salman khan

టైటిల్ మార్చిన సల్మాన్ 

Updated By ManamWed, 09/19/2018 - 11:56

Love Yatriతన బావమరిది ఆయుశ్ శర్మను హీరోగా పరిచయం చేస్తూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మించిన చిత్రం ‘లవ్ రాత్రి’. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి.. దానిని మార్చాలంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. హిందువులు పవిత్రంగా జరుపుకునే దేవీ నవరాత్రులను అవమానిస్తున్నట్లుగా టైటిల్ ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో వెనక్కి తగ్గిన సల్మాన్ టైటిల్‌ను మార్చాడు. ‘లవ్ రాత్రి’ని ‘లవ్ యాత్రి’గా మారుస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశాడు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు సల్మాన్ ఖాన్. కాగా తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? ఆ తరువాత వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయుశ్ జోడీగా హుస్సేన్ నటించింది. అభిరాజ్ మీనావాలా దర్శకత్వం వహించాడు.బిగ్‌బాస్‌లోకి మాజీ క్రికెటర్..?

Updated By ManamMon, 09/10/2018 - 15:11

sreesanthహిందీలో విజయవంతంగా దూసుకుపోతున్న బుల్లితెర షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికే 11 సీజన్‌లు పూర్తి అవ్వగా.. ఈ నెల 16 నుంచి 12వ సీజన్ ప్రారంభం కానుంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించబోయే ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నరానే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

ఇందులో భాగంగా ఇప్పటికే దీపికా కకర్, సలీన్ బానోత్, కమెడియన్ భర్తీ సింగ్, ఆమె భర్త హార్ష్ లింబాచియా ఎంపిక ఖరారు కాగా.. తాజాగా బహిష్కృత క్రికెటర్ శ్రీశాంత్‌ కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా టీమిండియాలో ఓ వెలుగు వెలిగిన శ్రీశాంత్.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇండియన్ క్రికెట్ టీం నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ తరువాత నిర్దోషిగా తేలాడు. అయినా అతడిని టీంలోకి తీసుకునేందుకు బీసీసీఐ ఒప్పుకోలేదు. ఇక క్రికెట్ నుంచి బయటకొచ్చిన శ్రీశాంత్ ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించాడు. అలాగే కేరళ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలబడి ఓడిపోయిన విషయం తెలిసిందే.నా వద్ద రెండు రకాల బంధాలు ఉన్నాయి

Updated By ManamWed, 08/15/2018 - 15:25

Salman Khanఅలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’. 1940లలో భారతదేశం, విభజన సందర్భంగా ఎదురైన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తాజాగా టీజర్‌ విడుదలైంది. అందులో కొన్ని బంధాలు నేతలో ఏర్పడుతాయి. మరికొన్ని బంధాలు రక్తంతో ఏర్పడుతాయని నాన్న చెప్పేవారు. కానీ నా వద్ద రెండు రకాల బంధాలు ఉన్నాయి అంటూ సల్మాన్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ చిత్రం నుంచి ప్రియాంక చోప్రా తప్పుకోగా ఆ స్థానంలో కత్రినా కైఫ్ నటించనుంది. దిశా పటానీ, టబు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ , టీ- సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మూడు నెలల తరువాత స్పందించాడు

Updated By ManamSat, 08/11/2018 - 13:24

salman khan‘హమ్ తో ఫిట్ ఇండియా ఫిట్‌’లో భాగంగా కేంద్ర క్రీడాశాఖమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ పలువురికి ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విసిరిన విషయం తెలిసిందే. దాన్ని స్వీకరించిన కొందరు, మరికొందరికి ఛాలెంజ్ విసురుతూ సోషల్ మీడియాలో తమ ఫిట్‌నెస్‌ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారిలో ప్రధాని నరేంద్రమోదీని మొదలుకొని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎంతమందో ఉన్నారు. అయితే ఆ తరువాత ఈ ఛాలెంజ్ కాస్త మరుగునపడగా.. తాజాగా దానిని మరోసారి టైమ్‌లైన్‌లోకి తీసుకొచ్చాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.

