ త‌రువాత కళాశాల నేప‌థ్యంలో నిఖిల్ ఓ సినిమా చేశాడు. అదే.. 'కిరాక్ పార్టీ'. నూత‌న ద‌ర్శ‌కుడు ష‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

క‌థాంశం
kirrak partyకృష్ణ (నిఖిల్‌) మెకానిక‌ల్ ఇంజినీరింగ్ స్టూడెంట్‌. ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీలో చ‌దువుతున్న కృష్ణ‌కి.. అదే కళాశాల‌లో వివిధ బ్రాంచెస్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. మొత్తం ఆరు మంది ఉన్న ఆ బ్యాచ్‌.. కాలేజ్ లైఫ్‌ను బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్‌  మీరా (సిమ్రాన్ ప‌రీంజా)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు కృష్ణ‌. ఆమెని ఇంప్రెస్ చేయ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తాడు.  ఈ క్ర‌మంలో.. అత‌ని స‌ర‌దా చేష్ట‌ల‌కి, మంచి త‌నానికి ఇంప్రెస్ అయిన‌ మీరా కూడా కృష్ణ‌ని ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఆ విష‌యాన్ని కృష్ణ‌తో నేరుగా చెప్ప‌దు. మీరా కూడా త‌న‌ని ప్రేమిస్తుంద‌న్న విష‌యం కృష్ణ‌కి తెలిసిన మ‌రుస‌టి రోజే..  మీరా మృత‌దేహాన్ని చూసి షాక‌వుతాడు. ఆమె మ‌ర‌ణం.. కృష్ణ‌ని కుంగ‌దీస్తుంది. అంతేగాకుండా.. సాఫ్ట్‌గా ఉండే అత‌ను ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా మారిపోతాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కృష్ణ ఫైన‌ల్ ఇయ‌ర్‌. అత‌ని ఫ్రెండ్స్‌లో ఒక‌డైన‌ అర్జున్ (రాకేందు మౌళి)తో విబేధాలు వ‌చ్చి ఉండ‌డం వ‌ల్ల‌.. ఆ ఇద్ద‌రూ కాలేజ్ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తారు. ఈ పోటీలో కృష్ణ గెలుస్తాడు. ఇదే స‌మ‌యంలో.. కృష్ణ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చి ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్‌ స‌త్య (సంయుక్తా హెగ్డే) అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. కృష్ణ మాత్రం ఆమెని పెద్ద‌గా ప‌ట్టించుకోడు. అయితే.. స‌త్య మాత్రం త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకోదు. ఇంత‌కీ స‌త్య‌.. కృష్ణ ప్రేమ‌ని గెలుచుకుందా? మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయిన కృష్ణ‌, అర్జున్ మ‌ళ్ళీ క‌లుస్తారా? అస‌లు మీరా ఎందుకు చ‌నిపోయింది? త‌దిత‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌
kirrak partyక‌న్న‌డంలో విజ‌యం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. అయితే.. 'హ్యాపీడేస్‌'తో మొద‌లు పెట్టి.. ఆ చిత్రానికి ముందు, త‌రువాత వ‌చ్చిన అనేక‌ తెలుగు చిత్రాల క‌ల‌బోత‌లా ఈ సినిమా ఉంటుందే త‌ప్ప ఫ్రెష్‌గా మాత్రం ఉండ‌దు.  క‌న్న‌డ వారికి ఈ త‌ర‌హా సినిమాలు త‌క్కువ కాబ‌ట్టి.. వారికి ఈ స‌బ్జెక్ట్‌ బాగా క‌నెక్ట్ అయి ఉండొచ్చు. అయితే.. ఇలాంటి ఎన్నో సినిమాల‌ను చూసేసిన మ‌న‌వాళ్ళ‌కు ఇందులో కొత్త‌ద‌నం వెతికినా క‌న‌బ‌డ‌దు. ఏవో కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలు (కారు డిక్కీ సీన్, కృష్ణ తాత‌య్య ఫ్లాష్ బ్యాక్‌), కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ మాత్ర‌మే మెప్పిస్తాయి. అయితే.. స్నేహం, ప్రేమ‌, కాలేజ్ ఎలెక్ష‌న్స్‌.. ఇలా ప‌లు అంశాల‌తో సినిమా కాస్త గంద‌ర‌గోళంగా త‌యార‌య్యింది. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ అందించిన‌ స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్‌గా అనిపించ‌దు. అలాగే చందు మొండేటి మాట‌ల్లోనూ మెరుపుల్లేవు.  ష‌ర‌న్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం కూడా అంతంత మాత్ర‌మే. ఇక చిన్న చిన్న లాజిక్‌ల‌ను కూడా గాలికొదిలేశారు. కృష్ణ ఇంజినీరింగ్ చ‌దివేది 2012లో అయితే.. 2015లో వ‌చ్చిన 'బాహుబ‌లి' తాలుకూ స్ఫూఫ్ డైలాగ్స్ వినిపిస్తుంటాయి. అలాగే కృష్ణ ఫైనల్ ఇయ‌ర్ చ‌దివేది 2016లో అయితే.. 2017లో వ‌చ్చిన 'ఖైదీ నెం.150, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, కాట‌మ‌రాయుడు' చిత్రాల పోస్ట‌ర్లు తెర‌పై క‌నిపిస్తుంటాయి. అలాగే కాలేజ్ ఉండేది విజ‌య‌వాడ‌లో అయితే.. తెలంగాణకు చెందిన బైక్ మీద హీరో తెగ తిరిగేస్తుంటాడు. ఇవ‌న్నీ చిన్న చిన్న విష‌యాలే కానీ.. ఇలాంటి విష‌యాల‌ను కూడా గాలికొదిలేశారంటే ద‌ర్శ‌కుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఈ సినిమాని తీశారో అర్థం చేసుకోవ‌చ్చు. 

