Rice

బాస్మతియేతర బియ్యం దిగుమతికి చైనా ఓకే

Updated By ManamThu, 09/27/2018 - 22:11

rice-millన్యూఢిల్లీ: ఇండియా నుంచి బాస్మతియేతర బియ్యం దిగుమతులకు చైనా అనుమతించింది. వంద టన్నులతో కూడిన మొదటి కన్‌సైన్‌మెంట్ నాగపూర్ నుంచి శుక్రవారం బయలుదేరుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ కన్‌సైన్‌మెంట్‌ను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని ‘కాఫ్కో’ అందుకోనుంది. ప్రభుత్వం సమన్వయం తో ఎన్నో ప్రయత్నాలు చేసిన పిమ్మట ఇండియా నుంచి చైనాకి బాస్మతియేత ర బియ్యం ఎగుమతి చేసేందుకు 19 రైస్ మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్లు రిజిస్టరయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు పక్షాలు ఫిటో-శానిటరీ ప్రోటోకాల్‌పై జూన్‌లో సంతకాలు చేశాయి. ప్రపంచంలో బియ్యానికి ప్రధాన మార్కెట్ అయిన చైనా ఇండియా నుంచి ఇంతవరకు బాస్మతి బియ్యం దిగుమతికి మాత్రమే అనుమతిస్తూ వచ్చింది. దేశం నుంచి 2016-17లో 2.53 బిలియన్ డాలర్ల విలువైన బాస్మతియేతర బియ్యం ఎగుమతికాగా, 2018 ఫిబ్రవరి-ఏప్రిల్ కాలంలో 3.26 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. తన వ్యవసాయ వస్తువులకు చైనా మరింతగా మార్కెట్ సౌలభ్యం కల్పించాలని భారత్  చాలా కాలంగా కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా నుంచి బాస్మతియేతర బియ్యం దిగుమతికి చైనా అనుమతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాతో భారత్ వాణిజ్య లోటు 2017-18లో 63.12 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాన్ని తగ్గించుకునేందుకు చైనాకు ఎగుమతులు పెంచాలని భారత్ కోరుకుంటోంది. ముంచెత్తింది

Updated By ManamFri, 05/04/2018 - 00:24
  • రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు.. ఉరుములు మెరుపులతో గాలివాన 

  • ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం.. ధాన్యం రాశుల మధ్యనీరు.. వరి మొలకెత్తే దుస్థితి

  • నేలరాలిన చేతికొచ్చిన మామిడి, నిమ్మ.. పలుచోట్ల కూలిన విద్యుత్ స్థంభాలు, వృక్షాలు

  • కూలిన ఇండ్లు.. కొట్టుకుపోయిన రేకుల షెడ్లు.. వివిధ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

  • అకాల వర్షం దెబ్బకు అన్నదాత కుదేలు.. హైదరాబాద్‌లోనూ జడివాన.. నిలిచిన విద్యుత్

Riceమధ్యాహ్నం తరువాత ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు.. నిమిషాల్లో కమ్ముకున్న మబ్బులు.. భారీ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో భారీ వర మొదలయింది.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొదట ప్రారంభమైన వర్షం కొద్దిసేపటికే రాష్ట్రమంతా కమ్ముకుంది. గురువారం కురిసిన అకాల వర్షం అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పలుచోట్ల ధాన్యం రాశులు వరదల్లో కొట్టుకుపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశుల మధ్య నీరు నిలిచి.. వరి ధాన్యం మొలకెత్తే పరిస్థితికి చేరింది. భీకర గాలులకు చేతికందిన మామిడి పంట నేల రాలింది.  అకాల వర్షాలకు పంట చేతికొచ్చే సమయంలో నిమ్మకాయలు నేలరాలాయి. గత నెల వరకు నిమ్మకాయ బస్తా ఒక్కింటికి రూ.200 నుంచి రూ.500 పలికింది. ఈ ధర ఏమాత్రం రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లదీయలేదు. మే నెలలో ధర పెరిగి పెట్టుబడులు చేతికొస్తాయనే ఆశతో రాష్ట్రవ్యాప్తంగా నిమ్మ రైతులు వేచిచూస్తున్నారు. చాలామంది మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో నిమ్మకాయలను తెంపడం లేదు. ఇటీవల నిమ్మకాయ బస్తా ధర రూ.వెయ్యికి చేరడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ గురువారం నాటి భారీ వర్షానికి నిమ్మకాయ నేలరాలడంతో రైతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. వడగళ్ల వానకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంగనర్, ఆదిలాబాద్ జిల్లాల్లో  ఎడతెరిపి లేకుండా భారీ గాలులతో వర్షం పడింది. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

