sankar

‘2.0’ టీజ‌ర్ అప్‌డేట్‌

Updated By ManamMon, 05/21/2018 - 15:48

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర టీజర్‌ను ఐ.పి.ఎల్ ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ నెల 27న ముంబైలో విడుద‌ల చేయ‌నున్నారు. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.'2.0'లో ఐశ్వ‌ర్యారాయ్‌?

Updated By ManamThu, 04/05/2018 - 22:45

aishwarya raiసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. గ‌తంలో ర‌జ‌నీ, శంక‌ర్ జట్టుక‌ట్టిన 'రోబో'లో ఐశ్వ‌ర్య క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.  తాజా చిత్రం 'రోబో'కి సీక్వెల్ కాదంటూ శంక‌ర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో ఐశ్వ‌ర్య ఎంట్రీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.'2.0'.. వి.ఎఫ్‌.ఎక్స్ వ‌రల్డ్ ఎలా ఉంటుందంటే..

Updated By ManamMon, 03/05/2018 - 17:38

2.0'రోబో' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన‌ ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ గ్ర‌హీత‌ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే సిద్ధ‌మైన '2.0' టీజ‌ర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేయ‌క‌ముందే.. ఎవ‌రో దుండ‌గులు లీక్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. చిత్ర బృందం '2.0' వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర‌ల్డ్ నుంచి స్నీక్ పీక్ అంటూ ఓ వీడియోని విడుద‌ల చేసింది. సాంకేతికంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండ‌బోతోందో ఈ వీడియో చూస్తే ఓ అంచ‌నాకి వ‌చ్చేయొచ్చు. మొత్త‌మ్మీద 'రోబో' మ్యాజిక్ మ‌రోసారి వెండితెర‌పై రిపీట్ కాబోతుంద‌న్న‌మాట‌.'2.O' టీజ‌ర్ లీక్‌పై ర‌జ‌నీ కుమార్తె స్పంద‌న‌

Updated By ManamSun, 03/04/2018 - 14:53

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ క‌ల‌యిక‌లో '2.O' సినిమా తెర‌కెక్కిన‌ విష‌యం విదిత‌మే. ఎమీ జాక్స‌న్ క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన‌ ఈ చిత్రం విడుద‌ల తేదిపై ఇప్ప‌టికీ సందిగ్ధం నెల‌కొనిఉండ‌గా.. క‌నీసం టీజ‌ర్‌నైనా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్న ర‌జ‌నీ అభిమానుల‌కు ఆ ఆశ కూడా నెర‌వేర‌డం లేదు. దీనిని ఆస‌రాగా తీసుకుని కొంత‌మంది దుండ‌గులు.. తాజాగా టీజ‌ర్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాల‌ను ఆన్ లైన్‌లో లీక్ చేసేశారు. 

ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌జ‌నీ కుమార్తె సౌంద‌ర్య స్పందిస్తూ, "అధికారికంగా విడుద‌ల కాని టీజ‌ర్‌ను ఇలా ఆన్ లైన్‌లో విడుద‌ల చేయ‌డం స‌హించ‌రానిది. ఇటువంటి వాటిని ప్రోత్స‌హించ‌కూడ‌దు. కొన్ని నిమిషాల ఆనందం కోసం నిర్మాత‌ల కృషినీ, ప్ర‌య‌త్నాన్నీ, క‌ష్టాన్నీ విస్మ‌రించి ఇలా చేయ‌డం మ‌తిలేని చ‌ర్య" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

  '2.0' టీజ‌ర్ లీకైంది

Updated By ManamSun, 03/04/2018 - 12:08

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం గ‌త ఏడాది దీపావ‌ళికే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదాలు ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఆగ‌స్టు లేదా ఈ ఏడాది దీపావ‌ళికి తెర‌పైకి తీసుకువ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న యూనిట్‌కు.. ఓ షాక్ త‌గిలింది. అదేమిటంటే.. ఇప్ప‌టికే రెడీ అయిన‌ టీజ‌ర్.. గ‌త రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తోంద‌ని కోలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. టీజ‌ర్‌ను లీక్ చేసిన దుండ‌గుల‌పై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోతోంద‌ని తెలిసింది. అలాగే డ్యామేజ్‌ను కంట్రోల్ చేయ‌డానికి నిర్ణీత స‌మ‌యం కంటే ముందే ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.క‌మ‌ల్‌కు జోడీగా న‌య‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:02

nayanర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, సూర్య‌.. ఇలా త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. ఈ జాబితాలో మిగిలి ఉన్న మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తోనూ క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'భార‌తీయుడు' (1996) చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు న‌య‌న‌తార పేరు ప‌రిశీలిస్తున్నార‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నున్న '2.0'?

