boyfriend

ప్రియురాలిని చంపి, ముక్కలుగా కోసి...

Updated By ManamWed, 09/26/2018 - 12:14
Boyfriend kills his lover in delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను మోసం చేసిందన్న కసితో ఓ యువకుడు తన ప్రియురాలిని హతమార్చి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, శరీర భాగాలను రెండు బ్యాగుల్లో పెట్టి డ్రైనేజ్‌లో పడవేశాడు. ఈ ఘటనకు సంబంధించి రిజ్వాన్ ఖాన్ (20)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య ఆదివారం జరగగా, సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే...నిజాముద్దీన్ ప్రాంతానికి చుందిన నిజాం నగర్‌కు చెందిన రిజ్వాన్‌ను 11 నెలల క్రితం ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య చనువు పెరిగింది. అయితే ఆమె తనతో పాటు... మరో వ్యక్తితో కూడా చనువుగా ఉంటుందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై మాట్లాడుకుందాం రమ్మని పిలిచిన అతడు.. బాలికతో ఘర్షణ పడ్డాడు. 

అయితే ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కోపం పట్టలేక రిజ్వాన్... ఘటనా స్థలంలోనే బాలికపై కత్తితో దాడి చేసి, హతమార్చాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, రెండు బ్యాగుల్లో పెట్టి బారాపుల్లా ఫ్లైఓవర్ సమీపంలోని డ్రైయినేజ్‌లో పడవేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్!

Updated By ManamTue, 09/04/2018 - 01:40

ఇదేంటి.. విడ్డూరంగా ఉందనుకునేరు.. మీరు చదివినది అక్షరసత్యం. బట్టలు, నగలు, లగ్జరీ సెల్‌ఫోన్లు, సోఫాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అన్నీ అద్దెకు దొరుకుతున్న ఈరోజుల్లో బాయ్‌ఫ్రెండ్స్ కూడా రెంట్‌కు లభిస్తున్నారు. దీనికి ఓ లాజిక్ ఉందిమరి.

డిప్రెషన్‌కు విరుగుడట!!
boyfriendఅసలు బాయ్‌ఫ్రెండ్‌తో పనేంటి? అందునా అద్దెకు తెచ్చుకునేంత అత్యవసర పరిస్థితులేంటంటే.. వీరు స్ట్రెస్ బస్టర్లట. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో మెంటల్ హెల్త్ అదుపుతప్పుతోందని, బాయ్‌ఫ్రెండ్ లేనివారు, లేదా డైవర్సీలు, లేదా బ్రేకప్ అయినవారు తమ గతంనుంచి బయటపడాలంటే బాయ్‌ఫ్రెండ్ అవసరమన్నది కొందరి వాదన. ముఖ్యంగా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ‘కంపానియన్‌షిప్’ సహకరిస్తుందని మానసిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు.  ఈ బిజినెస్‌ను నడిపితే కాసులవర్షం కురుస్తుందని భావించిన కొందరు యంగ్‌స్టర్స్ ముంబైలో ‘‘రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్’’ పేరుతో యాప్ సర్వీసులు ప్రారంభించేశారు.  వయసులో ఉన్న వారికి ఒంటరితనం పెద్ద సమస్య కనుక దానికి విరుగుడు తమ యాప్ అని వ్యవస్థాపకుల్లో ఒకరైన ప్రకాష్ వివరిస్తున్నారు.  

boyfriend

గంటకు..
ఇందులో రొమాంటిక్‌గా చెప్పుకునేందుకు ఏమీ ఉండదని, కేవలం గంటకు ఇంత చొప్పున వసూలు చేస్తున్నట్టు వీరు చెబుతున్నారు. తమది ఏమాత్రం డేటింగ్ సైట్ కాదని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్న వీరి యాప్ గత నెల్లో ప్రారంభం కాగా 1,500 మంది రిక్వెస్ట్ చేస్తూ యాప్‌కు క్లైంట్లుగా మారారు. అంతేకాదు వీరు సైకియాట్రిస్ట్‌లు, న్యూట్రిషనిస్టులు వంటి వైద్యుల బృందాన్ని కూడా నిర్వహిస్తూ తమ యాప్‌లో బాయ్‌ఫ్రెండ్ కోసం రిక్వెస్ట్ చేసేవారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు.