న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. నిఖిల్ ఫ‌స్ట్ ఇయ‌ర్ స్టూడెంట్‌గానూ, ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్‌గానూ లుక్స్ ప‌రంగా వేరియేష‌న్ చూపించాడు. అలాగే న‌ట‌న కూడా బాగుంది. క‌థానాయిక సిమ్రాన్ ప‌రీంజాది ప్ర‌థ‌మార్థానికే ప‌రిమిత‌మైన‌ పాత్ర‌. క్యూట్‌గా క‌నిపించ‌డ‌మే కాకుండా, చ‌క్క‌గా న‌టించింది కూడా. ఇక రెండో హీరోయిన్ సంయుక్తా హెగ్డేది ఎన‌ర్జిటిక్ క్యారెక్ట‌ర్‌. న‌ట‌న‌, న‌ర్త‌న‌.. ఇలా అన్ని అంశాల్లోనూ మెప్పించింది. అలాగే సిమ్రాన్ తండ్రిగా సిజ్జు న‌ట‌న కూడా మెప్పిస్తుంది. మిగిలిన వాళ్ళు త‌మ ప‌రిధి మేర ఓకే అనిపించుకుంటారు.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. బి.అజ‌నీష్ లోక్ నాథ్ సంగీతంలో 'ఎన్నెన్నో గురుతులు', 'గురువారం సాయంకాలం', 'ప్రాణ‌మంతా సుప్ర‌భాతం సంధ్యారాగాల కోలాహ‌లం', 'నీలో నేను' పాట‌లు సాహిత్య‌పరంగానూ, సంగీతం ప‌రంగానూ, విజువ‌ల్స్ ప‌రంగానూ బాగున్నాయి. నేప‌థ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా.. చాలా చోట్ల అవ‌స‌రానికి మించిన‌ బిల్డ‌ప్‌తో ఉండి చిరాకు పుట్టిస్తుంది. అద్వైత గురుమూర్తి కెమెరా వ‌ర్క్ బాగుంది.  ''త‌ను చ‌నిపోయిన దానికంటే.. చ‌నిపోయిన విధాన‌మే న‌న్ను ఎక్కువ బాధ‌పెట్టింది'' వంటి ఒక‌టీఅరా డైలాగుల‌ను మిన‌హాయిస్తే.. చెప్పుకోద‌గ్గ డైలాగ్స్ లేవు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
నిఖిల్ న‌ట‌న‌
పాట‌లు
కొన్ని స‌ర‌దా స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌
ద‌ర్శ‌క‌త్వం
రొటీన్ కాలేజ్ డ్రామా
స్క్రీన్ ప్లే
ల‌వ్ స్టోరీలో ఫీల్ కొర‌వ‌డ‌డం