Updated By ManamTue, 01/30/2018 - 19:27

2.0ర‌జ‌నీకాంత్ అభిమానులే కాకుండా భార‌తీయ సినీ ప్రేమికులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం '2.0'. ద‌క్షిణాది అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రం నిర్మాణ వ్య‌వ‌హారాలు పూర్తిచేసుకున్నా.. వి.ఎఫ్‌.ఎక్స్ కార‌ణాల‌తో విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తోంది. తొలుత దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న సినిమా కాస్త‌.. జ‌న‌వ‌రి 26కి వాయిదా ప‌డింది. అక్క‌డితో ఆగ‌కుండా.. ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న చెన్నై క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం మ‌రో మారు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో 2, 3 నెల‌ల త‌రువాతే '2.0' తెర‌పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించిన '2.0'లో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్వ‌రాలు అందించారు.ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ‘2.0’ టీజ‌ర్‌?

Updated By ManamSun, 01/28/2018 - 23:26

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌,  సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ చిత్రం ‘2.0’. ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. వేస‌వి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్  ట్విట్ట‌ర్‌లో ప్రకటించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ టీజ‌ర్ కార్యక్రమం జరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచార‌మ్‌. ఒకేసారి.. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన‌ టీజర్‌ల‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ న‌టుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ అగ్ర‌తార‌లు మోహన్‌లాల్‌, మమ్ముట్టి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.త్వ‌ర‌లోనే ‘2.0’ టీజ‌ర్‌

Updated By ManamFri, 01/26/2018 - 18:10

2.0'శివాజీ', 'రోబో' వంటి సంచ‌ల‌న విజ‌యాల త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం ‘2.0’. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 26న విడుద‌ల కావాల్సిన ఈ సినిమాని వీఎఫ్‌ఎక్స్ ప‌నులు పూర్తికాని కార‌ణంతో వేస‌వికి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ మ‌ధ్య జ‌న‌వ‌రి 6న ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కాబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక్ డే సందర్భంగా దర్శకుడు శంకర్‌ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘2.0’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశారు. ‘‘2.0’ టీజర్‌కు సంబంధించిన పని ఇప్పుడు లాస్‌ ఏంజిల్స్‌లోని మాబ్‌సీన్‌ సంస్థలో వేగంగా జరుగుతోంది. అదంతా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో కూడుకున్న పని. ఒకసారి అది పూర్తయితే టీజర్‌ను విడుదల చేసేస్తాం’ అంటూ ట్వీటారు.
 'భార‌తీయుడు 2'కి '2.0' ర‌చ‌యిత‌

Updated By ManamThu, 01/25/2018 - 23:06

sankarక‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'భార‌తీయుడు' (1996) ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌ళ్ళీ 22 ఏళ్ళ త‌రువాత ఈ సినిమాకి కొన‌సాగింపుగా మ‌రో చిత్రం రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్‌కి ర‌చ‌యిత‌గా జ‌య‌మోహ‌న్ ఎంపిక‌య్యారు. ప్ర‌స్తుతం శంక‌ర్ రూపొందిస్తున్న '2.0'కి కూడా ఆయ‌నే ర‌చ‌యిత‌. ఆ సినిమా విష‌యంలో జ‌య మోహ‌న్ ప‌నితీరు న‌చ్చ‌డంతో.. 'భార‌తీయుడు' సీక్వెల్‌కి కూడా ఆయ‌న‌నే ఎంచుకున్నార‌ట శంక‌ర్‌. కాగా విజ‌య్‌, మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి కూడా జ‌య మోహ‌న్ ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related News