ఎన్ని కేటగెరీలో
ఇక బాయ్‌ఫ్రెండ్ అంటే? సెలబ్రిటీనా, మోడలా, ఆమ్ ఆద్మీనా, జస్ట్ ఉద్యోగా, ఏప్రాంతం వారు..ఇలా రకరకాల కేటగెరీలు కూడా వీరు అందుబాటులో ఉంచారు. అంతేకాదు వీరు గర్ల్ ఫ్రెండ్‌ను కూడా సమకూర్చుతారు. 2018 మిస్టర్ ఇండియా అయిన మోడల్ సూరజ్ దహియా ఈ యాప్ గురించి తెలియగానే ఆడిషన్స్‌కు హాజరై సెలెక్ట్ అయ్యారు కూడా. దీంతో ఇప్పుడు ఇతను ‘‘సర్టిఫైడ్ రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’’ అయ్యారు. ‘‘ఇది కూడా ఒక జాబ్, ఇందుకు జీతం ఇస్తారు కూడా..దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.. ఇదే తప్పుకాదు, ఒక వృత్తి అంతే’’ అన్నది సూరజ్ అభిప్రాయం.  ఇతన్ని బాయ్‌ఫ్రెండ్‌గా సెలెక్ట్ చేసుకుంటే గంటకు రెండువేల నుంచి మూడువేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇక ఆమ్ ఆద్మీ బాయ్‌ఫ్రెండ్ అయితే గంటకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి.  సెలబ్స్‌కు చెల్లించాల్సిన మొత్తం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇక మంచి ఫ్యామిలీ బ్యాంక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన, చదువుకున్న, ఉద్యోగమున్న వ్యక్తులకు, ముఖ్యంగా మహిళలను గౌరవంగా చూసే వ్యక్తులనే తాము ఎంపిక చేసుకుని, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు ప్రకాష్ వివరించడం చూస్తుంటే ఆశ్చర్యమనిపించకమానదు. ప్రియుడితో ప్రియాంక పుట్టిన రోజు వేడుకలు 

Updated By ManamWed, 07/18/2018 - 20:23

Priyanka Chopra celebrates 36th birthday with boyfriend

బాలీవుడ్‌ సెక్సీ, గ్లోబల్‌ భామ ప్రియాంక చోప్రా 36వ పుట్టిన రోజు నేడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఘనంగా పుట్టిన వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ప్రియాంక తన ప్రియుడు, అమెరికన్ సింగన్ నిక్ జోనాస్‌తో కలిసి లండన్‌లోని ఓ హోటల్‌లో వేడుకలు జరుపుకుంది. ఇప్పటికే పలుమార్లు ప్రియుడితో కలిసి అడ్డంగా బుక్కయిన ఈ భామ తాజాగా మరోసారి కెమెరా కంటపడింది. ఈ సెక్సీ భామ కనపడింది ఆలస్యం కెమెరామెన్‌లు క్లిక్కుమనిపించారు. అవును తాను నిక్‌తో కలిసి పుట్టిన రోజు జరుపుకున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక ఫొటోలను సైతం షేర్ చేసింది. కాగా ప్రియాంక ప్రస్తుతం లండన్‌లో ఉంది.ప్రియుడితో వీడియో కాల్‌: హనీషా ఆత్మహత్య

Updated By ManamSun, 02/18/2018 - 12:38

Student Commits Suicide హైదరాబాద్: నవమాసాలు మోసి.. కని, పెంచి, పోషించి తమ పిల్లలకు పెద్ద చదువులు చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. క్షణికావేశంలో తనువు చాలిస్తూ తల్లిదండ్రులకు శోకం మిగిల్చి తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకు పెరిగుతోందే తప్ప తగ్గే పరిస్థితి కనిపించట్లేదు.

తాజాగా నగరంలోని కొంపల్లిలో ఎంబీఏ సెకండియర్ చదివే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శివశివాని కాలేజీ హాస్టల్‌లో హనీషా చౌదరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియుడితో వీడియో కాల్‌లో మాట్లాడుతూ లైవ్‌‌లోనే హనీషా ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి స్వస్థలం అనంతపురం జిల్లా. విషయం తెలుసుకున్న హనీషా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. హుటాహుటిన అనంత నుంచి హైదరాబాద్‌‌కు హనీషా కుటుంబీకులు బయలుదేరారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వీడియోకాల్ ఎవరికి చేసింది? లవర్స్ మధ్య అసలేం జరిగింది? ఇంత సడన్‌‌గా అమ్మాయి ఎందుకిలా చేసుకుంది? అసలు ఆత్మహత్య చేసుకోవాల్సి న పరిస్థితులు ఏమొచ్చాయి? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News