చివ‌ర‌గా.. కొంచెం కిరాక్‌.. కొంచెం చిరాకు
రేటింగ్‌.. 2.5/5


 'స‌వ్య‌సాచి'.. ఫ‌స్ట్ పంచ్ అదిరింది

Updated By ManamFri, 03/16/2018 - 12:42

savyasachi''రెండు చేతుల్ని స‌మ‌ర్థంగా, శ‌క్తిమంతంగా వాడే వాళ్ళ‌ని స‌వ్య‌సాచి అంటారు. మ‌హాభార‌తంలో అర్జునుడి ఐదో పేరు స‌వ్య‌సాచి. ఎందుకంటే.. అర్జునుడు రెండు చేతుల‌తో ఒకే వేగంతో విలువిద్య ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డు. అలాగే మా చిత్రంలో కూడా క‌థానాయ‌కుడు త‌న‌ రెండు చేతుల్ని స‌మ‌ర్థ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ను, ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొంటాడు. అదెలాగ‌న్న‌ది తెలుసుకోవాలంటే 'స‌వ్య‌సాచి' చూడాల్సిందే'' అంటున్నారు చందు మొండేటి.

'కార్తికేయ‌', 'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంతమైన చిత్రాల త‌రువాత ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్ర‌మిది. నాగ‌చైత‌న్య టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌లైంది. సినిమా థీమ్‌ను ఈ పోస్ట‌ర్‌లో చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపించింది. కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ మూవీ జూన్ 14న తెర‌పైకి రానుంది.'కార్తికేయ' సీక్వెల్ వ‌స్తోందా?

Updated By ManamTue, 03/06/2018 - 14:52

karthikeyaయువ క‌థానాయ‌కుడు నిఖిల్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో 'కార్తికేయ' ఒక‌టి. ఈ సినిమాతోనే చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రాలేదు. అయితే.. త్వ‌ర‌లోనే వీరి క‌ల‌యిక‌లో సినిమా రానుంద‌ని.. అది కూడా 'కార్తికేయ'కి సీక్వెల్‌గా ఆ సినిమా ఉంటుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే.. నిఖిల్ తాజా చిత్రం 'కిరాక్ పార్టీ' ఈ నెల 16న విడుద‌ల కానుండ‌గా.. చందు మొండేటి తాజా చిత్రం 'స‌వ్య‌సాచి' నిర్మాణ ద‌శ‌లో ఉంది. నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా జూన్ 14న తెర‌పైకి రానుంది.'సవ్యసాచి' ఫ‌స్ట్ లుక్‌, రిలీజ్ డేట్ డిటైల్స్‌

Updated By ManamSat, 03/03/2018 - 16:07

savyasachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగచైతన్య, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సవ్యసాచి'. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 18న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను, జూన్ 14న సినిమాని విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ మాట్లాడుతూ.. "మా యూనిట్ సభ్యులందరికీ "సవ్యసాచి" ఒక స్పెషల్ ఫిలిమ్. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో నాగచైతన్య, భూమికపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం అమెరికా వెళ్లనుంది. సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న విడుదల చేయాలనుకొంటున్నాం. అలాగే మా చిత్రాన్ని జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. ఆర్.మాధవన్ పాత్ర సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక "బాహుబలి" తర్వాత కీరవాణి గారు "సవ్యసాచి"కి సంగీతం సమకూర్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది" అన్నారు.

నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందు మొండేటి.'స‌వ్య‌సాచి' ఎప్పుడంటే..

Updated By ManamSun, 02/18/2018 - 15:48

savya sachi'ప్రేమ‌మ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత యువ క‌థానాయకుడు నాగ‌చైత‌న్య‌, ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ద్వి శ‌తాధిక చిత్రాల స్వ‌ర‌క‌ర్త ఎం.ఎం.కీర‌వాణి బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల తేది గురించి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. మార్చి నెలాఖ‌రుక‌ల్లా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకోనున్న ఈ మూవీని మే 24న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారని తెలిసింది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.అమెరికా వెళ్ళ‌నున్న 'స‌వ్య‌సాచి'

Updated By ManamTue, 01/30/2018 - 20:40

savyasachi'ప్రేమ‌మ్‌'తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్నారు యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మాధ‌వ‌న్‌, భూమిక కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. కీర‌వాణి సంగీత‌మందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన‌ కీల‌క‌ షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. మార్చి నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని.. కొన్ని వారాల పాటు కొన‌సాగే ఈ భారీ షెడ్యూల్‌తో సినిమా పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. కాగా, మే నెల‌లో 'స‌వ్య‌సాచి' తెర‌పైకి రానుంది.‘సవ్యసాచి’ షెడ్యూల్ పూర్తి

Updated By ManamSat, 12/16/2017 - 17:23

savyasachiఅక్కినేని నాగ చైతన్య  క‌థానాయ‌కుడిగా నటిస్తున్న‌ 15వ చిత్రం ‘సవ్యసాచి’. 'ప్రేమ‌మ్' త‌రువాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చైతన్య చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంతో నిధి అగర్వాల్ తెలుగు తెరకు కథానాయికగా పరిచయమౌతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు. తమిళ నటుడు మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాధవన్ ఒక ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమా చేయడం ఇదే తొలిసారి. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ విషయాన్ని మాధవన్ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. “స‌వ్య‌సాచి షెడ్యూల్ పూర్త‌య్యింది.. చాలా మంచి టీంతో పనిచేసాను” అని మ్యాడీ ట్వీట్ చేసారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.'స‌వ్య‌సాచి'.. మాధ‌వ‌న్ లుక్‌

Updated By ManamSun, 12/03/2017 - 15:57

madhavan'ప్రేమ‌మ్' త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం 'స‌వ్య‌సాచి'. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఎమ్‌.ఎమ్‌.కీర‌వాణి స్వ‌ర‌క‌ర్త‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మాధ‌వ‌న్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ డిఫ‌రెంట్ స్టిల్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో మాధ‌వ‌న్‌ని నేరుగా చూపకుండా.. వెనుక‌వైపు నుంచి చూపించారు. ఉద‌యం 9.30 గంట‌ల స‌మ‌యంలో మాధ‌వ‌న్‌పై సూర్య కాంతి ప‌డుతున్న‌ట్లుగా ఈ స్టిల్ ఉంది. ఇంట్లో ఆ ప్రాప‌ర్టీస్ చూస్తే.. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప‌నితీరుకి ఎవ‌రైనా ఫిదా అయిపోతారు. సింపుల్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉంది ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చేసిన ఆ డిజైన్‌. మొత్త‌మ్మీద‌.. టైటిల్ నుంచి ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది చిత్ర‌యూనిట్. చూస్తుంటే.. 'ప్రేమ‌మ్' కాంబినేష‌న్ మ‌రో హిట్ కొట్టేలానే ఉంది.

Related News