హైదరాబాద్‌లో జడివాన..
నగరంలో ఒక్కసారిగా వాతారణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఖైరతాబాద్, బషీర్‌బాగ్, నారాయణ గూడ, అబిడ్స్, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, ట్యాంక్‌బండ్, కర్మన్‌ఘాట్, నాచారం, తార్నాక, ఓయూ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈదురు గాలుల బీభత్సానికి నెక్లెస్ రోడ్డుపై చెట్టు విరిగిపడింది. దీంతో కారు, ఆటో, రెండు ద్విచక్రవాహనాలు ధ్వసంమయ్యాయి. ఆరాంఘర్‌లో వర్షానికి ప్రహరీగోడ పక్కన నిలబడిన వారిపై గోడకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గరు మ తిచెందారు. ఎన్టీఆర్ మార్గ్‌లోనూ చెట్లు కూలాయి. మరోచోట బస్ షల్టర్ ఒరిగిపోయింది. విరిగిపడిన చెట్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు తొలగిస్తున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద మోకాలి లోతు నీరు చేరింది.

వరంగల్, కరీంనగర్‌లో కుండపోత..
వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ర్టంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కొద్దిసేపు జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణ, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోయాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. నగరంలో చెట్లు, విద్యుత్ తీగలు, స్థంబాల పడిపోతే కార్పొరేషన్ అధికారులకు తెలియజేయాలని వారు ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 18004251980 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు.  వరంగల్‌లో కురిసిన భారీ వర్షానికి ఇద్దరు మృతి చెందారు. భీమ దేవరపల్లిలోని మల్లారంలో పిడుగుపాటుకు గురై తోడేటి కట్టయ్య అనే రైతు మృతి చెందాడు. మరోచోట గోడకూలి అయోధ్య అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు.మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ములుగు, వర్గల్ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, చెన్నూరులో ఈదురుగాలులతో వర్షం పడింది. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్‌లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.  కరీంగనర్ జిల్లా ముత్తారం మండలంలోని వివిధ గ్రామాలలో గాలివాన బీభత్సానికి అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగింది. ముత్తారం నుండి ఓడేడుకు వెళ్ళే రహదారిపై చెట్టు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాలలో పోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. అడవిశ్రీరాంపూర్ గ్రామంలో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ముత్తారం గ్రామంలో ఓ రైతుకు చెందిన మేకల కోసం ఏర్పాటు చేసిన షెడ్ కూలిపోయింది.

వరంగల్‌లో భారీగా నష్టం..
వరంగల్ నగరంలో మధ్యాహ్నం ఒంటిగంటకు చిమ్మచీకటి అలుముకునే విధంగా ఆకాశమంతా నల్లని మేఘాలతో మేఘవృతమై గతంలో ఎన్నడులేనివిధంగా గాలిదుమారం నగరాన్ని కుదిపేసింది. పెద్దపెద్ద చెట్లు విరిగి పలు వాహనాలపై పడటంతో ఆటోలు, ద్విచక్రవాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో చెట్లు విరగడం వలన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలో సుమారు గంటన్నర పాటు గాలిదుమారం భీభత్సాన్ని సృష్టించింది.  చిరువ్యాపారులు రోడ్ల పక్కన వేసుకున్న రేకుల షెడ్లు, చిన్నచిన్న డబ్బాలు గాలి భీభత్సానికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. గతంలో ఇంత పెద్ద గాలి దుమారాన్ని చూడలేదని చాలామంది పలువురు పేర్కొన్నారు. గాలితోపాటు విపరీతంగా వర్షం కురవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వహణలో కళాశాలలో కరెంటు లేక చిమ్మచీకటిలోనే విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వచ్చింది. కళాశాలలో పరీక్షల నిర్వహణకు ఇబ్బందికరంగా ఉండటం వలన అసలే ఎండాకాలం ఉక్కపోతతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగర పరిధిలోని అన్ని డివిజన్లలో గాలి దుమార భీభత్సం విపరీతంగా నష్టం కలిగింది.