కేంద్రమంత్రి కిరణ్ రిజుజు విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సల్మాన్.. తాను జిమ్‌ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. అయితే కిరణ్ రిజుజు ఛాలెంజ్ చేసిన మూడు నెలల తరువాత సల్మాన్ స్పందించడం మరో విశేషం.

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

 ప్రియాంకకు హాలీవుడ్ నిర్మాతల షాక్

Updated By ManamWed, 08/08/2018 - 13:35

Priyanka Chopraప్రియాంక చోప్రాకు హాలీవుడ్ నిర్మాతలు షాక్ ఇచ్చారు. ‘కౌబాయ్‌ నింజా వికింగ్‌’ అనే చిత్రంలో నటించేందుకు ప్రియాంక డేట్లు ఇవ్వగా.. తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ప్రియాంకకు షాక్ తగిలినట్లైంది.

ఈ విషయంపై మాట్లాడిన చిత్ర నిర్మాతలు.. ‘‘ప్రస్తుతానికైతే డైరెక్టర్‌ మిచెల్‌ మెక్‌లారెన్‌ స్క్రిప్టు డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో క్రిస్‌ ప్రాట్‌తో ప్రియాంక కూడా నటిస్తారు. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది కచ్చితంగా చెప్పలేము అంటూ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక, సల్మాన్ ఖాన్ భరత్‌ను తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేసరికి లేట్ అవ్వడంతో ప్రియాంకకు పెద్ద షాక్ తగిలినట్లైంది.సల్మాన్‌కు షాకిచ్చిన జోధ్‌పూర్ కోర్టు

Updated By ManamSat, 08/04/2018 - 17:39
  • సల్మాన్‌పై జోధ్‌పూర్ కోర్టు  ఆంక్షలు 

  • అనుమతి ఉంటేనే విదేశాలకు

  • ‘కృష్ణజింక’ల కేసులో సల్మాన్‌కు కోర్టు ఆదేశం

Salman Khan Has To Seek Permission For Every Foreign Trip

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై జోధ్‌పూర్  కోర్టు పలు ఆంక్షలు విధించింది. కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి న్యాయస్థానం అనుమతి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని ఆయనకు తేల్చి చెప్పింది. విదేశాలకు వెళాల్సిన ప్రతిసారీ అనుమతి తీసుకోవాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని శనివారం స్పష్టం చేసింది. కాగా ఇరవై ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని కంకాణి గ్రామంలో రెండు కృష్ణ జింకలను వేటాడినట్లుగా సల్మాన్‌తోపాటు ఇతరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.ప్రియాంక స్థానంలో కరీనా!

Updated By ManamMon, 07/30/2018 - 03:57

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్’. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాని ఎనౌన్స్ చేసినపుడు సల్మాన్ ఖాన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించారు. ఈ సినిమా కోసం ప్రియాంక తను చేస్తున్న హాలీవుడ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఇండియా వచ్చింది.

image


తాజా సమాచారం ప్రకారం ‘భరత్’ సినిమాలో ప్రియాంక నటించడం లేదని తెలుస్తోంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయలేకపోతోందట. దీంతో మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు దర్శకనిర్మాతలు. సల్మాన్‌తో హిట్ సినిమాలు చేసిన కత్రినా కైఫ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని మొదట అనుకున్నారు. అయితే ఈ సినిమాలోని క్యారెక్టర్‌కు కరీనా కపూర్ అయితే పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెనే ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినా ‘భరత్’ చిత్రంలో కరీనానే హీరోయిన్‌గా ఫైనల్ చేసే అవకాశం ఉంది.‘అన్‌ప్రొఫెషనల్’ ప్రియాంక 

Updated By ManamSat, 07/28/2018 - 14:10

Priyanka ప్రియుడు నిక్ జోనస్‌తో పెళ్లికి సిద్ధమైన ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ చిత్రం ‘భరత్’ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు సైతం అధికారికంగా ప్రకటించారు. ప్రియాంక కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అంటూ దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ట్వీట్ చేశారు. అయితే ఇలా ఉన్నట్లుండి ప్రియాంక ఈ చిత్రం నుంచి తప్పుకోవడంపై నిర్మాత నిఖిల్ నమిత్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రియాంకను అన్‌ప్రొఫెషనల్ అంటూ నిఖిల్ పేర్కొన్నారు.

ఓ ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ.. ‘‘తన నిశ్చితార్థం కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం ప్రియాంక మాకు తెలిపింది. ఇలా చేయడం వృత్తిపట్ల ఆమె నిబద్ధతలేమిని చూపిస్తుంది’’ అంటూ అన్నారు. ఇక మరోవైపు ఈ మూవీ నుంచి ప్రియాంక తప్పుకోవడంతో ఆమె స్థానంలో కత్రినా కైఫ్ కానీ జాక్వలిన్ ఫర్నాండేజ్ కానీ ఈ ప్రాజెక్ట్‌లో చేరే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
 సల్మాన్ మూవీ నుంచి తప్పుకున్న ప్రియాంక

Updated By ManamFri, 07/27/2018 - 12:03

Salman, Priyanka

దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా..? అంటే అవుననే అంటున్నాయి అమెరికా వర్గాలు. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉండగా.. ఈ ఇద్దరి నిశ్చితార్థం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ఆమె పుట్టినరోజు వేడుకల్లోనే నిక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇక ఈ సంవత్సరంలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయంతో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ షాక్‌కు గురయ్యాడు. సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ భారత్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో ప్రియాంకను ఒక హీరోయిన్‌గా ఎంచుకొని అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఆగష్టు 10నుంచి ఆమె ఈ చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు పెళ్లికి సిద్ధమౌతున్న సమయంలో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ప్రియాంక. ఈ విషయంపై దర్శకుడు కూడా స్పష్టతను ఇచ్చాడు. 

భారత్ చిత్రం నుంచి ప్రియాంక తప్పుకుందన్న విషయాన్ని ప్రకటించిన అలీ అబ్బాస్.. ‘‘ఈ మూవీ నుంచి ప్రియాంక తప్పుకోడానికి ఒక స్పెషల్ రీజన్ ఉంది. ఆ కారణానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. భారత్ టీం ప్రియాంక చోప్రాకు బెస్ట్ విషెస్ చెబుతోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు.‘వెరైటీ’ టాప్ 500 వ్యక్తుల జాబితాలో మనోళ్లు

Updated By ManamMon, 07/23/2018 - 00:44
  • అంబానీలు, సల్మాన్, ప్రియాంకకు చోటు

Ambani, Salman, Priyankaన్యూయార్క్:  అపర  కుబేరులైన అంబానీ సోదరులు, బాలీవుడ్ సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రాతో పాటు మరో డజను మంది భారతీయ ప్రముఖులు అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలుగా ‘వెరైటీ మ్యాగజీన్’ పేర్కొంది.  రెండు ట్రిలియన్ అమెరిక్ డాలర్ల విలువైన ప్రపంచ వినోద రంగాన్ని శాసిస్తున్న 500 మంది వ్యాపారవేత్తల జాబితాలో మనవారికి ప్రముఖ స్థానం దక్కడం విశేషం.  ఈమేరకు వెరైటీ పత్రిక వెబ్‌సైట్‌లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, కరణ్ జోహర్, స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రా, యష్ రాజ్ ఫిలిమ్స్‌కు చెందిన ఆదిత్యా చోప్రా, బాలాజీ టెలిఫిలిమ్స్‌కు చెందిన ఏక్తా కపూర్, జీ ఎంటర్‌టైన్ మెంట్ సీఈఓ పునీత్ గోయెంకా, ఫిలిం-టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్  ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన సిద్ధార్థా కపూర్ పేర్లను పేర్కొంది. 12 నెలలపాటు వీరిపై లోతైన పరిశోధన జరిపి వ్యక్తులను ఎంపిక చేసినట్టు వెరైటీ పత్రిక వివరించింది.  500 మందితో కూడిన ఈ జాబితాలో తొలి స్థానం వాల్ట్ డిస్నీ కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ రాబర్ట్ ఐగర్‌కు దక్కింది. నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్, రచయిత్రి జేకే రౌలింగ్, పాప్ స్టార్ బియాన్స్, యూట్యూబ్ సీఈఓ వంటి ప్రముఖులు కూడా జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో ఉన్నారు.

Related News