వేలాది ఎకరాల్లో పంటనష్టం..
మహబూబాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి జిల్లాలలో వేలాది ఎకరాలలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. విపరీతమైన గాలి దుమారం రావడం వలన ఇప్పటికే 90శాతం కోతకు సిద్ధంగా ఉన్న వేలాది ఎకరాలలో పంట నష్టం తీవ్రంగా జరిగింది. వరి పంటనే కాకుండా ప్రస్తుతం చేతికందివచ్చిన మామిడికాయలు అకాలవర్షానికి, తీవ్రమైన గాలిదుమారానికి పూర్తిగా రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు మార్కెట్ యార్డులతో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం నీటిపాలయ్యింది.

ఖమ్మం రైతుల దయనీయం..
ఖమ్మంలో భారీ వర్షాలకు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, నేలకొండపల్లి మండలాల్లో సొసైటీలు, డీఆర్‌డీఏ, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్క జొన్న తడిసిపోయింది.

వడ్లన్నీ కొట్టుకుపోయినయ్..
నేను ఆరెకరాల్లో వరి పంటను సాగు చేశాను. మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చి పది రోజులు దాటింది. తేమ, హమాలీల కొరత పేరుతో ధాన్యం కాంటా వేయడం ఆలస్యం చేశారు. గురువారం కురిసిన అకాల వర్షానికి వడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. మార్కెట్ యార్డులో వచ్చిన వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
- డేగ ఓదెలు, మంథని, మార్కెట్ యార్డు

అప్రమత్తంగా ఉండండి
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులతోపాటు జిల్లాల అధికార యంత్రాంగాన్ని మంత్రి హరీశ్‌రావు అప్రమత్తం చేశారు. రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు అకాల వర్షాల నేపథ్యంలో మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను, మార్కెటింగ్ అధికారులను, మార్క్ ఫెడ్ అధికారులను, వేర్ హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం కురిసిన వర్షం వల్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన సరుకుల గురించి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  జాయింట్ కలెక్టర్లు మార్కెట్‌యార్డులను, కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. టార్పాలిన్‌లను వెంటనే సమకూర్చి తడవని సరుకులను వెంటనే గోదాముల్లోకి తరలించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని సూచించారు. గాలి దుమారానికి, భారీ వర్షానికి కొన్ని గోదాములపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని  మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.బియ్యంలో కేన్సర్ నిరోధకత

Updated By ManamMon, 02/19/2018 - 03:23
  • మూడు రకాల వంగడాల గుర్తింపు

  • ఐజీకేవీ, బార్క్ పరిశోధకుల వెల్లడి

  • లంగ్, బ్రెస్ట్ కేన్సర్లపై ప్రభావం

Riceరాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో లభించే కొన్ని రకాల బియ్యంలో పలు కేన్సర్లను నిరోధించే శక్తి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇక్కడ సంప్రదాయ పంటల నుంచి సేకరించే గత్వాన్, మహారాజి, లైచా రకాలలో ఈ గుణాలను గుర్తించినట్లు ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయం (ఐజీకేవీ), బాబా అణుపరిశోధనా సంస్థ(బార్క్) పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మూడు రకాలకు ఊపిరి తిత్తులు, రొమ్ము కేన్సర్లను నయం చేసే ప్రత్యేక లక్షణం ఉందని, అది కూడా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వకుండా తమ పని పూర్తిచేసే శక్తి ఉందని చెప్పారు. ఈమేరకు ఐజీకేవీకి చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ దీపక్ శర్మ తమ ఆవిష్కరణ ఫలితాలను మీడియాకు విడుదల చేశారు. ఈ మూడింటిలోనూ లైచా రకం బియ్యం మరింత శక్తిమంతమైనవని పేర్కొన్నారు. కేన్సర్ కారక కణాలను గుర్తించడంతో పాటు వాటిని మట్టుబెట్టడంలోనూ ఈ బియ్యం ముందుంటాయని శర్మ వివరించారు. కాగా, వివిధ రకాల పంట ఉత్పత్తులపై సంయుక్త పరిశోధనల కోసం యూని వర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) గత ఏడాది బార్క్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లో భాగంగా చేపట్టిన పరిశోధనలలో ఇదొకటని వర్సిటీ పేర్కొంది. ఈ క్రమంలో అసోసియేట్ డైరెక్టర్ వీపీ వేణుగోపాలన్ మార్గదర్శకత్వం కింద ఓ బృందం సంప్రదాయ వరి వంగడాలపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని గుర్తించారు.

Related News